top of page

25, అక్టోబర్ 2024 శుక్రవారము

తేనెధారలు


చదువుము : 1 తిమోతి 6:6-10


సంతృప్తి, ప్రవర్తన

‘‘ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి’’ (హెబ్రీ 13:5)


మత్సరము సర్వసాధారణమే. మనకున్న దానితో సంతోషపడుటకు బదులుగా ఇతరులకున్న దానిని బట్టి చింతించుదుము. మనుష్యులు తమకు లేనిది ఇతరులు కలిగియుండుట చూచిన వెంటనే వాటిని బట్టి, వారి పొరుగువారి స్థితిని బట్టి దురాశతో ఆశించుదురు. అయితే మనము కలిగియున్న వాటితో తృప్తి పొంది యుండవలెనని, మన మీ లోకములోనికి ఏమియు తేలేదు, పోయేటప్పుడు ఏమియు కొనిపోము అని బైబిలు చెప్పుచున్నది. ఒక గుఱ్ఱము, ఒక గాడిద కలిసి నడుచుచుండెను. ఆ గుఱ్ఱము చక్కగా పోషింపబడి, సిద్ధపరచబడి, అలంకరింపబడి, ఎంతో చురుకుగా నడుచుచుండెను. కానీ గాడిద బరువులు మోయుటకు సిద్ధపరచబడెను గానీ దాని అంతగా అలంకరించలేదు. గనుక అది ఎంతో విచారముతో ‘‘నేనే నీవైతే బాగుండు’’ అనియు నీకు పని ఏమియు లేకపోయినను నిన్ను ఎంతో అలంకరించి, సిద్ధపరిచిరి’’ అని ఆ గుఱ్ఱముతో అనగా ఆ గుఱ్ఱము ఏమి మాట్లాడక ఆ గాడిదతో కలిసి నడిచి వెళ్ళెను. ఆ మరునాడు గొప్ప యుద్ధము రాగా, వాటి యజమాని గాడిదను ఇంటి వద్ద విడిచిపెట్టి గుఱ్ఱమునెక్కి యుద్ధానికి వెళ్ళెను. అక్కడ ఆ గుఱ్ఱము చనిపోవునంతగా గాయపరచబడగా దాని అలంకరణతోనే దాని యజమాని దానిని విడిచిపెట్టెను. కొద్దిసేపటికే గాడిద దానిని చూచి ‘‘నాదెంత పొరపాటు’’, మత్సరపడుటకంటె నేనేమైయున్నానో, నాకేమి ఉన్నదో దానితో తృప్తి కలిగియుండుటే మేలు’’ అని అనుకొనెను. ‘‘నీవేమైయున్నావో అలాగే తృప్తిగా ఉండవలెనను’’ చక్కని పాఠము ఆ గాడిద నేర్చుకొనెను.


ఇతరులను చూచి ప్రత్యేకించి అనీతిమంతులను బట్టి మత్సరపడుదువేమో కానీ వారి కొరకు ఏది ముందు ఉన్నదో మనమెరుగము. మనము కలిగియున్న వాటిలో తృప్తి కలిగియుండుమని బైబిలు చెప్పుచున్నది. ఏ స్థితిలో ఉండుటకైనను తృప్తి కలిగియుండుట  తాను కూడా నేర్చుకొనెనని పౌలు కూడా తన పత్రికలలో చెప్పుచున్నాడు. మనమును, మనమేమైయున్నామో, ఏమి కలిగియున్నామో దానిని బట్టి తృప్తి కలిగియుందము. మన అవసరతల కొరకు పూర్తిగా ప్రభువు మీదనే ఆధారపడుదము. ధనవంతులుగా ఉండుట అంటే తృప్తిగా ఉండుట కాదు ! తృప్తి కలిగిన మన భక్తి మనకు గొప్ప లాభసాధకమగును గాక !
ప్రార్థన :` సకలాశీర్వచనములకు కారణభూతుడైన మా దేవా, నీవు నాకనుగ్రహించిన సమస్త దీవెనలను బట్టి వందనాలు. నాకున్న వాటితోనే నేను తృప్తి కలిగియుండు హృదయమిమ్ము. ఇతరులకున్న దానిని ఆశించక నా అవసరతలన్నిటి కొరకు నీపైనే ఆధారపడు కృపనిమ్మని యేసు నామమున పొందుదును గాక, ఆమెన్.
 

Dear Beloved,

This month we will have our chain of prayer.  The chain starts on Monday, October 28th noon and ends on Tuesday October 29th noon.  Let us all unite our hearts in prayer, and pray for this ministry, for our country and for various other concerns. We encourage you all to give your names through whatsApp or email and inform us which half an hour time slot you will choose to pray.  Please contact office number - 9444456177.  The prayer points are in EnglishTamil ( click the link).

 

Thank you.  God bless!

 

Yours in His service,

Samuel Premraj & Manjula Premraj

 

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonlin

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page