చదువుము: యాకోబు 1:21-27
దేవుని వాక్య ప్రభావము
‘‘మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి’’ (యాకోబు 1:21)
ఒక క్రైస్తవునికి సాత్వికమే గొప్ప ఆస్తిగా ఉండును. మత్తయి 5:5లో ‘‘సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు’’ అని యేసుప్రభువు తానే చెప్పియున్నాడు. ఈ దిన వాక్యభాగములో సాత్వికము ఒక వ్యక్తి జీవితంలో చివరి స్థానములో ఉన్నట్లున్నది. ఈ అధునాతన కాలములో మారుచున్న విలువలు మనుష్యుల మీద ఎక్కువ ఒత్తిడి కలుగ చేయుచున్నది. ఎందుకంటే ధనవంతులుగాను, స్వార్ధపరులుగా ఉండుటకు తోడు వారు తెలివిగలవారుగాను, దూకుడుగాను, విజయం సాధించువారుగాను ఉండుటకు మరింత ఎక్కువగా ప్రయాసపడుచున్నారు. స్త్రీగాని, పురుషుడుగానీ దేవుని కుమారుడు చెప్పిన వాటికి బదులుగా అధునాతన సౌకర్యాలయందు ఎంతో ఆనందించుచున్నారని డా॥ బిల్లీగ్రాహంగారు చక్కగా వివరించుచున్నారు. ‘‘ది సీక్రెట్స్ ఆఫ్ హ్యాపీనెస్’’ అను తన పుస్తకములో వ్రాసినదేమనగా, ‘‘తెలివిగలవారు సంతోషించుదురు, వారు తన స్నేహితుల మెప్పుపొందుదురు, దౌర్జన్యము చేయువారు ధన్యులు, వారు ఆస్థిని సంపాదించుకొందురు. ప్రతిభగలవారు ధన్యులు, వారు ఒక ఉద్యోగము పొందుదురు, ధనవంతులు ధన్యులు. వారు ఈ లోక స్నేహితులను కలిగియుందురు మరియు అన్ని వసతులు గల ఒక ఇల్లు పొందుకొందురు’’ అని తెలిపి ప్రజ్ఞ కలిగి, మెప్పు పొందుట పాపమేమి కాదు, ఎందుకనగా తెలివి, బుద్ధికి మూలము పరలోకమందున్న ప్రభువే. కానీ వీటన్నిటితో పాటు మనము సాత్వికమును ఒక ఆభరణముగా ధరించుకొనవలెను. ఈ జ్ఞానముగూర్చి యాకోబు 3:17 చెప్పుచున్నది.
ప్రియ మిత్రులారా, దౌర్జన్యముతో కూడిన ఈ లోకములో మనము సాత్వికులముగా ఉండవలెనని స్పష్టమైన హెచ్చరిక ఇయ్యబడినది. దేవుని వాక్యమును స్పష్టమైన హెచ్చరిక ఇయ్యబడినది. దేవుని వాక్యమును స్వీకరించనంతవరకు ఎవరైనను సాత్వికమును ఎలా ధరించుకొందురు ? తెలివిగలవారు ఈ లోకమునకు తన మంచి ప్రవర్తనను, సాత్వికముతో తాను చేయు క్రియలను చూపవలెనని బైబిలు చెప్పుచున్నది. ఈ సాత్వికమను సుగుణమును మనము అలంకరించుకొందమా ? సాత్వికముతో మనము చేయు మంచి క్రియల ద్వారా జనులు క్రీస్తువైపు ఆకర్షింపబడవలెను. ఎంతో ఔన్నత్యము, సమస్త మహత్మ్యము కలిగియుండియు మన ప్రభువైన యేసు సాత్వికుడైయుండెను ! మనము కూడా ఆయన ననుసరించి ఒక దినాన ఆయన మహిమలో పాలుపంచుకొనువరకు మహిమ నుండి మహిమకు ఎదుగదము !
ప్రార్ధము:` మహోన్నతుడైన దేవా, నాలో ఉన్న దౌర్జన్యపు ఆత్మను తొలగించి, నీ సాత్వికమైన ఆత్మను నాకు దయచేయుము. ఈ సుగుణమును బట్టి నిన్ను మహిమపరచు కృపనిమ్ము. నా తెలివి, తలాంతులన్నిటికి మూలము నీవు మాత్రమే. నాకున్న దేనిని బట్టియు అతిశయింపక సమస్తమునకు మూలము నీవేయని నిన్నే మహిమపరచు భాగ్యమిమ్మని యేసునామమున ప్రార్ధించుచున్నాను తండ్రీ, ఆమెన్.
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonlin
Comentarios