top of page

30, అక్టోబర్ 2024 బుధవారము

తేనెధారలు


చదువుము : మత్తయి 13:47-50, 25:31-33


సువార్తను ప్రచురించుము ! నశించువారిని రక్షించుము!!


‘‘ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని యెడల వాడు అగ్ని గుండములో పడవేయబడును’’ (ప్రక 20:15)


ఈ దిన వాక్యభాగములో చేపలు పట్టు వల, చేపలు, జాలరులను గూర్చి యేసు మాట్లాడుచున్నారు. ఆయన పరలోక రాజ్యమును గూర్చి చెప్పునప్పుడు ఏదో ఒక విధంగా అందరు ఒప్పుకొనునట్లు భ్రమపరునట్లు చెప్పలేదు కానీ చెడ్డవారు నిశ్చయముగా తీర్పులోనికిని, నీతిమంతులు అనగా యేసు రక్తములో కడగబడినవారు నిత్య రాజ్యమును స్వతంత్రించుకొందురని ఈ ఉపమానము ద్వారా వెల్లడి చేసెను. పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి, కూర్చుండి, మంచివాటిని గంపలలో చేర్చి, చెడ్డవాటిని బయట పారవేయుదురు అని చెప్పెను. మంచి చేపలు నీతిమంతులను సూచించుచుండగా, చెడ్డ చేపలు దుష్టులకు పోల్చెను. జాలరులు దేవదూతలతో పోల్చెను. నిత్యజీవమునకు వారసులైనవారు ఆ తీర్పుకు భయపడనవసరము లేదు, ఎందుకంటే తిరిగి జన్మించిన అనుభవము ద్వారా వారు ఇదివరకే మరణము నుండి జీవములోనికి దాటియున్నారు.


గనుక ఒక మనిషి యొక్క నిత్యమైన గమ్యము కేవలము తాను వ్యక్తిగతముగా యేసును అంగీకరించుట లేక తిరస్కరించుట మీదను, దేవుడనుగ్రహించు ఆయన రాజ్యమును అంగీకరించుట లేక గర్వముతో త్రోసివేయుట మీదనే ఆధారపడి యుండుననునది ఎంతో నిశ్చయము. యేసును తిరస్కరించువారికి ఈ తీర్పు, దాని వలన కలుగు ఘోరమైన ఫలితాలు నిజముగా తప్పించుకొనలేనివి. నిత్యత్వంలో అంత ఘోరంగా మనుష్యులు శ్రమనొందునట్లు అంత గొప్ప ప్రేమామయుడైన దేవుడెలా అనుమతించును అనేది కొందరికి ప్రశ్నార్ధకము. మనుష్యులను వారి పాపమును బట్టి కలుగు శిక్ష నుండి కాపాడుటకు దేవుడు తన ప్రేమ చేత తన కుమారుని పంపెను. రక్షణ, నిత్యజీవమను వరమును ఆయన వారికి అనుగ్రహించియున్నాడు. గనుక దేవుడు ఇచ్చుచున్న అట్టి గొప్ప వరమును తిరస్కరించువారెవరో వారే వారి శిక్షకు ఉత్తరవాదులు కానీ దేవుడు కానేకాదు.


	ప్రియ మిత్రులారా, క్రైస్తవులమైన మనము అవిశ్వాసులకు వారు మనలను తిరస్కరించినను, ఎలా స్పందించినను సువార్తనందించవలసి అత్యవసర ఆవశ్యకతను గుర్తించవలసియున్నది. ఏ ఒక్క వ్యక్తి యొక్క నిత్యత్వమును గూర్చి తీర్పు తీర్చు పని మనది కాదు. కేవలము ఇతరులు సువార్త తెలిసికొనునట్లు చేయుటయే మన బాధ్యత. దేవుడే మన తీర్పరి. ఈ లోకములోని తప్పుగా బోధించు మతాల ద్వారా ఎందరో మోసపోవుచు, ఇంకను యేసును గూర్చి ఎన్నడు వినని వారు లెక్కలేనంతమంది ఉన్నారు. పనిచేయుటకిదియే సమయము.
ప్రార్ధన :` న్యాయాధిపతిjైున మా తండ్రీ, తీర్పు దినమును గూర్చి నీ వాక్యము చెప్పుచునేయున్నది. అది వట్టిదేయని తమ్మును తాము మోసపరచుకొనువారిని హెచ్చరించుచున్నది. దీనిని నమ్మక వారి హృదయాలను కఠినపరచుకొనిన వారి కొరకు గొప్ప భారముతో ప్రార్థించుచుండగా వారిని ఒప్పించి, రక్షించుమని యేసునామమున వేడుచున్నాను తండ్రీ, ఆమెన్.
 

Dear Beloved,

This month we will have our chain of prayer.  The chain starts on Monday, October 28th noon and ends on Tuesday October 29th noon.  Let us all unite our hearts in prayer, and pray for this ministry, for our country and for various other concerns. We encourage you all to give your names through whatsApp or email and inform us which half an hour time slot you will choose to pray.  Please contact office number - 9444456177.  The prayer points are in EnglishTamil ( click the link).

 

Thank you.  God bless!

 

Yours in His service,

Samuel Premraj & Manjula Premraj

 

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonlin

Comentários

Avaliado com 0 de 5 estrelas.
Ainda sem avaliações

Adicione uma avaliação
bottom of page