top of page

27, అక్టోబర్ 2024 ఆదివారము

తేనెధారలు


చదువుము : కీర్తన 119:103-112


బైబిలు ` గొప్ప నిధి

‘‘నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను’’ - కీర్తన 119:111


మనలో అనేకులకున్న సమస్య ఏమనగా దేవుని వాక్యము మనము చదువుచు ఉండినను ఆ వాక్యమును మనసుకు తీసికొనకయు, మన జీవితాలలో దానిని అన్వయించుకొనకయు ఉందుము. ఆ వాక్యభాగాన్ని తరచి చూచి, అనేక గ్రంథాలను పరిశీలించి, దేవుని గూర్చి ఎంతో తెలివిగా మాట్లాడుటకు దాని అర్థాన్ని మరింతగా తెలిసికొనుచుందుము. ‘‘బైబిలు చదువుటలోని ముఖ్య ఉద్దేశ్యమేమనగా ఆయనను గూర్చిన మరింత సమాచారము తెలిసికొనుట కాదుగానీ ఆయన వద్దకు వచ్చుటకును, జీవము గల దేవుడని ఆయనను కలిసికొనుటకునైయున్నది’’ అని డేవిడ్ రోపర్గారు వ్రాస్తున్నారు. యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు మాకు లేఖన జ్ఞానమెంతో కలదని కనబడు యూదులకు ‘‘లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి’’ అని చెప్పుచు గద్దించెను (యోహాను 5:39). లేఖనాలను బాగుగా ఎరిగిన గొప్ప పండితులు కూడా యేసే క్రీస్తని, మెస్సయ్య అని గ్రహించలేకపోవుట ఎంతో విచారకరము.


ప్రియ స్నేహితులారా, ప్రభువు యొక్క గుణాతిశయాలైన ఆయన అమూల్యమైన ప్రేమ, ఆయన మంచితనము, మహాత్మ్యము, విశ్వాస్యతలను ఎరుగుటకు బైబిలు చదువుదుము. ‘‘దేవుడు తన ప్రియులైన మనకు వ్రాసిన ప్రేమ లేఖయే పరిశుద్ధ గ్రంథము’’ అని ఒక వ్యక్తి చెప్పెను. గనుక దానిని వ్యక్తిగతముగా తృష్ణ కలిగి దేవునిని సన్నిహితముగా ఎరుగవలెనని చదువుదుము. ‘‘మనమాయన వాక్యమును చదువునప్పుడు ఆయన మనసునే చదువుచున్నాము. అనగా ఆయన ఏమి ఎరిగియున్నాడు, ఏమి తలంచుచున్నాడు, ఆయనకేది యిష్టము, దేనిని ద్వేషించుచు మొ॥ మానసికంగా కాక హృదయముతో వాక్యమును అర్థము చేసికొనుట నెమ్మదిగాను, నిదానంగాను, ఒక్కొక్క మాట చదువుడి. ఈ సత్యములు మన ఆత్మలో జీర్ణించుకొనునట్లు అప్పుడప్పుడు ఆగి వాక్యము చదువవలెను’’ అని జీన్ పియర్రి వ్రాసిరి. మొదటగా బైబిలు పది నిముషాలు చదువుట కారంభించి, క్రమేణ దానిని ఒక అరగంట లేక ఒక్క గంట చదువుటకు ఇష్టపడుదము. ఆ వాక్యము నుండి మనమేమి నేర్చుకొనుచున్నామనునదే ముఖ్యము, కానీ ఎంత సమయం చదివితిమనేది ముఖ్యము కాదు. దేవుడు ఏమి చెప్పుచున్నాడో అని చెవియొగ్గుటకు మనము సమయము వెచ్చించుదము.

ప్రార్ధన :` వాక్యమైయున్న తండ్రీ, నీవు నాకనుగ్రహించిన గొప్ప ధన నిధిjైున బైబిలు గ్రంథమును బట్టి కృతజ్ఞతలు. జ్ఞానము కోసము ఏదో తెలిసికొనవలెనని కాక నీ వ్యక్తిత్వాన్ని ఎరుగుటకు దానిని చదువు కృపనిమ్ము. ఎంతో పద్ధతిగాను, అనుదినము బైబిలు చదువవలెనను కోరిక నాలో కలుగజేయుమని యేసు ప్రశస్త నామమున వేడుచున్నాను తండ్రీ, ఆమెన్.
 

Dear Beloved,

This month we will have our chain of prayer.  The chain starts on Monday, October 28th noon and ends on Tuesday October 29th noon.  Let us all unite our hearts in prayer, and pray for this ministry, for our country and for various other concerns. We encourage you all to give your names through whatsApp or email and inform us which half an hour time slot you will choose to pray.  Please contact office number - 9444456177.  The prayer points are in EnglishTamil ( click the link).

 

Thank you.  God bless!

 

Yours in His service,

Samuel Premraj & Manjula Premraj

 

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonlin

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page