top of page

20 నవంబరు 2024 బుధవారము || తేనెధారలు

చదువుము : ఎఫెసి 5:1-4


నేను నీవలె పరిశుద్ధముగా ఉండకోరుచున్నాను దేవా !


‘పరిశుద్ధులగుటచే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు కాదు’’ - 1 థెస్స 4:7



ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మొట్టమొదటి మరియు మహోన్నతమైన గుణలక్షణము. పరిశుద్ధతగా దేవుని వాక్యములో అగపడుచున్నది అని ఆర్.ఎ. టోరిగారు వ్రాసిరి. అవును ఆయన సాత్వికుడు, దీనుడు, ప్రేమగలవాడు, దయగలవాడు మరియు ప్రార్థనాపరుడు అని మనము చెప్పవచ్చు. కానీ అన్నిటిని మించి ఆయన ‘‘పరిశుద్ధుడు’’. ‘‘పరిశుద్ధత’’ అనగా అపవిత్రత లేక దోషము లేకుండుట. యేసే వెలుగు అని ఆయనయందు ఏ మాత్రమును చీకటి లేదు. ఆయన నీతిని ప్రేమించి దుష్టత్వమును అసహ్యించుకొనును. (హెబ్రీ 1:9). ఈ లోకంలో అనేకమంది భక్తులు నీతిని ప్రేమించుదుమనువారుందురు కానీ వారు అతిక్రమమును ద్వేషించునట్లుండరు. కొందరైతే పాపమును అసహ్యించుకొందుమని చెప్పుదురు కానీ నీతిని ప్రేమించినట్లు ఉండరు. అయితే మన ప్రభువైన క్రీస్తు యొక్క పరిశుద్ధత మచ్చలేనిది - ఆయన నీతిని ప్రేమించి, పాపమును ద్వేషించెను. తరువాత ఆయన పరిశుద్ధత ఆయన మాటలలోను, క్రియలలోను వెల్లడియాయెను. ‘‘ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు’’ అని 1 పేతురు 2:22 చెప్పుచున్నది. ఇప్పుడు పరిశుద్ధతను గూర్చి ఎంతగానో మాట్లాడువారు వారి క్రియలలో చాలా అపవిత్రులుగా ఉన్నారు. పరిశుద్ధత యొక్క సంపూర్ణత అనగా దాదాపు ఏ తప్పు చేయకపోవుట కాదు కానీ సమస్తము మంచే చేయుటలోను, చెప్పినదంతయు సత్యమైయుండుటలోను వెల్లడియగును.



ప్రియ మిత్రులారా, ఆయన శిష్యులమైన మన పూర్తి పరిపూర్ణత మన ప్రభువు కోరుచున్నాడు. మత్తయి 5:48లో ‘‘మీ పరలోక తండ్రి పరిపూర్ణుడైయున్నట్లే మీరును పరిపూర్ణులుగా ఉండుడి’’, ఎందుకనగా యేసు సంపూర్ణ పరిశుద్ధుడు, ఆయన దానికంటె మరి దేనియందు తృప్తిపరచబడలేదు. ‘‘నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన యెడల దానిని పెరికి నీయొద్ద నుండి పారవేయుము’’ అని మరింత నిక్కచ్చిగా చెప్పెను. మరియు నీ దేహము అంతయు నరకములో పడవేయబడుట కంటే నీ దేహములోని  ఒక్క అవయవమును కోల్పోవుట మేలు అనియు చెప్పెను (మత్తయి 5:29). యేసయ్య పెట్టిన నియమము మరీ ఉన్నతంగా ఉండి దానిని చేయలేము అని చెప్పుకొనుచు మనలను మనము మోసపుచ్చుకొనకయుందము. అయితే పరిశుద్ధాత్మ శక్తి చేత ఈ లోకములో రాజీపడకయుందుమని తీర్మానించుకొందము. మన తలంపులు, మాటలు, క్రియలు అన్నిటిలోను ప్రతి క్షణము పరిశుద్ధతను వెంటాడుదము.
ప్రార్ధము:- మహోన్నతుడైన దేవా, దూతలు రాత్రింబగళ్ళు సైన్యములకధిపతిjైున ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆరాధించును, దయ్యాలైతే నీ పరిశుద్ధత ఎదుట నిలుచుటకు వణుకును. నా జీవితంలోను పరిశుద్ధతను కోరుకొను అతి పరిశుద్ధుడవైన దేవుడవు నీవు. నా బ్రదుకు దినములన్నియు పరిశుద్ధతను వెంటాడుటకు సహాయము చేయుమని యేసునామమున ప్రార్ధించుచున్నాను తండ్రీ, ఆమెన్.


 

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI - 59.

Office: +91 9444456177 || https://www.honeydropsonline.co

Comentários

Avaliado com 0 de 5 estrelas.
Ainda sem avaliações

Adicione uma avaliação
bottom of page