top of page

27, నవంబర్ 2024 బుధవారము || తేనెధారలు

చదువుము : 1 రాజులు 17:1-9

మీ వాగు ఎండిపోయెనా ?


‘‘కొంత కాలమైన తరువాత.... ఆ వాగు నీరు ఎండిపోయెను’’ - 1 రాజులు 17:7


ఏ వాగు ఎండిపోయినది ?ఏలియా ప్రవక్తకు దేవుడు తానే చూపించిన వాగు అది! ఇశ్రాయేలు దేశమంతయు గొప్ప కరువుతో నిండినప్పుడు అతని దాహము తీర్చి కాపాడిన వాగు అది ! కష్టకాలములో అతనికి ఆశ్రయమిచ్చిన వాగు అది ! అట్టి వాగును దేవుడు ఎందుకు ఎండిపోవునట్లు చేసెనని మనకు ఆశ్చర్యం కలుగవచ్చు. కెరీతు వాగు వద్ద దాగియుండి దానిలోని నీరు త్రాగుమని ఏలియాకు చెప్పినది ఆయనే కాదా ? అనుదినము అతనికి ఆహారము తెచ్చి ఇమ్మని కాకోలములకు ఆజ్ఞాపించినది కూడా ఆయనేకదా ? మిగిలిన అన్ని ప్రాంతాలలో వర్షము లేకున్నను దేవుడు ఆ వాగు ఎండిపోకుండా అద్భుతముగా కాపాడెను. కాదా ? అలాగైతే ఏలియా జీవితంలో ఎందుకు ఆ పరిస్థితిని రానిచ్చెను? రెండు కారణాలను బట్టి కావచ్చు. మొదటిగా, ఏలియా యొక్క విశ్వాసము, విధేయతను పరీక్షించుటకు అనుదినము అతనికి అందుచున్న ఆహారము, నీరు ఆగిపోయినప్పుడు ఏలియా ప్రతిస్పందనను ఆయన చూడవలెననుకొనెను. రెండవదిగా, ఏలియా పట్ల శ్రేష్టమైనది దేవుడు కలిగియుండెను. ఒక మంచి ప్రదేశము, మరింత మంచి ఆహారము, మంచి సహవాసము మొ॥ ‘‘సీదోను ప్రాంతములోని సారెపతు అను ఊరికి ఒకసారి వెళ్ళుమని...’’ ఆయన ఏలియాకు చెప్పెను. అక్కడ అతన్ని పోషించుట కొరకు ఒక విధవరాలిని ఏర్పాటు చేసెను. తరువాత జరిగినదేమిటి ? ఏలియా మరియు ఆ విధవరాలు ఇద్దరును దీవించబడిరి. మొదట అతని విధేయత, తరువాత ప్రవక్త మాటయందు చిన్న బిడ్డ వంటి విశ్వాసము, ఆమె చేసిన ఆతిథ్యము, దీవెనలు తెచ్చెను.



ప్రియ స్నేహితులారా, కొన్నిసార్లు మనము కూడా ఎండిపోయిన వాగులను కొన్నిటిని ఎదుర్కొందుము. ఆర్థిక సంబంధమైన ఆరోగ్యపరమైన లేక ప్రియులను కోల్పోయిన స్థితి వంటి ఎండిన వాగులు కావచ్చు. లేక స్నేహితులే నమ్మకద్రోహం చేయవచ్చు. అట్టి ఎండిన వాగులను బట్టి నిస్ప ృహ చెందక ఇవన్నియు ఆయనయందు మన విశ్వాసము, ఆయన వాక్యమునకు మన విధేయతలలోని వివిధ స్థితులను పరీక్షించుటకు దేవుడే అనుమతించెనని మనము అర్థము చేసికొందము. ఒక వాగు ఎండిపోవునట్లు చేస్తే మరింత మంచిదానిని ఆయన తప్పక తెరుచునని, అది ఎన్నో విధాలుగా మనకు దీవెనకరముగా ఉండునది. అంతేకాక ఈ అనుభవము ద్వారా అనేకులకు ఆశీర్వాదకారకులుగా ఉండునట్లు దేవుడు మనలను వాడుకొనును.


ప్రార్ధన :- ప్రేమగల పరలోక తండ్రీ, నా ఊహకందని గొప్ప ప్రణాళిక నా జీవితంలో నీవు కలిగియున్నావు. గనుక ఎదురాడకయు, సణగకయు నా జీవితంలో నేను ఆధారపడినవి నానుండి తీసివేయబడినప్పుడు పరిపూర్ణముగా నీయందే నమ్మికయుంచు కృప దయచేయుమని యేసు ప్రశస్త నామమున వేడుచున్నాను తండ్రీ, ఆమెన్.


 

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI - 59.

Office: +91 9444456177 || https://www.honeydropsonline.co

Comentários

Avaliado com 0 de 5 estrelas.
Ainda sem avaliações

Adicione uma avaliação
bottom of page