తేనెధారలు
సమాధాన నిబంధన
‘‘అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు.’’ (హెబ్రీ 12:14)
కొంతకాలము నుండి మీరెందుకు సంఘారాధనకు రావడము లేదని ఒక బోధకుడు ఒక వ్యక్తిని అడుగగా అతడు ‘‘అక్కడివారు నన్ను మర్యాదగా చూచుట లేదు’’ అని జవాబిచ్చెను. అప్పుడా బోధకుడు ‘‘అయితే ఇంటికి వెళ్ళి ఎందుకని మీ భార్యను కొట్టి తరిమివేయకూడదు ?’’ అని అనెను. అప్పుడతడు ఆశ్చర్యముతో ఆ బోధకుని వైపు చూచుచు ‘‘నాకు విరోధంగా నా భార్య ఏదియు చేయలేదే’’ అని చెప్పెను. అప్పుడా బోధకుడు ‘‘అలాగైతే నీకు విరోధముగా ప్రభువైన యేసు ఏమైనా చేసెనా ?’’ అని అనెను. ‘‘లేదు’’ అని అతడు జవాబిచ్చెను. ఆ పాస్టరుగారు ఇంకను మాట్లాడుచు ‘‘తోడి విశ్వాసులతో నీకుండిన కోపతాపాల వలన క్రీస్తును విడిచిపెట్టుటలో ఏ కారణమున్నది?’’ అని అడిగెను. ఆ వ్యక్తి తన ప్రవర్తనను బట్టి సిగ్గుపడి, తానే సరైనవాడని అనుకొనక అది మొదలుకొని చర్చికి క్రమంగా హాజరుకావలెనని తీర్మానించుకొనెను. క్రీస్తు నిమిత్తము తనలోని కోపమును తొలగించుకొందునని అతడు ఒట్టు పెట్టుకొనెను.
ప్రియ స్నేహితులారా, తోటి సహోదరులకు మనమేమి చేసినను అది ఆయనకే చేసినట్లు అని మత్తయి 25:40లో ప్రభువు చెప్పుచున్నాడు. విశ్వాసులతో కూడిన సంఘముతో మనము రెట్టింపు జాగ్రత్తతో వ్యవహరించవలెను. సంఘములోగానీ, వెలుపల ఎవరితోనైనను కోపముతో వ్యవహరించి, మనస్సునందు విరోధముంచుకొంటే దేవుని కృపనుండి తొలగిపోదుము అని ఈ దిన వాక్యభాగము కూడా మనలను హెచ్చరించుచున్నది (వ.15). మీరు కూడా మీ తోడి విశ్వాసులతో కోపముగా ఉండి తత్ఫలితంగా వారిని దూరంగా ఉంచుచున్నారేమో. కానీ నీకున్న ఆ కోపము వలన క్రీస్తుప్రభువు శరీరమైన సంఘమును నిర్లక్ష్యము చేయుట మంచిది కాదు. ఇది కుక్క మీద కోపముతో పిల్లని తన్నినట్లుండును. (అత్త మీద కోపము దుత్త మీద చూపినట్లు). ప్రభువైన యేసు రక్తము చేత నూతన నిబంధన క్రింద మనమున్నామని గుర్తు పెట్టుకొందము. విభేదాలను ప్రక్కనపెట్టి ఒకరినొకరు క్షమించి, అంగీకరించుదము. ప్రభువైన యేసు మీదనే దృష్టియుంచి ఆయన మాదిరి ననుసరించుదము. క్రీస్తే తన శరీరమను సంఘమునకు శిరస్సైయున్నాడు గనుక అందులోని విశ్వాసులను నిర్లక్ష్యము చేయక ఉందము. శరీరమును నిర్లక్ష్యము చేస్తే శిరస్సును కూడా మనము నిర్లక్ష్యము చేసినవారమగుదము.
ప్రార్ధన :` దయగల తండ్రీ, కపటముతో ఉండు మనుష్యులను చూచినప్పుడు నేను కృంగిపోయి, సంఘమును నిర్లక్ష్యము చేయుట ద్వారా నా కోపము చూపుటకు ప్రయత్నించుదును. దయతో క్షమించుము. ఇతరులతో సమాధానముగా ఉండి నిన్ను ఘనపరచు కృపనిమ్ము. నా హృదయంలో ఉన్న కోపము తొలగింపబడి నీతో మంచి సహవాసమును తిరిగి అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonlin
Commentaires