top of page

26, అక్టోబర్ 2024 శనివారము

తేనెధారలు


చదువుము : హెబ్రీ 12:1-3


యేసువైపు శ్రద్ధగా చూడుము

‘‘విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు...’’ (హెబ్రీ 12:2)


ఒక చిన్నబిడ్డ తన చేతిలో టెలిస్కోపు పట్టుకొని ఆకాశము వైపు దానిలో నుండి చూచుచున్న ఒక చిత్రము ఒక వాల్పోస్టరు మీద వేసియుండెను. ఆ చిత్రము క్రిందనే ‘‘యేసు మీదనే మీ దృష్టి కేంద్రీకరించుము’’ అని వ్రాయబడియుండెను. ‘‘దృష్టి ఉంచుట’’ అనగా నిజమైన అర్థమేమో అని నాకు గ్రహింపు కలుగచేసినది. అనగా మనము చూడవలెననుకొని దానిని శ్రద్ధతోను, ఆసక్తితోను, దాని మీదనే గురి కలిగిచూచుట. ఆ చిత్రము యొక్క అర్థము నా మనసులోనే కలిగినది. అనేకసార్ల మనమీ లోకాన్ని జాగ్రత్తగా చూచినప్పుడు జనులు శోధనలుతోనే నిరుత్సాహము, కృంగుదలతో ఉందురు. భక్తిహీనుల ఆలోచనలు ఎప్పుడైన అది ఏదో ఒక చిన్న ఆశ అనగా ఒక క్రొత్త దుస్తుల జత లేక సెలవులకు ఎక్కడికైనను వెళ్ళుటjైునను ఏదియు దేవుని బిడ్డలకు అంత తేలికగా జరగదు. ఈ లోకస్థులు వారి శక్తియుక్తులు, తెలివితేటలును, అధికారుల సిఫారసులతోనో గొప్పలు చెప్పుకొనువారిని చూచినప్పుడు నిరుత్సాహపడుదము. కొన్నిసార్లు అయితే మన విశ్వాసము నుండి తొలగిపోవలెననుకొందుము. అయితే, ప్రియ దేవుని బిడ్డా, ధైర్యము కోల్పోవద్దు. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూడవలెనని ఈ దిన వాక్యభాగము చెప్పుచున్నది. మనకు సహాయము దేవుని నుండి వచ్చును గనుక ఆ కొండల తట్టు మాత్రమే మన దృష్టి ఉంచుదము (కీర్తన 121:1). దేవుడు పట్టించుకొనని సమస్య, రోగము, ఒక్క కన్నీటి బొట్టు కూడా ఏదియు లేదు. ఆయనకు అన్నియు తెలుసు, ఆయన ఆలోచించి, ఆలకించి కాపాడును!


ప్రియ స్నేహితులారా, మన విశ్వాసముని తిరిగి రగిలించుకొని, శ్రద్ధగా మన దృష్టి యేసు మీదనే ఉంచుట అను ఒకే ఒక్క విషయము చేయుదము. ఇతరులను బట్టి వారి అభివృద్ధి, విజయాలను బట్టి నిరుత్సాహపడి, కృంగిపోక ఉందము. ఇవన్నియు ఈ లోకముతోనే అంతమగును. కానీ, ప్రభువైన యేసువైపు చూచినట్లయితే మనము ఆయన చేత ఎన్నుకొనబడినవారమై ఎన్నటెన్నటికి నిత్యత్వము క్రీస్తు యేసునందు సమస్త ఐశ్వర్య, మహిమలు పొందుదుము గనుక ఓర్పుతో ఈ పందెపు రంగమునందు పరుగెత్తుటకు ధైర్యము తెచ్చుకొందము.

ప్రార్థన :` ప్రియ ప్రభువా, దుష్టుల అభివృద్ధిని బట్టి ఎల్లవేళల ఈ లోకము నన్ను నిరుత్సాహపరచి, కృంగ చేయును. యేసువైపే ఆసక్తితో చూచుచు సమస్త మార్గాలలోను ఆయననే అనుసరించు కృపనిమ్ము. నా పందెపు రంగమునకు అడ్డువచ్చు అన్నిటిని తొలగించి, ప్రక్కదారి పట్టకుండా సాయము చేయుమని విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడైన యేసు నామమున ప్రార్థించు చున్నాను తండ్రీ, ఆమెన్.
 

Dear Beloved,

This month we will have our chain of prayer.  The chain starts on Monday, October 28th noon and ends on Tuesday October 29th noon.  Let us all unite our hearts in prayer, and pray for this ministry, for our country and for various other concerns. We encourage you all to give your names through whatsApp or email and inform us which half an hour time slot you will choose to pray.  Please contact office number - 9444456177.  The prayer points are in EnglishTamil ( click the link).

 

Thank you.  God bless!

 

Yours in His service,

Samuel Premraj & Manjula Premraj

 

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonlin

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page