తేనెధారలు
02, అక్టోబర్ 2024 బుధవారము
చదువుము : లూకా 7:1-10
‘‘... ప్రభువా, ... నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను... అయితే మాట మాత్రము సెలవిమ్ము’’ (లూకా 7:6,7)
‘‘తగ్గించుకొనుటను’’ బలహీనత అని అనేక మంది భావించుదును. కానీ కానే కాదు. తగ్గింపు బలమైయున్నది. దీనిలో సంపూర్ణమైన ధైర్యమున్నది. దీనునిగా ఉండుట ఒక వ్యక్తికి ధైర్యం కావలెను. ఈ దీనత్వములో మనమెలా ఎదగవలెను ? మన అసమర్థతను, క్రీస్తు ప్రభువు యొక్క సమర్థతను చూచుట ద్వారా అసలైన దీనత్వము వస్తుంది. ఆ శతాధిపతి యొక్క దాసుడు చావ సిద్ధమైయుండెను (లూకా 7:2). అతని రోగమును గానీ, మరణమును గానీ ఆ శతాధిపతి బాగుచేయించలేని నిస్సహాయ స్థితిలో ఉండెను. అతడు తన అసమర్థతను అదే విధముగా క్రీస్తు యొక్క సమర్థతను కూడా చూచెను. గనుక అతడు యేసుతో ‘‘ఒక్క మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు బాగుపడెను’’ అని చెప్పెను. (లూకా 7:7). కపటమైన దీనత్వము ‘‘నేనేమి చేయలేను’’ అని చెప్పి అక్కడితో ఆగిపోవును. నిజమైన తగ్గింపు అయితే ‘‘నేను సమస్తము చేయగలను, కానీ నన్ను బలపరచు క్రీస్తునందే నేను సమస్తము చేయగలను’’ అని (ఫిలిప్పీ 4:13) చెప్పి, సహాయము కొరకు దేవుని వేడుకొనును.
ప్రియ మిత్రులారా, తగ్గింపు కలిగిన ఆ శతాధిపతి వంటి సేవకుల కొరకు ప్రభువు చూచుచున్నాడు. గనుక క్రీస్తును గూర్చి ఆయన సర్వాధికారిjైున దేవుడు అను ఘనపరచు దృష్టి మొదట మనము కలిగియుండి అప్పుడు అసాధ్యమైన వాటికొరకు ఆయనను నమ్ముదము. రెండవది, మనపట్ల మనము అయోగ్యులము, అసమర్థులము అనియు, అయితే క్రీస్తు ప్రభువు కృపగలవాడు మరియు సర్వజ్ఞుడు అను దృష్టి కలిగియుందము. మూడవది, నిస్సహాయ స్థితిలో ఉన్న వారిపట్ల కనికరముతో నింపబడి, క్రీస్తుయొక్క కృప వారు పొందునట్లు వారియందు లక్షముంచుదము. దీనులకు కృప అనుగ్రహించును, అహంకారులను ఎదిరించును అని గుర్తు పెట్టుకొనుడి (యాకోబు 4:6)
ప్రార్ధన:- ప్రియ ప్రభువా యేసు, ఆ శతాధిపతి వలె నేను నిజమైన తగ్గింపు కలిగి, నా అంతట నేనేమియు చేయలేని నా కొరకు సమస్తము నీవే చేయుదువని గుర్తించి నమ్ము కృపనిమ్ము. నిస్సహాయ స్థితిలో ఉన్నవారి పట్ల శ్రద్ధ కలిగి ఉండి, వారి బాధ నివారణ కొరకు నీ కృపను వారనుభవించుటకు నన్ను నేను తగిన విధముగా తగ్గించుకొను కృప దయచేయుమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.
Commentaires