top of page

29, అక్టోబర్ 2024 మంగళవారము

తేనెధారలు


చదువుము : యెషయా 41:10-15


ప్రభువా ! సదాకాలము నీవు నాతో ఉన్నావు !!


‘‘గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నీవు నాకు తోడైయుందువు గనుక ఏ అపాయమునకు భయపడను’’ (కీర్తన 23:4)


పదే పదే గడ్డు పరిస్థితులనెదుర్కొనునప్పుడు కొన్నిసార్లు మనము ‘‘ఎల్లప్పుడు జీవితము పచ్చగానే ఉంటే ఎంత బాగుండును కదా’’ అని అనుకొనునట్లు శోధింపబడుచుందుము ! అయితే ఏ ఒక్కరును, ప్రత్యేకించి దేవుని పిల్లలమైన మనము పూలపాన్పులపై పరుండము, ఎంతో మెత్తని పచ్చిక మైదానాలలో నడవము. ఖచ్చితంగా గులాబీల మధ్య ముళ్ళు ఉంటాయి, పచ్చిక మైదానాలు ప్రక్కనే గాఢాంధకార లోయలును ఉండును. ఈ మరణకరమైన లోయ ‘‘గాఢాంధకారము’’ను వివరించుచున్నది. ఇది కలవరము, తెలియని భయముతో కూడిన మాట. ఎవరైనను చాలా దీర్ఘకాలము ఒంటరితనము ననుభవించునప్పుడును, ఎక్కువ కాలము వైఫల్యాలే ఉండినను, ఆరోగ్యము పాడైనప్పుడును, ఆర్థికంగా పతనమైనప్పుడును, మోసగింపబడినప్పుడు, విమర్శింపబడునప్పుడు, ప్రియులైనవారిని కోల్పోయినప్పుడు మొ॥ సమయాలలోను అతడు గాఢాంధకార లోయలో పయనించుచున్నానని అనుకొనవచ్చు. ఇది ఎవరును ఇష్టపడరు కానీ ప్రతి విశ్వాసి జీవితంలో తప్పించుకొనలేని స్థితి ఇది. ‘‘అనేక శ్రమల ననుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెను’’ అని అ.కార్య 14:22 చెప్పుచున్నది. కానీ, అట్టి క్లిష్ట సమయాలలో ప్రతి అడుగులోను దేవుడు మనతో ఉన్నాడని మనము తెలిసికొన అవసరమున్నది. ఇది మనకెంతో ఆనందము కలిగించును. దేవుడు బైబిలునందు తన దాసులకు చెప్పినది అన్ని సమయాలలోను సత్యమే. ‘‘నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ జేసెదను’’ అని దేవుడు మోషేతో చెప్పెను. (నిర్గ.కాం. 33:14). ‘‘ఇదిగో నేను నీకు తోడైయుండి, నీవు వెళ్లు స్థలమందు నిన్ను కాపాడుచు...’’ (ఆది కాం. 28:15) అని ఆయన యాకోబుతో చెప్పెను. ‘‘... భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను .... నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుండును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు’’ అని ఆయన యాకోబుతో చెప్పియున్నాడు (యెషయా 43:1,2)


	కావున ప్రియ మిత్రులారా, కఠినమైన పరిస్థితులలో మనము భయపడక ప్రభువు యొక్క సన్నిధి ఆయన శిష్యులతో వారి దు:ఖ శ్రమలలోను ఉన్నదెంత నిజమో అలాగే మనతోను ఉన్నదని ధైర్యముతోను, నమ్మికతోను ఉందము. ‘‘నిశ్చయముగా సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని వాగ్ధానము చేసెను. (మత్తయి 28:20) మరియు ఆయన ఎట్టి పరిస్థితిలోను మనకు ‘‘ఇక ఉంటాను’’ అని ఎన్నడు చెప్పడు.

ప్రార్ధన :` సర్వశక్తిమంతుడైన దేవా, గొప్ప శ్రమలలో గుండా నేను వెళ్ళునప్పుడు నీవు నాతో ఉన్నావని గ్రహించు కృపనిమ్ము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, నా జీవిత భాగస్వామి నన్ను త్రోసివేసినను, నా బ్యాంకులో డబ్బు లేకపోయినను, నీవైతే ఇంకను నాతో ఉన్నావు. గనుక యేసునామంలో వందనాలు చెప్పుచు, ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.
 

Dear Beloved,

This month we will have our chain of prayer.  The chain starts on Monday, October 28th noon and ends on Tuesday October 29th noon.  Let us all unite our hearts in prayer, and pray for this ministry, for our country and for various other concerns. We encourage you all to give your names through whatsApp or email and inform us which half an hour time slot you will choose to pray.  Please contact office number - 9444456177.  The prayer points are in EnglishTamil ( click the link).

 

Thank you.  God bless!

 

Yours in His service,

Samuel Premraj & Manjula Premraj

 

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonlin

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page