చదువుము : సంఖ్యా కాం. 4:1-20
త్యాగము లేకుండ పరిచర్య లేదు !
‘‘సాక్ష్యపు మందసము వద్ద పరిశుద్ధమైన దాని విషయంలో ఇది కహాతీయులు చేయవలసిన పని’’
- సంఖ్యా కాం. 4:4
త్యాగపూరితముగా పనిచేయుట బైబిలు ఆధారితమైనది. ఈ దిన వాక్యభాగంలో సాక్ష్యపు మందసము వద్ద దేవునికి సేవచేయుటకు కహాతీయుల వంశములోని 30-50 సం॥ల వయస్సున వారిని ప్రభువు పిలుచుటను మనము చూచుదుము. పరిశుద్ధమైన వస్తువులను జాగ్రత్త చేయుటయే వారి పని. దీనిని మొదటగా చూచినప్పుడు ఇదెంతో గొప్ప పనిగాను, జనుల ఎదుట ఘనత తెచ్చునదిగాను కనబడును, కానీ ఇది నిజానికి యాజకులు వారి పని ముగించిన పిదప ఆ మందసమునకు చెందిన పరిశుద్ధ వస్తువులు, వస్త్రాలు తీసి వాటిని మోసికొని వచ్చుటకు సిద్ధపరచు పనిjైుయున్నది. అలాగే, గెర్షోమీయులు, మెరారీయులు కూడా మోయవలసినకొని ఉన్నవి. అహరోను, అతని కుమారులు విధించిన పనిలు వారు చేసిరి. అనగా ఆ పరిశుద్దమైన వాటి మోయు పని కలిగియున్నను లోనికి వాటిని చూచే అవకాశము కూడా వారికి లేదు. ఏ ధన్యత లేకుండా చేసేది సేవ కాదా ? ఇంకను సంఖ్యా.కాం. 7లో ఆ వస్తువులు మోయుటకు ఏ సౌకర్యము ఇయ్యక పక్షపాతము చూపినట్లుండును. కానీ, మోరారీయులకు నాలుగు బండ్లు, ఎనిమిది ఎద్దులు ఇయ్యబడెను, గెర్షోమీయులకు రెండు బండ్లు, నాలుగు ఎడ్లు మాత్రమే ఇయ్యబడెను. కహతీయులకై ఏమియు ఇయ్యక ఆ బరువు ‘‘వారి భుజముల మీదనే’’ మోయవలెనని చెప్పబడెను. ఇది ‘‘త్యాగపూరిత పరిచర్య’’ అని పిలువవచ్చా ?
ప్రియ స్నేహితులారా, మీకు ఏ పని ఇయ్యబడినది ? దానివలన ఏ ధన్యత కలదు? దానికి కావలసినవేమిటి ? మీ పై అధికారులు మీ పట్ల పక్షపాతము చూపుచున్నట్లు భావించుచున్నారా ? మీకు ఏది ఇయ్యబడెనో దానితోనే మీరు సేవ చేయవలెనని ప్రభువు కోరుచున్నాడు. అప్పుడు దేవుడు మిమ్ము ఘనపరచును. కనానులో వారికి స్వాస్థ్యము పంచి యిచ్చునప్పుడు ప్రభువు కహాతీయులకు మొదటి భాగమించి, మిగిలిన వంశముల వారి భాగములను కూడా వారికి స్వాస్థ్యముగా ఇచ్చెను. మన ప్రభువెంత న్యాయవంతుడు! గనుక ధైర్యము తెచ్చుకొని త్యాగపూరితంగా ఇప్పుడు పరిచర్య చేయుచు ఉంటే త్వరలోనే దేవుడు మీ ప్రతిఫలము పొందుటకు సాయము చేయును.
ప్రార్ధన :- న్యాయకర్తjైున ప్రభువా, నాకియ్యబడిన వాటితోనే, నీ సమయమందు తగిన ఘనతను, ధన్యతను నీవు నాకిచ్చుదువను నమ్మికతో సంతోషముగాను, సమర్పణతోను నాకప్పగింపబడిన పని చేసి ముగించు కృపనిమ్ము. సణగకుండ నా పని చేయు కృప మాత్రము నాకనుగ్రహింపుమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI - 59.
Office: +91 9444456177 || https://www.honeydropsonline.co
Comments