చదువుము : యోహాను 16:20-22, 33
చలికాలము తరువాత తప్పక వసంతకాలము వచ్చును
‘‘ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దు:ఖము కలుగుచున్నది’’ - 1 పేతురు 1:6
భక్తిగల ఆత్మకు ఒక వస్త్రముగా ‘‘ఆనందము ఆశ్చర్యము చక్కగా నేయబడినది’’. దీనిని మనము ప్రభువైన యేసు ఈ భూమిపై ఉన్నప్పుడు స్పష్టముగా చూడగలము. ఆయన జీవితంలో ఎప్పుడును సంతోషము, బాధ మరియు ఘనత, వేదన మరియు దు:ఖము ఆనందము కలిసే ఉండెను. దేవదూతలు యేసు జననమును గూర్చి గొప్ప ఆనంద వార్తతో వచ్చిరి కానీ కొద్ది సమయంలోనే చిన్నబిడ్డలందరి బెత్లెహేములో హేరోదు చంపించెను. యేసు బాప్తిస్మ సమయంలో ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ దిగివచ్చి ఆయన తన ప్రియ కుమారుడని దేవుడు తానే చెప్పి నిర్ధారించెను. అయినప్పటికిని వెనువెంటనే యేసు తన విరోధిjైున సాతానుతో నలుబది దినాలు అరణ్యములో పోరాడెను. రూపాంతర కొండమీద నిత్యత్వమును గూర్చిన మహిమాన్వితమైన దృశ్యము ఆవిష్కరణ కాగా కొండ క్రింద తన శిష్యులు దురాత్మను పారద్రోల లేని అల్పవిశ్వాసమును బట్టి యేసు నొచ్చుకొని వారిని గద్దించిన అనుభవము కలిగెను. పరిచర్య కొరకు పంపబడిన డెబ్బది మంది తిరిగివచ్చి వారు రుచి చూసిన పరిశుద్ధాత్మ శక్తిని గూర్చి చెప్పినప్పుడు ‘‘యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించెను’’ (లూకా 10:21) అయినను ఆ వెనువెంటనే ఆయన, దయ్యముల అధిపతిjైున బయల్జెబూలు వలన తన పరిచర్య చేయుచున్నాడని విమర్శనెదుర్కొని నిందింపబడెను. (లూకా 11:15). ఆనందోత్సాహాలతో ఖర్జూరపు మట్టలు పట్టుకొని ‘‘హోసన్న’’ అని కేకలు వేసినవారే వెంటనే ‘‘ఆయనను సిలువ వేయుము !’’ అని అరిచిరి. ఈ సమస్త ఆనంద, దు:ఖాల మధ్య ఆయన మరణమును జయించి గొప్ప విజయము పొందెను.
నూతన నిబంధన సంఘము పట్ల కూడా అదే విధంగా జరుగుట నిజము. పెంతెకోస్తు దినాన బలముగా వీచిన పరిశుద్ధాత్మ గాలి అనేకమందికి మారుమనస్సు పొందుటకును, అద్భుత స్వస్థతలకు, ఇంకను, అనేక అద్భుత కార్యాలు సూచక క్రియలు జరుగుటకు దారి తీయగా ఆ తరువాత శిష్యులు దెబ్బలు తినడము, చెరలో వేయబడటము జరిగినది.
ప్రియ స్నేహితులారా, క్రీస్తుకు తమ జీవితం అప్పగించుకొనిన ప్రతి విశ్వాసి పట్ల కూడా జరగుతుంది. ఎక్కువ ఎండ ఎడారిని కలుగజేయును’’ అనగా అతి ఏదైనా మంచిది కాదు అని ఒక అరేబియన్ సామెత చెప్పుచున్నది. గడగడ వణుకు చలికాలమును గూర్చి మనము భయపడవలసిన పనిలేదు ఎందుకనగా చలికాలము తరువాత వసంత కాలము, వేసవి కాలము కూడా వస్తూనే ఉండును. కావున మనము క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు నిరీక్షణ కోల్పోకయుందము. క్రీస్తు ప్రభువు మరణమును జయించి లేచి సమస్తమును జయించినందున మనకును నిత్య జీవ నిరీక్షణ ఉన్నది. హల్లెలూయా.
ప్రార్థన :- ప్రియ ప్రభువా, ఆనందం వెనుక దు:ఖం, మహిమ వెనుక అంధకారము ఉన్నట్లు ఈ లోక జీవితంలో యేసు మనకు మాదిరిగా ఉన్నది. దీనిని బట్టి నిరుత్సాహపడక ధైర్యంతో కొనసాగునట్లు సాయం చేయుము. మన ప్రభువైన యేసు ద్వారా చివరకు గొప్ప జయమున్నది. ఆమెన్.
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI - 59.
Office: +91 9444456177 || https://www.honeydropsonline.co
Comments