top of page

15, నవంబరు 2024 శుక్రవారము || తేనెధారలు

చదువుము : కీర్తన 34:1-10

దేవుని కొరకు మీరు దప్పిగొనియున్నారా ?


‘‘నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమివలె నా ప్రాణము నీకొరకు ఆశపడుచున్నది’’

-కీర్తన 143:6



‘‘ప్రార్థన అనగా మన హృదయాలు దేవునివైపు త్రిప్పి, ప్రతిఫలముగా ఆయన ప్రేమను పొందుటకంటె మరేమి కాదు’’ అని మాడమ్‌ గుయాన్‌ వ్రాసిరి. యెడతెగక ప్రార్థన చేయుడి అని బైబిలు మనకు చెప్పుచున్నది (1 థెస్స 5:17). ప్రార్థన చేయుటకు ఆశ కలిగినవారు మనమాయన వద్దకు వెళ్ళి ఆసక్తితో ప్రార్థించునప్పుడెల్ల ఆయన మనకు జవాబిచ్చుటకు సిద్ధముగా ఉండి వేచియుండుటను గమనించగలరు. గనుక యెడతెగక ప్రార్థించుట వారికి సులువే. కావున మన శ్రమలు, బాధలు ప్రార్థనలో ఆయనకు విన్నవించినట్లయితే తప్పక మనమాదరింపబడుదుము. మనకు అనారోగ్యముంటే స్వస్థపరచబడుదుము, పేదలమైతే, తప్పక దీవించబడుదుము. జ్ఞానము కొదువుగా ఉంటే ఖచ్చితంగా జ్ఞానపూర్ణులమగుదము. ఇదెంత భాగ్యము !



ప్రియ మిత్రులారా ! ఈ మర్మమును గ్రహించి దానిని మన జీవితాలలో చవిచూచెదము. చిన్నబిడ్డలవలె నమ్మి మన తండ్రిని సమీపించుదము. మన హృదయాలు ఆయన ఎదుగుటకు కుమ్మరించుదము. మన కలవరములన్నియు ఆయన ఎరిగియున్నాడు. మన బాధ, వేదనలన్నియు ఆయన అర్థము చేసికొనును. ఆయన ప్రేమ, కనికరము గలవాడు. మనలనెన్నడు విడువక తన ప్రేమాహస్తాలతో కౌగిలించుకొన ఆశించును. ఆయనను వెదకవలెనను మన కోరిక కంటె ఆయనే మనతో సహవాసము చేయవలెనని కోరును. మనమాయనను స్వీకరించవలెను. కోరిక కంటె మరింతగా తనను తానే మనకు ఇచ్చివేసికొన సిద్ధముగా ఉండును. అది అలవాటుగానో లేక ఒక బాధ్యతగానో కాక ఆయన స్వరము విని, ఆయనతో సహవసించవలెనను లోతైన ఆశతో ఆయన సన్నిధిలోనికి ప్రవేశించుదము. దేవునిని, ఆయన మధురమైన ప్రేమను అనుభవించినప్పుడు ఆయన కంటే మరిదేని మీదను మన ప్రేమను పెట్టుకొనుము. అలాగే ‘‘దుప్పి నీటివాగుల కొరకు ఆశించునట్లుగా దేవా, నా ప్రాణము నీకొరకు తృష్ణగొనుచున్నది’’ (కీర్తన 42:1) అని కీర్తనాకారునితో కలసి మనమును చెప్పుదుము. దినదినము దేవుని కొరకైన ఆసక్తి వృద్ధినొందుటను చూచి ‘‘యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను’’ (కీర్తన 27:4) అని దావీదు వలెనే మనము చెప్పగలము.


ప్రార్ధన :- పరమందున్న నా తండ్రీ, నీ ప్రేమ మాధుర్యమును, నీ సహవాసమును అనుభవించుటకు నీ సన్నిధికి వచ్చుచున్నాను. ఈ లోకసంబంధమైనవేవియు దానికి ఆటంకము కలిగించకయు, నీ పట్ల నా ఆసక్తి ఎదుగుచు క్షణక్షణమును నీవలె రూపాంతరము చెందునట్లున కృపచూపుమని యేసునామమున ప్రార్ధించుచున్నాను తండ్రి, ఆమెన్‌.


 

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI - 59.

Office: +91 9444456177 || https://www.honeydropsonline.co

댓글

별점 5점 중 0점을 주었습니다.
등록된 평점 없음

평점 추가
bottom of page