తేనెధారలు
తుపానులుండు స్థలమా ? లేక నిరీక్షణా స్థలమా ?
‘‘... నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు’’ (కీర్తన 30:11)
మనందరమును మన జీవితాలలో క్లిష్ట సమయాలను ఎదుర్కొందుము. అట్టి పరిస్థితులలో ఈ సమస్యలు శాశ్వతముగా ఉండవని మనము జ్ఞాపకము చేసికొన వలెను. రాత్రి తరువాత పగలు వచ్చుచునేయుండుననియు, నీరు లేక ఎండిన భూమిపై తరువాత ఖచ్చితంగా కుండపోత వర్షము కురియును. అలాగే శీతాకాలము తరువాత వేసవి కాలము మరియు వర్షాకాలము కూడా తప్పక వచ్చును. అనేక సం॥ల క్రితము ఆఫ్రికా దేశము దక్షిణ కొనలో సముద్రమెంతో తుపానుతో అల్లకల్లోలంగా ఉన్నప్పుడు బలహీనమైన పోర్చుగీసు వారి ఓడలు ఆ దిశగా వెళ్ళుచు ఆ భయంకరమైన తుపానులను చూచి ఆ ప్రదేశానికి కేప్ ఆఫ్ స్టార్మ్స్ అని పేరు పెట్టిరి. కావున క్లిష్ట సమయాలలో భయపడక ఈ తుపాను వచ్చే ప్రదేశాలు మనకు మంచి నిరీక్షణా ప్రదేశాలని ధైర్యము చెప్పుదము.
ప్రియ స్నేహితులారా, కలవరముతో కూడిన తలంపులతో మీరు సతమతమగు చున్నారా? మొదటగా గతంలో జరిగిన సంగతులను మనసుకు తెచ్చుకొనుడి. యేసు మిమ్మును మొదటగా కలిసికొని, పాప బానిసత్వము నుండి రక్షించిన ఆ దినము మీకు గుర్తున్నదా ? ఆ మరణకరమైన తెగులు నుండియు వేటకాని ఉరినుండియు ఆయన నిన్ను కృపతో విడిపించిన సమయాలను నీకు జ్ఞాపకము చేసికొందువా ? గతములో నిన్ను విడిపించిన ఆయన ఈ క్లిష్ట సమయంలో ఇప్పుడు నిన్ను విడిచిపెట్టునని నీవు అనుకొనుచున్నావా ? ఆయన ప్రేమించుచు, ద్వేషించుచు ఉండువాడు కాడు. ఆయన చిత్తమెన్నడు మారదు. ‘‘నా అరచేతుల మీద నిన్ను చెక్కియున్నాను’’ అని చెప్పిన ఆయన నిన్ను మరచుట కానీ, ఆయనికిష్టులైన వారిని త్రోసివేయుట కానీ అసాధ్యము. సి.హెచ్. స్పర్జన్గారు ఒకప్పుడు చెప్పినదేమనగా, ‘‘నేను చిన్నవాడనైనను ఎంతగా బాధ కలుగునో అంతగా నేనెన్నో శ్రమలను ఎదుర్కొంటిని. నేను మాట్లాడకపోతే కృతజ్ఞత లేని నా మౌనమునకు బదులుగా ఈ రాళ్ళు కేకలు వేయును’’ అని నేను చెప్పుచును, అలా చెప్పవలెను ` ఆయన నమ్మదగిన దేవుడు, తన సేవకులను ఆయన జ్ఞాపకము చేసికొనును. మీ గాఢాంధకాల పరిస్థితిలో దేవుడెన్నడు విడువడని మీరు కూడా ఖచ్చితంగా, ధైర్యముగా చెప్పగలరా? మీ దు:ఖము సంతోషంగా మారు దినము కొరకు ఆశతో కనిపెట్టుము.
ప్రార్థన :` ప్రియ ప్రభువైన యేసూ, నీవెంతైన నమ్మదగినవాడవు ! సమస్యలు నన్ను చుట్టుముట్టినప్పుడు గతంలో నీవెన్నడు నన్ను విడువలేదు, గనుక నీవెన్నడును, ఇప్పుడును, ఇది మొదలుకొని తరువాత కూడా ధైర్యముగా నిలిచియుందును. దీనిని బట్టి నీకు యేసు నామమున వందనాలు తండ్రీ, ఆమెన్.
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonlin
Comments