చదువుము : 1 సమూ 17:20-32
క్రూరునిగా యుండకుము
‘‘వారి ఆగ్రహము మన పైని రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడైయుండని యెడల వారు మనలను ప్రాణముతోనే మ్రింగివేసియుందురు’’ (కీర్తన 124:2,3)
ఈ దిన వాక్యభాగములో దావీదుకు అతని అన్న ఏలియాబునకు మధ్య జరిగిన సంభాషణను గూర్చి మనము చదువుదుము. యుద్ధభూమికి వెళ్ళిన దావీదు ఫిలిష్తీయుడైన గొల్యాతు ఇశ్రాయేలీయులను అవమానపరచుచుండుటను చూచి ఎంతో కోపావేశమునకు గురియాయెను. ఈ సున్నతిలేని ఫిలిష్తీయును విషయము నేను చూచుకొందునని దావీదు ఎంతో నిశ్చయతతోను, నమ్మికతోను తెలియచేసెను (1 సమూ 17:36). ఇశ్రాయేలీయుల కాపుదల, సంరక్షణ కొరకు దేవుడు చేసిన నిబంధనకు గుర్తే ఈ సున్నతి. గొల్యాతుకు దేవునితో అట్టి నిబంధనలేదని దావీదుకు తెలుసు గనుక దావీదు దేవుని నిబంధనలో ఎంతో క్షేమంగా ఉండి ఆ గొల్యాతును ఓడిరచుదునని ధైర్యము, నమ్మిక కలిగియుండెను. అలాగే ఏలియాబుకు అతడు దావీదు సొంత సోదరునిగా ఒకే కుటుంబంలో జన్మించినను అతనికి అట్టి ధైర్యము లేకపోయెను. ఏలియాబు అనగా ‘‘దేవుడు నా తండ్రి’’, అట్టి నామము ధరించిన వానిని ఎదుర్కొనుటకు బదులుగా గొల్యాతు నిరోధించుట అవహేళన చేయుట కాదా? దావీదు యొక్క నిశ్చయతను, అతని ఉద్దేశాలను కూడా అతడు అపహసించెను. ఒక్క మాటలో చెప్పవలెనంటే అతడొక క్రూరుడు. ఇతరుల ఆలోచనలను అట్టివారు ఎగతాళి చేయుదురు. ‘‘క్రూరత్వము విషము వంటిది. అది ఎక్కడ ఉంటే అక్కడి వాతావరణమును విషపూరితము చేయును. దానితో కలిసికొంటే మన ఆత్మను, ఇతరుల ఆత్మను కూడా విషపూరితము చేయును’’ అని దెబోరా స్మిత్గారు వ్రాసిరి.
ప్రియ స్నేహితులారా, తన అన్న ఏలియాబు మాటలలో నిరుత్సాహపడకయు, ప్రక్కకు తప్పుకొనకయు ఉండి తన గురినే ఎదుట ఉంచుకొనిన దావీదువలె మనము ఉందము. మన కుటుంబ సభ్యులతోను, మన పనిచేయు ప్రదేశములలోను ‘‘ఏలియాబులు’’ మనకెదురైతే వారి విమర్శలను లెక్కచేయక దేవుడు మనకు నియమించిన పని చేయుటకు గొప్ప ధైర్యముతో ఉందము.
ప్రార్ధన :- ప్రియ ప్రభువా, ఇతరుల మేలు కొరకు నా మాటలు కృపాసహితముగాను, ప్రయోజనకరము గాను ఉండు కృపనిమ్ము. క్రూరులను నేనెదుర్కొనునప్పుడు వారి విరోధమైన మాటలకు నిరుత్సాహపడక, ప్రక్కదారి పట్టక, సమస్త పరిస్థితులలోను అనుకూలంగానే ప్రవర్తించునట్లు నీవే హత్తుకొని యుండునట్లు కృపినిమ్మని యేసునామమున వేడుచున్నాను తండ్రీ, ఆమెన్.
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI - 59.
Office: +91 9444456177 || https://www.honeydropsonline.co
Comments