చదువుము : ఆ.కాం. 39:14-20, 41:38-43
చెరసాల నుండి శిఖరమునకు చేరునట్లు తెలివిగా ఉండుము
‘‘... బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. అట్టివాడు ... పట్టాభిషేకము నొందుటకు చెరసాలలో నుండి బయలు వెళ్ళును’’ (ప్రసంగి 4:13,14)
దేవుని పట్ల యదార్థంఆను, నమ్మకముగాను ఉండువారిని దేవుడు చూచుచుండును, సంరక్షించి, విడిపించి, ఘనపరచునను సత్యము చిన్నవాడైన యోసేఉ కథనము ద్వారా ఒక వెలిగింపుగా ఉన్నది. ఎంతో అస్తవ్యస్తమైన పరిస్థితిలో ఉన్నట్లున్న వ్యక్తి జీవితంలోను ఆయన ఇలా చేయును. యోసేపు పరిశుద్ధముగాను, నిందారహితంగాను, దేవుని నీతిననుసరించు నడుచుకొనుచుండెనని మనమీదిన వాక్యభాగంలో చదువుదుము. అయినప్పటికిని తన యజమాని పోతీఫరు యొక్క భార్యతో అనైతికముగా ప్రవర్తించెనను అపనింద అతని మీదకు వచ్చెను. ఈ అపవాదును బట్టి ఫరో అన్యాయంగా చెరలో వేసెను. అదెంతో నాశనకరమైన బాధగా ఉండెను! అయితే 41 అధ్యాయంలో దేవుడతని పరిస్థితులను మార్చివేసినట్లు మనము చూస్తాము. చెరసాలలోను ఆయన యోసేపుతో ఉండెను. గనుకనే యోసేపు ఆ చెరసాల అధిపతి దృష్టిలో దయ పొందెను. ఆ తరువాత, దేవుడతనిని చెరనుండి విడిపించుటయే కాక ఫరోరాజ్యములో ఫరో తర్వాతి స్థానంలోకి హెచ్చించెను. ‘‘చెరనుండి శిఖరాగ్రము’’ (ప్రిజన్ టు పినాకిల్) సర్వశక్తిమంతుడు, భూమ్యాకాశములను పాలించు దేవుడైన ప్రభువు తప్ప మరెవరు దీనిని చేసియుందురు !
ప్రియ స్నేహితులారా, మనము కూడా చాలాసార్లు చిక్కులలో పడుచుందుము కానీ అది మన తప్పుల వలన కాకపోవచ్చు అయితే మనమంటే గిట్టక మత్సరముతో నిండుకొని మనపై అపవాదులు వేయువారు, మన విశ్వాసమును బట్టియు, దేవుడు మన జీవితాలలో చేసిన గొప్ప కార్యాలను బట్టియు కావచ్చు. అట్టి పరిస్థితులలో మన నిరీక్షణ కోల్పోవునట్లు గాను, మన గుండెలు పిండివేసినంత బాధతోను ఉందుము. మనపై మనమే జాలిపడుచు, మనయందు మనము ధైర్యము లేక నిశ్చయత, లేకపోతే నమ్మకము కోల్పోయి దానిలో కూరుకొనిపోవుచుందుము. ఆ సమయాలలో మన విశ్వాసమందు స్థిరులైయుండి, మనలను అగౌరవపరచి వారి మధ్య మనలను విడిపింప సమర్ధుడైన దేవునియందు నమ్మికయుంచుదము. యోసేపు అభిషేకింపబడిన వాడని, దేవుని ఆత్మగలిగినవాడై, అతనికి దేవుడు తోడుగా ఉన్నాడు గనుక జ్ఞానముగలవాడని ఫరో చూచెను. అంతేకాదు, యోసేపు ఘనతకు యోగ్యుడనియు ఫరో గ్రహించెను. మన పరిస్థితులను బట్టి భయపడవలసిన అవసరము లేదని బలపరాక్రమము గల మన దేవుని యందు నమ్మికయుంచుచుండవలెనని యోసేపు యొక్క కథనము మనలను ధైర్యపరచుచున్నది. ఆయన మనలను విడిపించును. ఆయన మనలను ఘనపరచును. ఖచ్చితంగా తగిన సమయమందు మనము ఘనపరచబడునట్లు దేవుడు చూచును ! ఆమెన్.
ప్రార్ధన :` సమస్తమునెరిగిన మా దేవా, ఎంతో కఠినమైన పరిస్థితిలోను నిన్ను నమ్ము కృపనిమ్ము. నేనెక్కడ ఉన్నను నీవు నాతో ఉన్నావని నెమ్మది కలిగి ధైర్యముగా ఉండి, హృదయంలో కలవరపడకయుండుటకు సాయం చేయుము. నీకు నమ్మకంగాను, యదార్ధముగాను ఉన్నట్లయితే నీవు నన్ను విడిపించి, హెచ్చించి, పాలకులుగా కిరీటము ధరింపజేయుదువని యేసునామమున వేడుకొనుచున్నాను తండ్రీ, ఆమెన్.
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonlin
Comments