తేనెధారలు
చదువుము : 2 దిన వృత్తాం. 16:1-14
రాజైన ఆసాలోని మంచి, చెడులు
‘‘‘యెహోవా, విస్తారమైన చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్న ఎవరును లేరు’’ - 2 దిన వృత్తాం. 14:11
యూదా రాజులలో ఆసా ఒక మంచి రాజు. అతడు దేవుని హృదయపూర్వకముగా వెదకినవాడే కాదు గానీ తన దేశ జనులందరికి కూడా దేవుని సేవించుచు విధేయులగునట్లు ఆజ్ఞాపించిన రాజు. ఒకసారి కూషీయుడైన జెరహు గొప్ప సైన్యంతో దండెత్తిరాగా ఆసా ఆ యుద్ధంలో జయము కొరకు సాయము చేయుమని దేవునికి మొఱ్ఱపెట్టెను. అతడెంతో ధైర్యవంతుడైన యుద్ధ కుమారుడైనను, అతనికి శక్తివంతమైన సైన్యము, ఎన్నో డాళ్ళు, ఈటెలు మొ॥ ఉండినను దేవుని మీద మాత్రమే అతడు నమ్మికయుంచెను. కాబట్టి దేవుడాయనను ఘనపరచి ఆకూషీయులు పూర్తిగా నశించువరకు వారిని మొత్తెను. అంతేకాకుండా అతనిని ధైర్యపరచి, అతని ఆసక్తి దేవుని పట్ల బహుగా వృద్ధి పొందుటకు కారణమైన ప్రవక్తjైున అజర్యా చెప్పిన దానికి చెవియొగ్గినందున కూడా ఆసాను దేవుడు దీవించెను. యూదా దేశమందంతటను హేయమైన విగ్రహాలను ఆసా రాజు నాశనము చేసెను. అన్యబలిపీఠాలను తొలగించి రాళ్ళను కొట్టివేసి ఆషేరా స్తంభాలను పడగొట్టెను (2 దిన వృత్తాం. 14:3). దేవునికి బలులర్పించుటకు యూదావారినందరిని యెరూషలేములో కూడుకొనుమని ఆజ్ఞాపించెనను. అంతేకాదు కొద్దివారేమి, గొప్పవారేమి, స్త్రీ పురుషులెవరైనను దేవుని వెదకని వారందరు మరణశిక్ష విధింపబడునని ఆజ్ఞ జారీచేసెను.
పెద్ద సంఖ్యలో పశువులను బలి అర్పించిన అక్కడ కూడియున్నవారందరు గొప్ప స్వరముతోను, కేకలతోను, బూరలతోను, కొమ్ములతోను గొప్ప శబ్దముతో దేవునికి ఒక ప్రమాణము చేసిరి. యూదా జనులలో గొప్ప ఉజ్జీవము రగిలివారెంతో ఆనందించిరి. అయితే దేవునియందు గొప్ప ఆసక్తి కలిగియుండిన ఆసా అతని చివరి దినాలలో దేవునిని దు:ఖపరచునట్టి రెండు బుద్ధిహీనమైన పనులు చేసెను. మొదటిది, ఇశ్రాయేలు రాజైన బయెషా అతని మీదకు వచ్చినప్పుడు అతడు ఆరాము రాజైన బెన్హదదు సాయము కోరెను గానీ దేవుని నాశ్రయింపకపోయెను. రెండవది, అతనికి కలిగిన వ్యాధిని బట్టి స్వస్థత కొరకు దేవునియందు నమ్మికయుంచుటకు బదులు వైద్యులనే సాయం కోరెను. ఇదెంత విషాదము !
ప్రియ మిత్రులారా, దేవుని కొరకు గొప్ప ఆసక్తి కలిగియున్నామా ? దేవుడు ద్వేషించునది మనమును ద్వేషించి, ఆయనకిష్టమైనదే చేయుచున్నామా? జనులను అంధకారములో ముంచు క్రైస్తవులలోని మూఢనమ్మకాలు, ఆచారాలను ధైర్యముగా ఖండిరచుచున్నామా ? ఆసావలె ప్రక్కదారి పట్టకుండా అంతము వరకు మన ఆసక్తిని కాపాడుకొందము.
ప్రార్ధన :` ప్రియ ప్రభువా, మంచి అలాగే చెడు పాఠాలు అనేకము నేర్పించిన ఆసా జీవితాన్ని బట్టి నీకు వందనాలు. ఇంకను మూఢనమ్మకాల ననుసరించు వారికొరకు వారు పూర్ణహృదయముతో నిన్ను వెదకునట్లు ప్రార్థించుచున్నాను. నా తుది శ్వాస వరకు నీకు నమ్మకంగా ఉండునట్లును నాకు సహాయము చేయుమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.
Dear Beloved,
This month we will have our chain of prayer. The chain starts on Monday, October 28th noon and ends on Tuesday October 29th noon. Let us all unite our hearts in prayer, and pray for this ministry, for our country and for various other concerns. We encourage you all to give your names through whatsApp or email and inform us which half an hour time slot you will choose to pray. Please contact office number - 9444456177. The prayer points are in English, Tamil ( click the link).
Thank you. God bless!
Yours in His service,
Samuel Premraj & Manjula Premraj
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonlin
Comments