చదువుము :దాని 9:17-19
మా దేశంలో గొప్ప ఉజ్జీవ మనుగ్రహించుము ప్రభువా!
‘‘దావీదు సంతతి వారి మీదను... కరుణనొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను, నేను కుమ్మరింపగా...’’ - జెకర్యా 12:10
మన ప్రభువైన యేసు రాకడ అతి సమీపముగా ఉన్నది. కానీ ఆయన నెదుర్కొనుటకు ఈ లోకమింకను సిద్ధముగా లేదు. ఈ లోకమంతా పాపములో మునిగిపోయి ఉన్నది, అలాగే సాతాను యొక్క కుయుక్తులతోను, మోసపూరితమైన ప్రణాళికలతోను జనుల కళ్ళకు గ్రుడ్డితనము కలుగచేయబడియున్నది. దీనికి ఏకైక బాధ్యత వహించి సువార్తను వ్యాపింప చేయవలసియున్న సంఘము నిద్రించుచునో లేక వాక్యము ప్రకటించుటకు బదులు మరే కార్యక్రమాలలోనో మునిగి ఉన్నది. జేమ్స్ ఎ. స్టువర్టు గారు ఇలా వ్రాస్తున్నారు ‘‘నేను చర్చిలకు వెళ్ళి చూచినప్పుడు జనులు దేనికొరకు అక్కడికి వస్తున్నారో తెలిసి నాకు ఆశ్చర్యము కలిగినది. ఏదో ఒక బేస్బాల్ ఆట ఆరంభము కొరకు ఎదురు చూచుచున్నట్లు అక్కడ ముచ్చట్లు చెప్పుకొనుచున్నారు. నిజమే స్నేహపూరితమైన సంఘముగా ఉండుట మంచిదే కానీ, కన్నీటితో రోదించు ప్రార్థన ఆత్మ మీకు లేకుంటే పరిశుద్ధాత్మ క్రీస్తు వద్దకు ఆత్మలను తెచ్చుటకు ఎలా పనిచేయును ? మీ సంఘములో ప్రార్థించు ఆత్మ, విజ్ఞాపన ఆత్మ మరియు రోదించు ఆత్మ కలిగి ఉండుట మీరు గమనించినట్లయితే అది ఉజ్జీవమునకు ఒక గుర్తుjైుయున్నది. కానీ జనులు దేవుని గూర్చి కాక శనివారము రాత్రి ఏమి తిన్నారు మరియు అనేఊకమైన ముచ్చట్లు చెప్పుకొనుచున్నట్లయితే దేవుని మహిమ విడిచిపోయె ననుటకు ఒక సూచనగా ఉన్నది.’’ ఒక్క స్త్రీ చేసిన వేదనతో కూడిన ప్రార్థన వలన హంగేరీలోని లూథరన్ చర్చిలో గొప్ప ఉజ్జీవము పెల్లుబికినది. ఆమె మోకరించి కన్నీటితో 24 గంటలు చర్చిలో ప్రార్థించుచుండెను. ఒక ఇంటికి వెళ్ళుమని ఆ సంఘసభ్యులలో ఒకరు చెప్పినప్పుడు ఆమె ‘‘మరెక్కువగా ప్రార్థించుమని పరిశుద్ధాత్మ చేత భారము ఇయ్యబడెను గనుక ఇంటికి
వెళ్ళుటకు ధైర్యము చేయలేను. హంగేరీలోను లూథరన్ చర్చిలో ఉజ్జీవము వచ్చువరకు ఇంటికి వెళ్ళను’’ అని కన్నీటితో చెప్పినది. తరువాత త్వరలోనే చర్చిలో ఉజ్జీవము రాగా హంగేరీలో పదులు, వేలలో జనులు రక్షింపబడిరి.
ప్రియ స్నేహితులారా, మన సంఘములలో ఉజ్జీవము లేని స్థితి ఉన్నదంటే అది మన నిర్లక్ష్యము, ఉదాసీనతయే. ప్రార్థన, విజ్ఞాపన ఆత్మను అనుగ్రహించుమని ప్రభువును వేడుకొందము. తన జనుల పక్షమున గోనెపట్ట వేసికొని, బూడిదె చల్లుకొని ఉపవసించి దానియేలు ఏ విధముగా ప్రభువును ప్రార్థనలో వేడుకొనెనో, బ్రతిమాలుకొనెనో మనమీ దిన వాక్యభాగములో చదువుదుము. (దాని 9:3). మన చర్చిలలో, మన సమాజంలోను గొప్ప ఉజ్జీవము తెచ్చుటకు దేవుడు మనలను వాడుకొనునట్లు మనము కూడా తగ్గించుకొని ప్రార్థనలో దేవుని వెదకుదము.
ప్రార్థన :- పరలోకమందున్న మా తండ్రీ, సంఘంలో ఆత్మీయ స్థితిని గూర్చి పట్టించుకొనక ఉదాసీనతతో ఉన్నందుకు నన్ను క్షమించుము. పరిశుద్ధాత్మ, జనులు తమ హృదయాలను పశ్చాత్తాపముతో క్రీస్తువైపు త్రిప్పుకొనునట్లు నీవే వారిని ఒప్పించుమనియు, మా సంఘాలలో గొప్ప ఉజ్జీవము రగులుకొనునట్లు కృప చూపుమని యేసు నామమున ప్రార్థించు చున్నాను తండ్రీ, ఆమెన్.
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI - 59.
Office: +91 9444456177 || https://www.honeydropsonline.co
Comments