చదువుము : లూకా 5:27,28, మత్తయి 9:9-10
విందుతో సువార్త చేయుట!
‘‘శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి’’ (రోమా 12:13)
"జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు’’ (సామె 11:30)
మన జీవితంలో ప్రతి చిన్న విషయము, మన బంధుత్వాలు, స్నేహాలు అలాగే మనము కలిసికొను ఇతరులతో జరుగు సంఘటనలతో సహా సర్వాధికారిjైున మన ప్రభువుకు తెలియకుండా ఏదియు జరుగదు, అనుకోకుండా జరిగేవేవియు ఉండవు. ఒక నిర్దిష్టమైన కుటుంబంలోను, ఇరుగు పొరుగులోను, పనిచేయు స్థలాలలోను ఒక కారణముతోనే దేవుడే మనలను ఉంచును. క్రీస్తుప్రభువు కొరకు మనము ఎవరికొరకు పని చేయవలెనో వారి ప్రక్కనే దేవుడు మనలను ఉంచెను. మనకు ఎదురయ్యే ప్రతి ఒక్కరు ఎంతో విలువైనవారు గనుక వారి పట్ల దేవుడు ఎంత శ్రద్ధ కలిగియుండునో అంతే శ్రద్ధతో మనము వారిలో ప్రతి ఒక్కరి పట్ల వ్యవహరించవలసియున్నది. ‘‘మనకు నాలుగు విధాలైన సంబంధ బాంధవ్యాలు కలిగియుందుము. రక్తసంబంధాలు (కుటుంబము, బంధువులు), భౌగోళికమైనవి (మనము నివసించు ప్రదేశము) వృత్తిపరమైన (మన పని స్థలములో) మరియు విందు, వినోదపరమైన (మన విశ్రాంతి సమయం గడుపు స్థలములో) మన సంబంధ బాంధవ్యాలలో వీలైనన్ని పేర్లు వ్రాసికొని వారి కొరకు ప్రార్థించవలసిన అవసరము మనకున్నది’’ అని కెంట్ హ్యూస్గారు వ్రాసిరి. ప్రార్థించుచునే దానికి తోడు వారికి సువార్త ప్రకటించుటకు ఒక ప్రాముఖ్యమైన మార్గమేదనగా వారితో సహవాసము కలిగియుండుటయే. వారిని ఒక పార్టీకో, భోజనానికో మన పుట్టిన రోజులు, పెండ్లి రోజులు లేక పండుగలు వంటి కొన్ని ముఖ్యమైన రోజులలో వారి మన ఇండ్లకు ఆహ్వానించుట ద్వారా మనము దీనిని చేయవచ్చు. ఈ దిన వాక్యభాగముల మత్తయి అనబడిన లేవి అను సుంకపు గుత్తదారును గూర్చి మనము చదువుదుము. ఇతడు యేసుప్రభుని శిష్యుడైన పిదప ఆయన కొరకు తన యింటిలో ఒక గొప్ప విందు ఏర్పాటుచేసి తన పూర్వపు సహోద్యోగులను కూడా ఆహ్వానించెను. రక్షింపబడని వారికి యేసును పరిచయము చేయుటలో ఇదెంత మంచి మార్గమో కదా ! అక్కడ చేరియున్న అంతమందిలో కనీసము కొద్దిమందిjైునను యేసును అంగీకరించి యుందురని నేను గట్టిగా నమ్ముచున్నాను.
ప్రియ మిత్రులారా, మత్తయి చేసినట్లు మనము కూడా చేయవచ్చు. మత్తయి తనలో కలిగిన ఆ రక్షనానందమును పట్టలేకపోయెను. తన స్నేహితులందరును సువార్తను అంగీకరించవలెనని అతడాశించెను. రక్షణలేని మన స్నేహితులు, ఇరుగుపొరుగువారి పట్ల మనకు అట్టి శ్రద్ధ ఉన్నదా ? స్వార్ధపరులముగాను, ఏమి పట్టనట్లును మనము ఉండక ఏదో ఒక విధముగా మన చుట్టు ప్రజలకు సువార్తనందించుటకు ప్రయత్నించి, వారి కొరకు ప్రార్థించి, మిగిలిన సంగతి దేవునికి విడిచిపెట్టుదము. పరిశుద్ధాత్మయే వారి పాపాలను ఒప్పించి వారిని క్రీస్తువద్దకు నడిపించును.
ప్రార్ధన:` ప్రియ ప్రభువా, అవకాశము దొరికినప్పుడెల్ల నాకెదురైన వారికి సువార్త ప్రకటించుటకును, వారితో స్నేహము చేసి వారి పట్ల శ్రద్ధ చూపు కృపనిమ్ము. వీలైనప్పుడు వారిని నా యింటికి భోజనానికి పిలిచి వారికి యేసును గూర్చి పరిచయము చేయుటకు సాయం చేయుమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonlin
Comentarios