తేనెధారలు
చదువుము : కీర్తన 63
మన జీవితాలలో ప్రార్థనే ముఖ్యమైయుండవలెను
‘‘దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనియున్నది, నీ మీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది’’
- కీర్తన 63:1
దావీదు జీవితము ప్రార్థనతోనే ముడిపడి ఉన్నది. కీర్తన 109:4లో నేను ప్రార్థించు వ్యక్తిని అని అతడు చెప్పుచున్నాడు. ప్రార్థనయే దావీదు జీవిత సారాంశము. గనుక అది మనకు కూడా వర్తించును. దావీదు వ్రాసిన కీర్తనలలో చాలావరకు అతడు దేవునికి చేసిన మొఱ్ఱలే. అతడు తన భారములన్ని ప్రార్థనలో దేవుని వద్దకు తెచ్చేవాడు. అతని భయాలు, ఆనందము, కలవరాలు, నిరాశ నిస్పృహలు మొ॥ తన భావనలన్నియు దేవుని ఎదుట వెల్లడి చేసెను. అయితే తాను చేసిన ప్రార్థనలకు జవాబులు ఆలస్యమైనప్పుడు కూడా అసహనము చెందకయు, తన ఎదుట మార్గము అస్పష్టముగా ఉన్నప్పుడు చింతించలేదు కానీ దేవుడు తన సమయమందు, తన విధానములో జవాబిచ్చు వరకు వేచియుండెను. ‘‘నేను నా ప్రాణమును నిమ్మళపరచుకొనియున్నాను, సముదాయించుకొనియున్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద నున్నట్లు నా ప్రాణము నా యొద్ద నున్నది’’ అని కీర్తన 131:2లో దావీదు వ్రాసెను.
ప్రియ మిత్రులారా, మనమెలా ప్రార్థన చేయవలెనో దావీదు తన కీర్తనలన్నిటిలో మనకు నేర్పించుచున్నాడు. మన ప్రార్థనలో దేవుని ఘనపరచి, హెచ్చించి, కీర్తించుటయే ఎక్కువగా ఉండవలెను. ఆయన ఏమైయున్నాడు, సిలువలో ఆయన మన కొరకు ఏమి చేసెనో దానిని బట్టియు మనమాయనను కొనియాడవలెను. ప్రార్థనయే ఆరాధన. మనకేమి కావలెనో అది దేవుని నడుగుట కూడా ప్రార్థన. మన ప్రభువే అడుగుడి అని చెప్పెను. గనుక ఎంత అసాధ్యమైన వాటి కొరకైనను మనము అడుగవచ్చు. (మత్తయి 7:7). ఫిలిప్పీ 4:6లో ‘‘దేనికొరకును చింతపడకుడి గానీ ప్రతి విషయమందును కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచు మీ విజ్ఞాపనలు దేవునికి తెలియజేయుడి’’ అని పౌలు చెప్పుచున్నాడు. మనము ప్రార్థన చేయునప్పుడు ఈ విశ్వమంతటిని కలుగజేసిన సృష్టికర్తjైున దేవునికి నేరుగా ప్రత్యక్షంగా తెలియజేయుచు ఆయనతో సన్నిహిత సంబంధము కలిగియున్నామని గుర్తు పెట్టుకొందము. ఆయనకు సమస్తమును సాధ్యమే. మనము అడుగువాటికంటె, ఊహించుకంటె అత్యధికముగా చేయగల సమర్ధుడని ధైర్యము కలిగియుందము. గనుక దావీదు వలె సహనముతో మనము అడిగినది దేవుడు తన చిత్తప్రకారము ఇచ్చువరకు వేచియుండుట నేర్చుకొందము. మన ప్రభువుతో మాట్లాడుటకును, అనుదినము ఆయన స్వరము మరెక్కువగా వినుటకు తృష్ణ కలిగియుందము.
ప్రార్థన :` పరమ తండ్రీ, నీ దయను తలంచుకొనుట ఎంత సంతోషము. నీవేమైయున్నావో, నా కొరకు ఏమి చేసితివో దానిని బట్టియు నేను నిన్ను ప్రేమించి, స్తుతించుచున్నాను. నీ ఎదుట మోకరించి ప్రార్థించి, నాతో మాట్లాడుచున్న నీ మెల్లనైన స్వరము వినవలెను. ఆశ నాకనుగ్రహించుమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రీ, ఆమెన్.
Dear Beloved,
This month we will have our chain of prayer. The chain starts on Monday, October 28th noon and ends on Tuesday October 29th noon. Let us all unite our hearts in prayer, and pray for this ministry, for our country and for various other concerns. We encourage you all to give your names through whatsApp or email and inform us which half an hour time slot you will choose to pray. Please contact office number - 9444456177. The prayer points are in English, Tamil ( click the link).
Thank you. God bless!
Yours in His service,
Samuel Premraj & Manjula Premraj
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonlin
Comments