top of page

19, అక్టోబర్ 2024 శనివారము తేనెధారలు

చదువుము : మలాకీ 3:11-18

కృపయందు అభివృద్ధి పొందుట

‘‘మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి’’ (2 పేతురు 3:18)


ఒక చిన్న మామిడి నారు మొక్క తనంతటతానే స్వతంత్రంగా ఎదగవలెనని హఠాత్తుగా ఒక నిర్ణయం తీసికొన్నది. సారవంతమైన నేలతో ‘‘నీ సారముతోను, నీలో ఉన్న ఇతర బలమైన ఖనిజాలతో నన్ను నీవు ఇక పోషించనక్కరలేదు. నా అంతట నేనే ఎదగగలను’’ అని ఆ మొక్క చెప్పినది. తరువాత అది పైన మేఘములను చూచి ‘‘ఇదిగో మేఘాలలారా, నా మీద నీవు సమృద్ధిగా నీరు కుమ్మరించనవసరము లేదు. నాకు నీరు అవసరం లేదు. నేనే ఎదుగుదురు’’ అని చెప్పినది. అప్పుడు భూమి మరియు మేఘములు తక్షణమే ఆలాగు చేసెను. వెనువెంటనే ఆ చిన్ని మొక్క ఏమైయుండెనో మీరు ఊహించగలరు. దాని జీవము, ఎదుగుదలకు ఎంతో అవసరమైన నీరు, పోషకాలు లేక అది ఎంతో దయనీయముగా చావవలసి వచ్చెను. దేవుడు మనకు కృపతో నూతన జన్మ, ఒక నూతన ఆరంభము ననుగ్రహించియున్నాడు. దేవుని తోటలో మనము చిన్న నారు మొక్కలుగా నాటబడితిమి. దేవుని వాక్యమను సారవంతమైన భూమి ఫలమిచ్చు మంచి బలమైన మొక్కలుగా మనలను ఎదిగించును. మరియు ఆయన చేతులలో గొప్ప జలనిధులున్నవి. కొలతలేకుండా ఆయన తన కృపను వర్షింపచేయును. అయితే అట్టి చిన్న మొక్కలమైన మనము ఆయన పోషణకు ఎలా ప్రతిస్పందించుచున్నాము ? దేవుని ప్రేమకు, కాపుదలకు మనము ఏమియు చలించక కఠినంగా మార్పులేకుండా ఉన్నామా ? ఆయన వాక్యమును, కృపను కృతజ్ఞతతో స్వీకరించుటకు బదులుగా తిరస్కరించుచున్నామా ? దేవుని కృపయందు ‘‘అభివృద్ధి’’ పొందుమని ఈ దిన వాక్యభాగములో పౌలు మనకు బోధించుచున్నాడు. అనగా రక్షణ అనునది ఏదో ఒక్క దినము ఉండునని లేక అనుభవము కాదు. అది ఆరంభము మాత్రమే. రక్షణానుభవము అనగా తిరిగి జన్మించిన అనుభవము తరువాత మనమా చిన్ని నారు మొక్కవంటి వారమే. మన ఆత్మీయ జీవితంలో అందరము ఎదుగుచునే ఉండవలసిన అవసరతయున్నది.


ప్రియ మిత్రులారా, చాలావరకు దేవునిలో తప్పు పట్టుటకు మనము చూచుచుందుము. ఆయన కృప, శక్తితో పనిలేకుండానే మనంతట మనమే బ్రదకగలమని తలంచుదుము. ఏదేమైనను మన జీవాధారమైన దేవుని పోషణను నిర్లక్ష్యము చేసినట్లయితే త్వరలోనే ఎండిపోవుదుమని మనము తెలిసికొందము. గనుక దేవుని వాక్యమందు నిలిచియుండి ప్రతి ఒక్క దినము అవసరమైన పోషకాలను దాని నుండి పొందుదము. ప్రతి నిమిషము మనలను బలపరచుచు, మన బలహీనతలో మనకు చాలిన ఆయన కృపను అంగీకరించుదము.

ప్రార్థన :` నా సంరక్షకుడవైన దేవా, నీ ద్రాక్షతోటలో నీవు నాటిన స్థలములో ఫలించు ద్రాక్ష తీగవలె నేను ఎదుగుటకు సహాయము చేయుము. ఫలింపకయే, ఎదగకయే ముందుగానే నేను ఎండిపోకుండా నీ కృపతో నింపి, నీ వాక్యముతో నన్ను పోషించుమని యేసునామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.
 

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonlin

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page