చదువుము : ఎఫెసి 6:4, ద్వితి.కాం. 11:19-17
దేవా, నా పిల్లలను కాపాడుము !
‘‘బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు’’
-సామె 22:6
ఈ రోజుల్లో అవినీతి, తిరుగుబాటుతనము దినదినానికి పెరిగిపోవుచుండగా క్రైస్తవ తల్లిదండ్రులమైన మనము మన పిల్లలను ప్రత్యేకంగా వారు యవ్వనస్థులైనప్పుడు వారిని దేవుని మార్గాలలో పెంచవలసిన గొప్ప బాధ్యత మనమీద ఉన్నది. యూదులైతే ఇప్పుడును తమ పిల్లలు మానసికంగా, ఆత్మీయంగా వర్ధిల్లునట్లు మతపరమైన, కుటుంబపరమైన ఆచార వ్యవహారాలను పాటించుచున్నారు. యూదుల పిల్లలెవరైనను 13వ పుట్టిన రోజున వారు టీనేజిలోనికి వచ్చియుండగా యూదా కుటుంబాలు ‘‘బార్ మిట్ జ్వాప్‌ా’’ (ఆజ్ఞల కుమారుడు) అని కుమారుల కొరకు, బాట్ మిట్ జ్వాప్‌ా’’ అని (ఆజ్ఞల కుమార్తె) కుమార్తెలను బట్టియు పండుగ నాచరించుదురు. దీనికొరకు వారు బంధుమిత్రులందరిని పిలిచి ఆ పిల్లలు బాధ్యతయు, అలాగే స్వేచ్ఛయు కలిగిన యవ్వనస్థులని ప్రకటించుదురు. వారి పిల్లలు ఇక ఏ మాత్రము పరిపక్వత లేని చిన్నపిల్లలు కాదని, వారు ఎదుగుచున్నవారని ఆ తల్లిదండ్రులకిది ఒక హెచ్చరిక. ఈ టీనేజికి ముందు పిల్లలు సాధారణంగా తల్లిదండ్రులు చెప్పినదంతయు నిజమని, వారి మతవిశ్వాసములను కూడా నమ్ముచుందురు. కానీ ఆ తరువాత అనేక సిద్ధాంతాలయందు గట్టిగా పరిశోధించుచు వారి వ్యక్తిత్వాన్ని పెంచుకొనుచుందురు. ఒక యవ్వనస్థుని ఈ దశను గూర్చి పాల్ టోర్నియర్గారు ఇలా వివరించుచున్నారు. ‘‘వారి తల్లిదండ్రుల రక్షణ కవచమును తీసివేసి వారి సొంత కోటును అల్లుకొనుట’’. గనుక క్రైస్తవ తల్లిదండ్రులు వారి పిల్లల కొరకు ప్రార్థించుట అత్యావశ్యకమై యున్నది. ‘‘ఈ యవ్వనస్థులు ఇలా ప్రభువునందు వారి ఈ దశలో పరిపక్వతలో కొనసాగుచున్నట్లయితే వారి జీవితాలలో తప్పక మరింత దేవుని కొరకు స్థిరముగా నిలువగలరు. వారికివారే స్వయంశక్తి, నిగ్రహము, ధైర్యము, నిగ్రహము అనువాటిలో అద్భుతముగా ప్రతిఫలము పొందగలరు’’ అని పాల్ టోర్నయిర్గారు వ్రాసిరి.
కావున ప్రియ మిత్రులారా, మన పిల్లలను దేవుని మార్గాలలో పెంచుటకు మనము ప్రయాసపడుదము. వారిని అనుదినము దేవునితో కొంత మౌనధ్యానము చేయునట్లు ప్రోత్సాహపరచి, అన్ని వేళలలో ఆయనయందు నమ్మికయుంచునట్లు పురికొల్పుదము. అన్నిటిని మించి, మనము ‘‘బోధకులము’’గానే కాకుండా క్రీస్తును పోలి జీవించుచు వారికి మాదిరికరముగా ఉందము.
ప్రార్ధన :- ప్రియ తండ్రీ ! నా పిల్లల కొరకు ప్రత్యేకించి టీనేజిలో ఉన్నవారికొరకు వారు దేవునియందు భయభక్తులు కలిగి, దేవుని వాక్యముచేత పోషింపబడవలెనని ప్రార్థించుచున్నాము. శోధకుని ఉరుల నుండి వారిని కాపాడుచు యేసు ప్రశస్త రక్తముతో వారిని కప్పుమని యేసునామమున వేడుకొనుచున్నాను తండ్రీ, ఆమెన్.
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI - 59.
Office: +91 9444456177 || https://www.honeydropsonline.co
Comentarios