చదువుము : కీర్తన 43:1-5
నిరీక్షణ - మన ఆత్మలకు టానిక్
‘‘నిశ్చయముగ ముందు గతి రానేవచ్చును, నీ ఆశ భంగము కానేరదు’’ - సామె 23:18
‘‘సిగరెట్లు (పొగ) త్రాగుట ఆరోగ్యానికి హానికరము’’ అను నినాదము మనందరికి బాగా తెలుసు. అలాటిదే మనము జాగ్రత్తగా ఆలకించవలసిన నినాదము మరొకటి ఉన్నది. ‘‘హెచ్చరిక : నిరాశ లేక నిరీక్షణ స్థితి ! మీ ఆరోగ్యానికి ప్రమాదకరమైనది’’. నిరాశా నిస్పృహలకును బి.పి., షుగర్ మొ॥గు వ్యాధులకు ప్రత్యక్ష సంబంధమున్నదని అనేక వైద్య పరిశోధనలు తెలుపుచున్నవి. ఒక పరిశోధనా ఫలితము చెప్పుచున్నదేమనగా : వయోవృద్ధుల సంస్థ ఒకటి సమకూర్చు ధనముతో నడిపించబడుచుండగా ఎనిమిది వందల మంది అమెరికన్ వృద్దులను ‘‘మీ భవిష్యత్తు పట్ల మీరు నిరీక్షన కలిగియున్నారా ?’’ అని అడిగినప్పుడు వ్యతిరేకమైన జవాబిచ్చిన వారిని ఒక ‘‘నిరీక్షణ లేని’’ గుంపుగా ఎంచబడిరి. ఆ తరువాత దానిలో పాల్గొనిన వారిని 3-7 సం॥లు పరిశీలించినప్పుడు ‘‘నిరీక్షణ లేని’’ వారిని ‘‘నిరీక్షణతో’’ ఉన్న 11 శాతం మందితో పోల్చినట్లయితే 29 శాతం మంది మరణించిరి. నిరాశతో ఉన్నవారితో కొన్ని కారణాలు వారిలో రోగానికి నడిపించుచు మన రోగ నిరోధక వ్యవస్థను బలహీనపరచుకొని రసాయనాలు విడుదలగుచున్నవని శాస్త్రజ్ఞులు చెప్పుచున్నారు. నిరాశ మన రోగనిరోధక వ్యవస్థను బలహీనపరచుచున్నట్లే అది మన ఆత్మలను కూడా క్షీణింపచేయును. అలాగే నిరీక్షణ మనకు దేవుడు సమస్తము మేలుకొరకే చేయుననియు, అనగా రోగము, ఆర్థిక ఇబ్బందులు, వైఫల్యము, మోసగింపబడుట, లేక మనమెదుర్కొను ఎట్టి విపత్తుjైునను, సమస్తము మేలుకొరకే దేవుడు జరిగించునను ధైర్యము కలిగించును.
ప్రియ స్నేహితులారా, పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు మనకు నిరుత్సాహము, కలవరము, భయము, కృంగుదల కలుగును... కానీ మనము నిరీక్షణను విడిచిపెట్టక యుందము. ‘‘దేవుడు మనకిచ్చిన వాగ్ధానము నెరవేర్చువరకు సహించు కృప ఆ నిరీక్షణ మనకిచ్చి, అద్భుతంగా స్థిరంగా ఉండు శక్తిననుగ్రహించును’’ అని యాన్ స్పాంగ్లర్‌గారు వ్రాసిరి. అబ్రహాము తన శరీరము మృతతుల్యమైన స్థితిలో ఉన్నను దేవుడు సంతానము ఇచ్చునని నమ్మి, నిరీక్షణలేని సమయంలో నిరీక్షణ కలిగియుండిన ఆయనను గుర్తుచేసికొందము. అంతేకాదు, అతని నిరీక్షణ సిగ్గుపరచలేదు. ‘‘ఆయన నన్ను చంపినను, నేనాయనయందు నిరీక్షింతును’’ అనిన యోబును మనము జ్ఞాపకము చేసికొందము (యోబు 13:15). అతని నిరీక్షణ కూడా అతనిని సిగ్గుపరచలేదు. కనుక తానిచ్చిన మాట చొప్పున మన ఆశలు దేవుడు తప్పక నెరవేర్చునను నిరీక్షణతో మనమును భవిష్యత్తును చూచుదము.
ప్రార్ధన:- ప్రియ ప్రభువా, పరిస్థితులు ఆశాజనకంగా లేనప్పటికి, అననుకూలంగా ఉన్నను నీయందు నిరీక్షణ కోల్పోక ఉండు కృపనిమ్ము. నేను నీ బిడ్డను గనుక నీవు నన్ను ఎన్నడు బాధపెట్టకయు, హాని చేయకయు, సమస్తము మేలుకరముగా జరిగించుదువని నమ్మి యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI - 59.
Office: +91 9444456177 || https://www.honeydropsonline.co
Comments