తేనెధారలు
03, అక్టోబర్ 2024 గురువారము
చదువుము : నెహెమ్యా 2:1-5
‘‘... నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. ... యెహోవాయే నాకు బలము, ఆయన నాకు రక్షణాధారము’’ (యెషయా 12:2)
రాజైన అహష్వేరోషుకు నెహెమ్యా బదులిస్తూ ‘‘నేను మిగుల భయపడుచున్నాను’’ అని చెప్పిన మాట ‘‘నన్నెంతో భయపమావరించినది’’ అని తర్జుమా చేయవచ్చు. అతడెందుకు భయపడెను ? రెండు కారనాలను బట్టి కావచ్చు - మొదటిగా, అతని ముఖము విచారముగా ఉండెను. అయితే రాజు సన్నిధిలో అతడు ఎంతో సంతోషంగా కనబడవలసియున్నదని అతనికి తెలిసేయుండును. రాజు ఎదుట విచారంగాను, దు:ఖముఖముతోను ఉండువారు తీవ్రంగా శిక్షింపబడవలసియుండును. రెండవదిగా, పారసీక రాజుకు కోపము రేగునట్లు యెరూషలేము గోడలు తిరిగి కట్టించుటకు అనుమతి కోరబోవుచుండెను గనుక అతనికి మరణశిక్ష విధింపబడునని. అయితే అదృష్టవశాత్తు నెహెమ్యా యొక్క విశ్వాసము అతని భయముకంటె ఎంతో గొప్పదైయుండెను. దేవుని వాగ్ధానములను అతడు నమ్మెను గనుక ధైర్యముగా ప్రవర్తించెను. భయముతో కృంగునట్లు చేయక అతని భయము అతనిని ముందుకు సాగుటకు ప్రేరేపించినది. ఈ ప్రాముఖ్యమైన కొన్ని నిమిషాల కొరకు కొన్ని నెలలు అతడు చేసిన ప్రార్థన అతనిని సిద్ధపరచెను. ‘‘నీ ముఖమెందుకు విచారముగా ఉన్నది ?’’ అని రాజు అతనినడిగినప్పుడు నెహెమ్యా తన స్వదేశమునకు వెళ్ళవలెనను తన కోరిక రాజుకు వివరించెను. యెరూషలేము పేరెత్తకుండా అతడెంతో వివేకము చూపెను. యెరూషలేము యొక్క చరిత్ర, దాని పేరు ప్రఖ్యాతలు రాజుకు కోపము తెప్పించునేమోయని అతడు తలంచియుండవచ్చు కావున తన సొంత మార్గము నెంచుకొనెను.
ప్రియ మిత్రులారా, మీరీ దినము దేని విషయమైన భయపడుచున్నారా ? గతములో జరిగిన వాటి విషయము గానీ, లేక ప్రస్తుత విషయాల్లో, భవిష్యత్తులో ఏమి సంభవించునో యని భయపడుచున్నారా ? మనము తీసుకొనవలసిన తీర్మానాలు ఎరిగియుండియు తీసికొనకుండా భయము మనలను అరుదుగా ఆపుచుండునని గుర్తు పెట్టుకొనుడి. భయము మనలను చేతకానివారిగా చేయును. గనుక మీ భయము స్థానంలో దేవుని వాగ్ధానాలయందలి విశ్వాసమునుంచుము. ఆయనను నమ్మి, ఆయనపై ఆనుకొని ముందుకు కొనసాగుడి. మనుష్యుల దృష్టిలో దేవుడు మీకు దయ పుట్టించి విజయము ననుగ్రహించును.
ప్రార్ధన:- విశ్వాసమునకు కర్తjైు దానిని కొనసాగించు ప్రభువా, భయాందోళనలలో ఉన్నప్పుడు నీయందే విశ్వాసముంచు కృపనిమ్ము. భయముతో బిక్క చచ్చిపోక ఆ పరిస్థితిని నీ స్వాధీనంలోకి తీసికొందువని నమ్ముచు, సరైన మార్గంలో నడచి విజయమొందునట్లు నీ జ్ఞానముతో నన్ను నింపుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రీ, ఆమెన్.
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonline.com
Comments