చదువుము : యాకోబు 5:10-11
అన్ని సమయాలలో దేవుడుమంచివాడు
‘‘ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు’’ (యోబు 1:22)
శ్రమలు, సమస్యలు వచ్చినప్పుడు కొందరు దేవుని నిందించుచు, ఆయన వారిపట్ల నిర్దయగా ఉన్నాడని అందురు. కొందరైతే ఆయన ఎల్లవేళల వారినే శిక్షించుచు, ఇతరులకు మాత్రము వారి అర్హతకు మించి ఇచ్చుచున్నాడని చెప్పుచుందురు. మరికొందరు వారి పట్ల దేవుడు కోపంగా ఉన్నాడంటే వారేదో తప్పు చేసిరేమోనని వారి శ్రమలో అందురు. ఈ తలంపులన్నియు దేవుని నుండి ప్రజలను వేరుచేయనుద్దేశించి, కుయుక్తిగా సాతాను చేత పురికొల్పబడునవే. అయితే దేవుని బిడ్డలమైన మనము మన జీవితాలలో ప్రతి విషయము ఆయన స్వాధీనంలోనే ఉన్నదని కష్టకాలములో కూడా మరువక ఆయన చాలినంత శక్తిమంతుడు, మంచివాడు, జ్ఞానవంతుడు అని ఎల్లవేళల నమ్మదగినవాడు అను సత్యమును, ఎన్నటికి మరువకయు, తిరస్కరించకయు ఉండవలెను. మనము యోబు గ్రంథమును చదివినట్లయితే అతని కీర్తిప్రతిష్ఠలు, అతని విశ్వాసము ఎంతో తీవ్రంగా పరీక్షింపబడెనని మనకర్ధమగును. అతడు పూర్తిగా విధ్వంసానికి గురియాయెను. ఒకదాని వెంట ఒక చెడు సమాచారము వెంటవెంటనే అతనికి అందినది. అతడు నిశ్చేష్టుడై, హృదయమెంతో దు:ఖముతో నిండిపోయెను. అప్పటికి కూడా దేవుని పట్ల యోబు తన దృష్టిని మరల్చుకోలేదు. ‘‘యెహోవా ఇచ్చెను, యెహోవా తీసికొనిపోయెను. ఆయన నామమునకే స్తుతి కలుగును గాక’’ అని చెప్పుచు అతడు దేవుని నారాధించి, మహిమపరచెను.
ప్రియ స్నేహితులారా, దేవుని స్వభావము మారనిదని మనము మరువరాదు. మన పరిస్థితులు మారినందున ఆయన మారడు. మన పట్ల ఎంతో మంచివాడై, కనికరము కలిగియున్న ఆయన హఠాత్తుగా మన శ్రమకాలములో కఠినాత్ముడుగాను, లక్ష్యముంచని వానిగాను మారెనని మనమనుకొనరాదు. దేవుడు ఎల్లవేళల మంచివాడనియు, సమస్తము ఆయన స్వాధీనంలోనే ఉన్నదని మనము గుర్తుపెట్టుకొందము. దేవుడు మన గురించి సమస్తము ఎరిగినవాడు. ఒక్క క్షణము కూడా దేవుడు మనలను విడువడు. గనుక మన కష్టకాలంలో ఆయనయందు నమ్మికయుంచి ఆయనకు సన్నిహితంగా ఉందము. కొన్నిసార్లు మన జీవితాల ద్వారా ఆయన మహిమను కనబరచుటకు మన శ్రమలను వాడుకొనును. యోబువలెనె మన ప్రతిస్పందన ఉండవలెను. యోబు 2:10లో ‘‘ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటిమాటతోనైనను పాపము చేయలేదు’’ అను మనము చదువుదుము. గనుక ఆయన సహనమును బట్టి దేవుడు ఆయనను ఘనపరచెను. ఆ విధముగానే దేవుడు మనకు కూడా ప్రతిఫలమిచ్చును.
ప్రార్ధన :` ప్రేమగల దేవా, నేను వెళ్ళుచున్న ఈ శ్రమల మార్గమును నీవెరిగియున్నావు గనుక నేను భయపడను. నీకు విరోధముగా సణగక, ఈ బాధాకరమైన పరిస్థితినుండి విజయవంతముగా నీవు నన్ను బయటకు తెచ్చుదువని నమ్ముచు, అట్టి స్థితిలో నీవు నాకేమి నేర్పించు పాఠమును నేను నేర్చుకొనుటకు సహాయము చేయుమని యేసునామమున ప్రార్దించుచున్నాను తండ్రి ఆమెన్.
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonlin
Comments