top of page

30, నవంబర్ 2024 శనివారము || తేనెధారలు

చదువుము : 1 కొరింథీ 9:24-27

జయించువారిగా ఉండుడి ! నీ బహుమానము అధికమగును !


'‘... జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను’’ (ప్రక 3:21)


చాలామంది ఈ జీవన పయనమును చక్కగా ఆరంభించుదురు. కానీ వారు విచారకరముగా మార్గమధ్యములో పడిపోవుటయో లేక వారి గమ్యము నుండి మరల్చబడుటయో జరుగుచుండును. మన పరుగుపందెమును ఎలా ఆరభించితిమో అనేది ముఖ్యము కాదు గానీ ఎలా ముగించుదుమో అదే ముఖ్యము. 2 తిమోతి 4:7లో ‘‘నేను మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, నా విశ్వాసము కాపాడుకొంటిని’’ అని ధైర్యముతో చెప్పెను. అతని పరుగు ఏమంత సులువైనది కాదు. ఎన్నో ఆటంకాలు, హింస, ఆకలిదప్పులు, చెర, ఉపవాసము, కరువు మొ॥వెన్నో అతడు ఎదుర్కొనెను. వాటన్నిటి మధ్యనే అతడు సహనముతో వాటిని జయించెను. అతని పరుగు ముగింపులో అతడిచ్చుచున్న సాక్ష్యమెంత గొప్పది !



ప్రియ స్నేహితులారా ! ఆయన లోకమును, అపవాదిని జయించియున్నాడు గనుక మనమును పాపము, సాతాను, చెడుగు, ఈ లోకభోగాలు, శోధనలను జయించువారిగా ఉండవలెనని దేవుడు కోరుచున్నాడు. కావున ఆయన వలె జయించువారుగా ఉండువారికి అందరికి ప్రతిఫలమిచ్చుటకు ఆసక్తి కలిగియున్నాడు. జయించువారిమైన మనకు ఆయన ఆయనతోపాటు సింహాసనము మీద కూర్చుండు హక్కు ఇచ్చును అని ఈ దిన వాక్యభాగము చెప్పుచున్నది ! ఎంత భాగ్యము ! దీనితోపాటు జయించువానికి మరెన్నో ఇతర ఆశీర్వాదాలు కూడా ఆయన ఇచ్చును. ప్రక 2:7 చెప్పుచున్నదేమనగా జీవ వృక్షఫలము భుజింపనిచ్చును అనియు, 2:17 ప్రకారము మరుగైన మన్నాను వారికి ఇచ్చుననియు 2:26 ప్రకారము అందరి మీద అధికారమిచ్చుననియు, 3:5 వారికి తెల్లని వస్త్రములును, జీవగ్రంథము నుండి వారి పేరెన్నటికి తుడిచివేయబడదు అనియు, 3:12 - దేవుని ఆలయంలో వారు స్తంభములుగా ఉందురనియు చెప్పబడినది. కావున మనలను అడ్డుకొను ప్రతిదానిని మరియు సులువుగా చిక్కులబెట్టు పాపమును తొలగించుకొందము. మన ఎదుట ఉంచబడిన పరుగును విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు ఓపికతో కొనసాగించుదము (హెబ్రీ 12:1,2) కాబట్టి మన పరుగును విజయవంతముగా ముగించి మన పరమ తండ్రి మనకొరకు దాచియుంచినవన్నిటిని పొందుకొందము. హల్లెలూయా !


ప్రార్థన :- సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన దేవా, నా బలము, జ్ఞానము, నా స్వశక్తితో నా జీవన పరుగును పరుగెత్తలేను. నా పరుగును చక్కగా ముగించి నీవు నాకొరకు దాచియుంచిన ఆశీర్వాదాలన్నిటిని పొందునట్లు నిన్ను, నీ కృపను, నీ వాక్యమును హత్తుకొనియుండుటకు నాకు సహాయము చేయుమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.


 

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI - 59.

Office: +91 9444456177 || https://www.honeydropsonline.co

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page