తేనెధారలు
చదువుము : కీర్తన 119:145-152
అమూల్యమైన వాక్యము
‘‘నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునుపే తెరచుకొందును’’ (కీర్తన 119:148)
19 కీర్తన చాలా పెద్దది, అది దేవుని వాక్యమును ఘనపరచుచున్న వాక్యములతో నిండియుండి, మరియు వాక్యము పట్ల ఒక విశ్వాసి వైఖరిని గూర్చియు వ్రాయబడినది. దేవుని వాక్యము ‘‘ఒక దీపము’’తో కీర్తనాకారుడు పోల్చి చూపెను. ప్రవక్తjైున యిర్మియా వాక్యమును ‘‘అగ్ని’’ మరియు ‘‘సుత్తె’’తోను పోల్చెను. అపొస్తలుడైన పౌలు ‘‘జీవము గల విత్తనము’’గాను ‘‘ఒక ఖడ్గము’’గాను పోల్చెను. గనుక దేవుని వాక్యము కొరకును, మరి ముఖ్యముగా కమ్యూనిస్టు దేశాలలో ఎందరో విశ్వాసులు తమ ప్రాణములను కూడా త్యాగము చేయుటకు సిద్ధపరచిన అమూల్యమైనది ఈ వాక్యము. నిజముగా జరిగిన ఒక సంఘటన నేను మీతో చెప్పుచున్నాను. అది పాత పుస్తకాలు లేక గ్రంథాలను సమకూర్చు అలవాడు ఉన్న ఒక క్రైస్తవ స్నేహితుడు అతని స్నేహితునితో మాట్లాడుచు, తాను పుస్తకాలు సర్దుచు ఒక చినిగిపోయిన పాత బైబిలును అలా బయట పారవేసితిని. ‘‘దానిని ఎవరు ముద్రించిరో నీకు తెలుసా ?’’ అని అడిగెను. ‘‘ఆ, ఎవరో గూటెన్ లేక ఏదో పేరు అతడే అనుకుంటా’’ అని అతని స్నేహితుడు బదులిచ్చెను. ‘‘గూటెన్బర్గ్!’’ గూటెన్బర్గ్ బైబిలా ! దానిని వేలము వేస్తే నీకు కోటీశ్వరుడువగుదువు గదా ?’’ అని అనగా ఆ పుస్తకాలు సమకూర్చువాడు ఒక నిట్టూర్పు విడిచెను. అప్పుడు ఆ స్నేహితుడు ఏ మాత్రము చలించక ‘‘కావచ్చు కానీ ఈ గ్రంథము అంత విలువైనది కాదులే. మార్టిన్ లూథర్ అనే అతను వ్రాసినది అది’’ అని చెప్పెను. ఇది వినిన ఆ క్రైస్తవ స్నేహితుడు ఎంతో ఆశ్చర్యపడి ‘‘నీవేమి చేసితివి మిత్రమా ? ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టిన గూటెన్బర్గ్ మొదటగా ముద్రించిన బైబిలే అయియుండవచ్చు. ఇంకను ప్రొటెస్టెంటు ఉజ్జీవమును ఆరంభించిన వ్యక్తి దానిని సొంతం చేసికొనెను ! అంతటి విలువైన, వెలకట్టలేని సొత్తుjైున దానిని పడవేసిన నీవు ఎంత బుద్ధిహీనముగా ప్రవర్తించితివి !’’
ప్రియ స్నేహితులారా, అంత పురాతనమైన బైబిలు మనవద్ద లేకపోవచ్చు. కానీ దేవుని వాక్యమైన ఎంతో విలువైన, వెలకట్టలేని బైబిలు గ్రంథమును మనము కూడా బుద్ధిహీనముగా ప్రవర్తించి నిర్లక్ష్యము చేయుచున్నామా ? మన యింటిలో ఒక అలంకారముగా మాత్రమే దానిని ఉంచుచున్నామా ? దివారాత్రులు దేవుని వాక్యమును ధ్యానించుచుందము అని ఈ దినమే ఒక తీర్మానము తీసికొందము. మనకొక బైబిలు కలిగియుండుట ఒక ధన్యతగా కృతజ్ఞత కలిగియుందము.
ప్రార్ధన :` వెలుగైయున్న దేవా, నాకొక బైబిలున్నను కొద్ది సమయమే దానిని చదువుటకు, ధ్యానించుటకు గడుపుచున్నాను. నా బద్దకాన్ని దులిపివేసికొని నీ వాక్యమును నింపుకొను కృపనిమ్ము. నీ వాక్యమును నింపుకొను కృపనిమ్ము. నీ వాక్యమును అర్థము చేసికొని, ఆ సత్యమును నా హృదయంలో వ్రాసికొనుటకు సాయము చేయుము. నీ వాక్యము నా త్రోవకు వెలుగైయుండు కృపనిమ్మని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonlin
Comments