14, మార్చి 2025 శుక్రవారము || శనివారము
- Honey Drops for Every Soul
- Mar 14
- 1 min read
చదువుము : యెహెజ్కేలు 40:1-5
ప్రతి చిన్న విషయాలను కూడా దేవుడు లక్ష్యముంచును
‘‘... నేను నీకు చూపుచున్నవాటినన్నిటిని కన్నులార చూచి, చెవులారా విని మనస్సులో ఉంచు కొనుము’’ - యెహెజ్కేలు 40:4
పాత నిబంధనలో దేవుడు తాను ఏర్పాటు చేసికొనిన జనులతో వ్యక్తిగతముగాను, ప్రత్యేకమైన విధానలలోను జోక్యంచేసికొని వారితో మాట్లాడి ముఖ్యముగా తన ఉపదేశమును యదార్థంగా అనుసరించిన వారితోను ఆయన సంబంధం కలిగియుండెను. నోవహును ఓడ కట్టుమని ఆయన కోరినప్పుడు ‘‘ఈ విధంగా నీవు దీనిని నిర్మించవలెను...’’ అని అతనితో చెప్పి, అతి స్వల్ప వివరాలను గూర్చి కూడా ఆయన సూచనలిచ్చెను. (ఆ.కాం. 6:15). మరియు ‘‘దేవుడు చెప్పినట్లే నోవహు సమస్తము జరిగించెను’’ అని ఆ.కాం. 6:22 చెప్పుచున్నది. ఎట్టి పరిస్థితిలోను, ఏ సమయములోను నోవహు దానిని నతిక్రమించలేదు ! రెండవదిగా, దేవుని నివాసముగా ప్రత్యక్ష గుడారము నిర్మించుమని దేవుడు, మోషేను కోరినప్పుడు ‘‘నేను చూపించు మచ్చు ప్రకారమే ఈ ప్రత్యక్ష గుడారమును, దాని ఉపకరణాలను ఖచ్చితంగా చేయుము’’ అని చెప్పెను. (నిర్గ.కాం. 25:9). దేవుడు ఆజ్ఞాపించినట్లుగానే మోషే సమస్తమును చేసెనని నిర్గ.కాం. 40 చెప్పుచున్నది. మూడవదిగా, దావీదు గూర్చి చూస్తే ఆయన దేవుని కొరకు ఒక ఆలయము కట్టవలెనాశించెను కానీ, ఈ పనిని తన కుమారుడైన సొలొమోనుకు అప్పగించవలెనని చెప్పెను. దేవుడు ఆలయము కట్టుటకు దావీదుకు అనుమతి ఇయ్యనప్పటికి అత్యద్భుతంగా దేవుడు దాని పూర్తి మచ్చును అతని చేతికే అప్పగించెను. 1 దిన వృత్తాం. 28:19లో ‘‘యెహోవా హస్తము నా మీదికి వచ్చియి మచ్చుల పని అంతయు వ్రాతమూలముగా నాకు నేర్పెను’’ అని దావీదు చెప్పెను. ఈ వివరాలన్ని దావీదు తన కుమారురుడైన సొలొమోనుకు అందించుట మాత్రమే కాక దానిని కట్టుటకు అవసరమైన సమస్తమును కూడా సంపాదించి యిచ్చెను. ఎంత ఖచ్చితమైన విధేయత !
ప్రియ మిత్రులారా, ఈ దైవజనుల నుండి మనమొక ప్రాముఖ్యమైన పాఠము నేర్చుకొనగలము. అత్యల్ప విషయము కూడా దేవుడు ఎరిగియున్నాడు మరియు సమస్తము ఆయన చేతిలోనే ఉన్నది గనుక దేనిని గూర్చియు మనము చింతించవలసిన అవసరము లేదు. కావున ఆయన ఏమి చెప్పినను విధేయులమై దానిని పూర్ణహృదయముతో చేయుదము.
ప్ర్రార్ధన :- ప్రియ ప్రభువా, నా జీవితంలో ప్రతి దినము ఉదయమున నిద్రలేచినది మొదలు తిరిగి రాత్రి నిద్రకుపక్రమించు వరకు ప్రతి చిన్న విషయాలను కూడా నీవు లక్ష్యముంచుదువని ఎరుగుట ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. అన్ని విషయాలలో విధేయత చూపుటకు సహాయము చేయుమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonline.com
Comments