top of page

15, మార్చి 2025 శనివారము || శనివారము

చదువుము : ఎఫెసీ 1:3-14


మొదట నీ ఆత్మలో స్వస్థతపొందుము


‘‘పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసునందు నిత్యజీవము’’ - రోమా 6:23


ఎవరైన ఒక రోగి పరిస్థితి చాలా బాగులేనప్పుడు డాక్టర్లు సాధారణంగా చెప్పు మాట ‘‘క్లిష్టతరముగా’’ లేక ‘‘తీవ్రముగా’’ ఉన్నది అని. అలాగే దేవునికి అవిధేయుడై ఆయన ఆజ్ఞలను లోబడని ఒక పాపి కూడా చాలా క్లిష్టమైన స్థితిలో ఉన్నాడని అర్థము. ఎందుకని ? మొట్టమొదటగా, అతడు దేవుని నుండి వేరుచేయబడియుందురు. ఏథేను తోటలో అతడు దేవుడు స్నేహితులవలె ఇక నడవరు. రెండవదిగా, మనిషి తన పొరుగువాని నుండి వేరుపడియుందురు. అతడు ద్వేషించుచు, మోసము చేయుచు, ఇతరులతో అబద్దము లాడుచుందురు. ఇతరులది ఆశించి, గొడవలు, హింసకు దారితీయును. మూడవదిగా, మనిషి తనకు తానే వేరుపడియుండును. అతని స్వభావమే పాడైపోయినదై యుండును. అతని ఆత్మ తప్పిపోవును. అతడు మరింతగా విచ్చలవిడిగా త్రాగుడు, మాదక ద్రవ్యాలు మొ॥ వాటికి అలవాటుపడి తన శరీరమును తానే నశింపజేసికొనును. తన సొంత తెలివితో తనను తానే బాగుచేసికొన ప్రయత్నించి, పరిస్థితులు మరెక్కువగా దారుణంగా మారి అతని స్థితి మరి క్లిష్టతరముగా మారును. అతని ఆలోచన, ఆచారాలు, తప్పుడు మతములు, సుఖసంపదలు ఏవియు అతనికి తోడ్పడవు. నిజానికి ఆ రోగి పరిస్థితిని ఆ ప్రయత్నాలు మరింత దిగజార్చును. అలాగైతే మరత బాగుపడుటకు ఏకైక నిరీక్షణ యేసునందే దొరుకును. మనిషి యొక్క పాపము దేవునికి విరోధమైనది గనుక ప్రభుయేసు మాత్రమే అతనికి రక్షణ అను వరమునియ్యగలడు. ఆయన మాత్రమే క్షమాపణ ఇయ్యగలడు. యేసు మాత్రమే మనిషి పాప ఫలితాలను తొలగించి బంధకాలనుండి అతనిని విడిపించును.

ప్రియ మిత్రులారా, మీ ఆత్మీయస్థితి ఏలాగున్నది ? అది క్లిష్టముగాను, విషమంగాను ఉన్నదా ? అది నిన్ను నిత్య మరణానికి నడిపించును గనుక ఆ స్థితిలోనే కొనసాగవద్దు. ప్రభువైన యేసు కృపచేత అనుగ్రహించు రక్షణను స్వీకరించుము. దేవునికి విరోధముగా మనము చేసిన దానిని బట్టికాక యోగ్యతలేని వారికి దేవుడు అనుగ్రహించునదే కృప. సిలువపై ఆయన చూపిన క్షమించు ప్రేమయే కృప. కావున సిలువ చెంతకు చేరి మీ పాపములు ఒప్పుకొని, ఆయన రక్తముతో కడగబడి మీ ఆత్మలో దైవిక స్వస్థత ననుభవించుము.
ప్రార్ధన :- సర్వశక్తిగల దేవా, నా ఆత్మీయ స్థితి ఎంతో విషమంగా ఉన్నదని గ్రహించితిని గనుక నా ఆత్మకు స్వస్థత అవసరమైయున్నది. నా కొరకు తన రక్తము చిందించి, తిరిగి నన్ను స్వస్థపరచి నీతో చక్కని సహవాసమును పునరుద్ధరించునట్లు ఆ సిలువ చెంతకు నేను యేసు నామమున వచ్చుచున్నాను. తండ్రీ, ఆమెన్.

తేనెధారలు

 

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonline.com

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page