చదువుము : యెషయా 44:1-5
దేవా, నా పిల్లలను నీ చేతికిచ్చుచున్నాను
‘‘నీ బిడ్డను నా చేతికిమ్ము... యెహోవా నా దేవా, యీ చిన్న వాని ప్రాణము మరల రానిమ్ము’’
- 1 రాజులు 17:19,21
తన ప్రియ సేవకుల మొఱ్ఱనాలకించి చనిపోయిన వారిని కూడా తిరిగి బ్రదికించెనని బైబిలు చెప్పుచున్నది. మొదటగా, 1 రాజులు 17లో ఏలియా ప్రార్థించగా సారెపతు వధవరాలి కుమారుని దేవుడెలా బ్రదికించెనో మనము చదువుదుము. రెండవది, 2 రాజులు 4లో షూనేమియురాలి చనిపోయిన కుమారుని ఎలీషా ప్రవక్త ఎలా బ్రదికించెనో మనము చూస్తాము. మూడవదిగా, నూతన నిబంధనలో మన ప్రభువైన యేసు బ్రదికించిన ముగ్గురు వ్యక్తులను గూర్చి చదువుదుము. మొదటిది నాయీను విధవరాలి కుమారిని గూర్చి (లూకా 7:11-15) రెండవది సమాజ మందిరపు అధికారిjైున యాయీరు కుమార్తె (లూకా 8:50-55), మూడవదిగా బేతనియలోని మార్త, మరియల సోదరుడైన లాజరును గూర్చినది (యోహాను 11:41-44) తరువాత అ.కార్య 9:40-41లో పేతురు ప్రార్థించి చనిపోయిన తబితను బ్రదికించుట, ఆ పిమ్మట మేడగదిలో ప్రార్థనలో ఉండగా ఐతుకు అను యవ్వనస్థుడు క్రిందపడి మరణించగా పౌలు బ్రదికించిన విషయము (అ.కార్య 20:9-12). ఆశ్చర్యమేమంటే తబిత తప్ప బ్రదికింపబడిన మిగిలిన వారందరు యవ్వనస్థులే!
ప్రియ మిత్రులారా, తరుచుగా యవ్వనస్థులు అపవాది దాడులనెదుర్కొనుచు చివరకు ఆత్మీయ మరణము పొందుచున్న రోజులలో మనమున్నాము. తరాల అంతరాలు పెరుగుచున్నందున తల్లిదండ్రులు తమ యవ్వన పిల్లలకు సలహాలిచ్చుటకైనను, సరిచేయుటకైనను అసాధ్యంగా ఉన్నది. యెషయా 54:13 చెప్పుచున్నదేమనగా - ‘‘నీ పిల్లలందరు యెహోవా చేత ఉపదేశమునొందుదురు’’ అని. దేవుడే మన పిల్లలకు ఉపదేశిస్తే ఖచ్చితముగా వారు దారి తప్పరు, ‘‘వారికి అధిక విశ్రాంతి కలుగును’’. కావున మన పిల్లలకు ప్రభువు తన జ్ఞానము, ఆలోచన ననుగ్రహించునట్లు వారిని ఆయన కృపాసనము చెంత ఎత్తి పట్టుకొందము. దేవుడు తన ప్రేమతో వారి ఆత్మలను నూతనంగా వెలిగించి వారు వారి జీవితకాలమంతయు ఆయన సాక్షులుగా ఉండునట్లు, వారి ఆత్మల ఉజ్జీవం కొరకు గొప్ప భారముతో ప్రార్థించుదము.
ప్రార్థన :- కృపగల దేవా, నా పిల్లలు ఆత్మీయంగా మరణించుచు, తిరుగుబాటు చేసి దారి తప్పుచుండగా నా హృదయమెంతో భారమై, దు:ఖించుచున్నది. వారికి నూతన జీవితమునిచ్చి, నిత్య శిక్షనుండి కాపాడుమని నీ కృపాసనము వద్ద వారిని గుర్తుచేసి, యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI - 59.
Office: +91 9444456177 || https://www.honeydropsonline.co
Comentarios