top of page

13, ఏప్రిల్‌ 2025 ఆదివారము || ఇదిగో నేనున్నాను, నన్ను పంపుము ! వాడుకొనుము

తేనెధారలు చదువుము : మత్తయి 21:1-11


‘‘... యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, ‘‘మీ యెదుట నున్న గ్రామమునకు వెళ్ళుడి...’’ - మత్తయి 21:1,2


తాను వచ్చిన పని ఏమిటో యేసుకు తేటతెల్లమే, ఆయనకు మొదట సిలువ, ఆ తరువాత కిరీటము, సిలువ యొద్దకు చేరు మార్గములో జయప్రవేశ ప్రత్యేక సందర్భములో ఆయన తన ఇద్దరు శిష్యులను, పేరు చెప్పబడని ఆ గాడిద యొక్క యజమానిని వాడుకొనుటకు ఇష్టపడెను. ఆయనే క్రీస్తు అని పాత నిబంధన ప్రవక్తల ద్వారా చెప్పబడిన ప్రతి వివరమును గూర్చి ఎంత శ్రద్ధ కలిగియుండెనో అని గమనించుట ఎంతో ప్రాముఖ్యమైనది. (జెకర్యా 9:9). సర్వజ్ఞానిjైున ప్రభువు ఆ గాడిదను, దాని పిల్లను ఆయన వద్దకు వచ్చునట్లు ఆజ్ఞాపించగలడన్నది విస్పష్టమే ! కానీ, ఈ పనిలో ఆయనకు పరిచర్య చేయుటకు క్రీస్తుప్రభువు తన శిష్యులను బేత్పగే అను గ్రామమునకు పంపి, ఆ గాడిద యొక్క యజమానిని ఆయనకిచ్చుటకు వాడుకొనెను.


అబ్షాలోము ఎదుట నుండి దావీదు పారిపోయినప్పుడు ఆ అరణ్యములో బర్జిల్లయి అను అతనిని కలిసికొని, అతడు దావీదునకు ఆహారము మొ॥ తెచ్చియిచ్చెను. తిరిగి దావీదు రాజ్య సింహాసనమధిరోహించినప్పుడు పూర్వము తనకు నమ్మకమైన బర్జిల్లయిని పిలిపించి అతనికి సాయం చేయదలచెను. కానీ, రాజునకు భారము కాకూడదని, తాను ప్రేమించిన రాజు సంతోషముతో పరిపాలించవలెనని దానికి ఒప్పుకొనలేదు.


ప్రియ స్నేహితులారా, మన రాజైన యేసు మనకొరకు సిలువకు వెళ్ళి దేవుని శిక్షను భరించెను. అది ఎరిగిన మనము బర్జిల్లయి దావీదునకు చేసిన దానికంటె ఏమైన తక్కువగా చేయగలమా ? తన నమ్మకమైన పరిచర్యలో నమ్మకమైన వారియందు మన రాజు సంతోషించును. ఒక ప్రత్యేకమైన పని నిమిత్తము పంపబడిన క్రీస్తుశిష్యులవలె మనము ఉండవచ్చు లేక ఆ గాడిద యొక్క యజమానుల వలె ఆయనకు అవసరమైన వాటిని ఉచితముగా ఇచ్చుచుండవచ్చు. అంతట గొప్ప రాజు చేతిలో వాడబడుటకు గొప్ప ధన్యతగా భావించుదము.

ప్రార్ధన:- ప్రియమైన ప్రభువా, నా పట్ల నీకున్న ప్రేమను బట్టి పాప బంధకాలనుండి రక్షించుటకు నీవు సిలువకు వెళ్ళితివి. ప్రతిగా నేను నీకేమియ్యగలను ? నా ప్రేమను, సేవను తప్ప ఏమియ్యగలను ! నీవే పని మీద పంపినను, లేక నా నుండి నీవేది కోరికను నేను సిద్ధమే. నన్ను వాడుకొనుమని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్‌.

తేనెధారలు

 

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonline.com

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page