తేనెధారలు
ధైర్యపరచువారు ధన్యులు
‘‘మేము మీకు బోధించునదేమనగా, సహోదరులారా... బలహీనులకు ఊతమియ్యుడి, ధైర్యము చెప్పిన వారిని ధైర్యపరచుడి, అందరి యెడల దీర్ఘశాంతము గలవారైయుండుడి’’ (1 థెస్స 5:14)
గొప్ప గొప్ప విజయవంతమైన సంఘటనలు వెనుక ఎవరో ఒకరు నమ్మకమైన మన ప్రియులో, స్నేహితులో చెప్పిన ప్రోత్సాహకరమైన మాట కానీ, క్రియ కానీ ఉండును. అలాగే ఒక ఆత్మ విశ్వాసంగల భార్య సోఫియా లేకపోతే గొప్ప రచయితలలో ఒకరైన నతానియేలు హాద్రోన్గారి పేరు మనకు తెలిసియుండేది కాదు. కస్టమ్ హౌస్లో అతడు చేయుచుండిన ఉద్యోగము నుండి తొలగింపబడినప్పుడు అతడెంతో బాధతో ఇంటికి వెళ్ళి తానెంతగా విఫలమాయెనో తన భార్యతో చెప్పగా ఆమె అతడిని ఒక ఆశ్చర్యపడు సంతోషకరమైన సంగతి చెప్పెను. ఎంతో విజయోత్సాహముతో ఆమె ‘‘ఇప్పుడు’’ ‘‘నీవు నీ పుస్తకము వ్రాయవచ్చు’’ అనుచు జవాబిచ్చెను. అయితే ‘‘నేను పుస్తకము వ్రాస్తు ఉంటే మనమెలా పోషింపబడుదుము ? అని అతడెంతో నిరుత్సాహముతో చెప్పెను. అప్పుడామె అతడాశ్చర్యపడునంతగా ఒక డ్రాను తెరచి కొంత పెద్ద మొత్తములోనే డబ్బు బయటకు తీసెను. అప్పుడు నతానియేలు ‘‘ఈ డబ్బు ఎక్కడిది ?’’ అనుచు ఆశ్చర్యపడుచుండగా ఆమె ‘‘నీవెంతో తెలివైనవాడవని నాకు తెలుసు. ఏదో ఒక దినాన నీవొక గొప్ప గ్రంథము వ్రాయుదువు అనియు నాకు తెలుసు. గనుక ఇంటి ఖర్చుల కొరకు ప్రతివారము నీవు నాకు ఇచ్చు ధనములో కొంత పొదుపు చేసి దాచియుంచితిని. కాబట్టి ఒక సం॥ అంతటికి సరిపోవు డబ్బు ఉన్నది !’’ అని చెప్పినది. ఆమె నమ్మకము, ధైర్యము, ప్రోత్సాహము నుండి వచ్చినదే. అమెరికా సాహిత్యములో ఆమె భర్తjైున నతానియేలు హాథ్రోన్గారు రచించిన ‘‘ది స్కార్లెట్ లెటర్’’ అను గొప్ప నవల.
ప్రియ స్నేహితులారా, మనము ప్రోత్సహించువారిగా ఉన్నామా లేక నిరుత్సాహ పరచువారిగా ఉన్నామా ? 2 తిమోతి 2 అ.లో పౌలు తిమోతిని క్రీస్తు సైనికునివలెను, ఒక ఆటగానివలెను, ఒక వ్యవసాయదారుని వలెను శ్రమలను ఓపికతో సహించవలెనని ధైర్యపరచు చున్నాడు. తిమోతిని దేవుని యొక్క ఒక మంచి సేవకునివలె మార్చినది. పౌలు యొక్క ప్రోత్సాహపరచు మాటలే. కృంగినవారిని, నిరుత్సాహంలో ఉన్నవారితో ధైర్యపరచు మాటలను పలుకు క్రైస్తవులముగా ఉన్నామా ? పదే పదే మేము వ్రాస్తున్నట్లు మన మాటలకు కట్టు శక్తిగానీ, ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేయు శక్తియు ఉన్నదని మనము గుర్తుపెట్టు కొనవలెను. గనుక మన కుటుంబ సభ్యులు మరియు మన తోటి పనివారి జీవితాలపై గొప్ప ప్రభావము చూపు అనుకూల వచనము, ధైర్యపరచు మాటలే మాట్లాడుదుమని మనము తీర్మానించుకొందము.
ప్రార్ధన :` ప్రియ ప్రభువా, ‘‘ఒకని హృదయములోని విచారము దాని క్రుంగజేయును, దయగల మాట దాని సంతోషపెట్టును’’ అని సామె 12:25 చెప్పుచుండగా అవసరతలోను, కలవరముతోను ఉన్న వారితో ధైర్యపరచు మాటలే మాట్లాడు కృప నాకిమ్ము. ప్రోత్సాహపరచువానిగా నేనుండు కృప దయచేయుమని గొప్పగా ధైర్యపరచు యేసునామమున ప్రార్దించుచున్నాను తండ్రి ఆమెన్.
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonlin
Comentários