చదువుము : గలతీ 5:16-25
సున్నము కొట్టిన సమాధులు
‘‘... ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు’’ (గలతీ 5:16)
సహో॥ భక్తసింగ్గారు తాను రక్షింపబడినప్పటి రోజులను గూర్చి తన పుస్తకాలలో ఒక దానిలో ఇలా వ్రాసెను. ‘‘నేనెప్పుడును అల్లరి చేసినట్లు కనబడలేదు గనుక మా తల్లిగారు నేనెంతో మంచి బాలుడననుకొనేది. నేను స్కూలులో నవలలు చదువుటకు మొదలుబెట్టి, ఒక దినాన కొన్ని ఇంటికి తెచ్చుకొని తెల్లవారురaాము 2 గంటల వరకు చదువుచుంటిరి. అప్పుడు మా అమ్మ ‘‘అంత కష్టపడి ఎందుకు చదువుకొనుచున్నావని’’ నన్ను అడుగగా నేను ‘‘అమ్మా, నేనొక పరీక్ష వ్రాయవలసియున్నది గనుక నేను స్కూలుకు వెళ్ళక మునుపే పుస్తకాలన్ని చదువుకొని రమ్మని మా టీచరుగారు చెప్పిరి. అందువలననే అంత కష్టపడి చదవవలసి వచ్చెను’’ అని జవాబిచ్చితిని. అవునా బాబూ, అని మీగడ, వెన్న కలిపిన పాలు ఇంకొంత ఎక్కువగా నాకు తెచ్చి ఇచ్చినది. ‘‘నేనేమో ఆ చెడ్డ నవలలు చదువుచుంటిని గానీ నా తల్లి నేను నా పాఠ్యపుస్తకాలు చదువుచుంటిననుకొనెను’’. ఆ తదుపరి ఆయన తను వ్రాసిన ఆ పుస్తకములో వ్రాసినదేమనగా, ‘‘బయటకు మనమెంతో మంచివారముగాను, నీతిమంతులముగాను కనబడుదుము గానీ అంతరంగమందు కపటముతో ఉందుము’’ అని.
ప్రియ మిత్రులారా, తన మోసకరమైన మాటలతోను, వేషధారణతోను భక్తసింగ్గారు తన తల్లిని ఎలా మోసపుచ్చెనో చూడుడి. మనలో చాలామంది కూడా ఆలాగుననే చేయుచుందుము. చూచుటకును, మన మాటల ద్వారాను మనము ఎంతో నిజాయితీగలవారముగాను నిందారహితులముగాను, మనలను మనము కనబరచుకొందుము. కానీ లోపల పూర్తిగా చెడిపోయినవారమై యుందుము. మనమెంతో మంచివారముగా ఈ లోకము ఎదుట ఉన్నట్లు అగపడుదుము కానీ, దానికి పూర్తిగా మనము ఆలోచన, ప్రవర్తన కలిగి ఎంతో తెలివిగా ఇతరులను మోసపుచ్చుచుందుము. మనుష్యులను మోసము చేసినట్లు మనమెన్నడైన దేవునిని మోసము చేయగలమా ? లేదు ! మనలను గూర్చి ఆయన సమస్తమును ఎరిగియున్నాడు, అలాగే మన జీవితాలలో వంకరవి తిన్నగా మారవలెనని దేవుడు కోరుచున్నాడు. అందుకోసమే ఆయన తన అద్వితీయ కుమారుని సిలువలో మరణించుటకు పంపెను. ఆయన మనకొరకు మరణించి తిరిగి లేచెనని నమ్మి, ఆయనను మన ప్రభువుగాను, సొంత రక్షకునిగాను అంగీకరించినట్లయితేనే మనము లోపల, బయటను శుద్ధీకరింపబడుదుము. ప్రియ మిత్రులారా, ఆయన మనలను రక్షించుట మాత్రమే కాక నిందారహితముగా నడుచుకొనుటకును మనకు సహాయము చేయును. దీనికొరకే ఆయన మనకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించెను. ఆత్మానుసారముగా నడుచుకొంటే మనము శరీరేచ్ఛలను నెరవేర్చుము అని ఈ దిన వాక్యభాగము చెప్పుచున్నది. సున్నము కొట్టిన సమాధుల వలె ఇక ఉండబోము.
ప్రార్ధన :` ప్రియ తండ్రీ ! నా కొరకు ప్రభువైన యేసు సిలువలో చేసిన త్యాగమును బట్టి ‘‘ఒకానొకప్పటి’’ నా జీవిత విధానము మార్చబడినందుకు నేనెంతో కృతజ్ఞుడను. ఆత్మానుసారముగా నడుచుకొనుచు వేషధారణ మరియు మోసకరమైన జీవితం నుండి తప్పింపబడు కృపననుగ్రహించుమని యేసునామమున వేడుకొనుచున్నాను తండ్రీ, ఆమెన్.
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonlin
Comments