top of page

23, అక్టోబర్ 2024 బుధవారము చదువుము : అ.కార్య 2:36-41

తేనెధారలు

ప్రభువు అనబడిన యేసు, క్రీస్తు అనబడిన అభిషిక్తుడు

‘‘మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను, క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢగాి తెలిసికొనవలెను’’ (అ.కార్య 2:36)


గొప్ప సువార్తికుడైన డ్వైట్ ఎల్.మూడీగారు తన సేవారంభ దినాలలో షికాగోలో ప్రార్థనా కూడికలు జరుపుచుండెను. అప్పుడు అక్టోబరు 8, 1871, మొదటి ఆదివారము రాత్రి యేసే రక్షణ మార్గము, అక్కడ కూడియుండిన ప్రతి ఒక్కరికొరకు ఆయన శ్రమపొంది మరణించెనని ఆ జన సమూహమును ఒప్పించునట్లు గట్టిగా ప్రయత్నించెను. ఆయన తన ప్రసంగ ముగింపులో యేసుప్రభుని శ్రమలను వివరించుచు ‘‘అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతును ?’’ (మత్తయి 27:22) అను వాక్యమును చెప్పి ‘‘ఈ వాక్యమును మీతో ఇంటికి కొనిపోయి ఈ వారమంతయు ఆలోచించి మరుసటి ఆదివారము కల్వరి సిలువ యొద్దకు వచ్చి నజరేయుడైన యేసును ఏమి చేయవలెనో మనమొక నిర్ణయానికి వచ్చెదము’’ అని తన బోధ ముగించెను. మొదటగా వారు తమ గత జీవితం గురించి ఆలోచించుకొనుటకు సమయమిచ్చి, ఆ తరువాతనే మరుసటి ఆదివారము రక్షణ కొరకు పిలుపునియ్యవలెనని ఆయన తలంచెను. కానీ, అదే రోజు రాత్రి కూడికలో చివరి పాట పాడుట ముగించక ముందే షికోగోలో గొప్ప ఉజ్జీవము రగిలినది. అక్కడనే మూడీ కట్టిన హాలు బూడిద చేయబడినది, మరి ఇంకా ఒక వెయ్యిమంది వారి ప్రాణములు కోల్పోయిరి. ఆ రాత్రి ఆయన వాక్యమందించిన అనేకులలో కొందరు రక్షింపబడకయే మరణించిరనుటలో ఏ సందేహము లేదు. ఆ బాధ మూడీగారిని అనేక సం॥లు వేధించినది. రక్షణ కొరకైన పిలుపు ఆ రాత్రి ఆయన ఇచ్చియుండెనా, ఆ అగ్నిలో నాశనమైన వారికి ఆ పిలుపు అంది ఉంటే ఎంత బాగుండేది !


ప్రియ స్నేహితులారా, సువార్తను ప్రకటించుటకైన పిలుపు వాయిదా వేయదగినది కాదు. అది వెనువెంటనే చేయవలసిన అత్యవసరమైన పని. రక్షకుని పొందకయే మన చుట్టు ఉన్నవారు చనిపోవుచున్నారు. సువార్తను చేపట్టి ముందుకు వెళ్ళుటకు పూనుకొందురా ? మన సహోదరులు విలువైన జీవితాలలో మనము చేయు ఆలస్యము ఎంతో నష్టము కలుగుజేయవచ్చు. పరిశుద్ధాత్మను పొందిన తరువాత పేతురు ఏ మాత్రము ఆలస్యము చేయక అప్పటికప్పుడే, అక్కడే సువార్త పని ఆరంభించగా ఫలితం ` ఒకరో, ఇద్దరో కాదు గానీ మూడువేల మంది రక్షింపబడిరి ! మనందరము కలిసి పరిశుద్ధాత్మ శక్తిచేత ఈ దినమే, ఇప్పుడే సువార్త ప్రకటించుదము ! రండి !

ప్రార్థన :` నా రక్షకుడవైన యేసుప్రభువా, నీవు నా రక్షకుడవైనందున నేను ధన్యుడను. నా దేశములో ఎవరును రక్షింపబడకుండా నశించిపోకుండా నిత్య జీవము పొందునట్లు సువార్తను వారికి అందించునట నాకు సాయము చేయుమని యేసునామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.
 

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonlin

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page