top of page

11, మార్చి 2025 మంగళవారము || శనివారము

చదువుము : 1 కొరింథీ 6:12-20


మన దేహమును గూర్చి ఎంత శ్రద్ధ కలిగియున్నాము ?


‘‘మీ దేహము మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమైయున్నదని మీరెరుగరా ?’’ - 1 కొరింథీ 6:19


దేవాలయము అను మాట చెప్పబడినప్పుడెల్ల ఏ విశ్వాసానికి చెందిన ఏ సాధారణ వ్యక్తిjైునను అది ఒక పవిత్ర స్థలము అని భావించుదురు. ఇక్కడ మనమే పరిశుద్ధాత్మకు ఆలయము అనియు, ఎందుకంటే పరిశుద్ధాత్మ మనలో నివసించును అని ఈ దిన వాక్యభాగములో మనము చూస్తాము.


ప్రియ మిత్రులారా, ఈ గొప్ప సత్యమును గూర్చి మనమనేకసార్లు గుర్తించకుండ ఉందుము. ఆత్మను గూర్చి మనమెంతగానో మాట్లాడుదుము గానీ మన దేహాలను గూర్చి నిర్లక్ష్యముగా ఉందుము. మనము ఆహారమును ఎక్కువగా తినుచుందుము లేదా సరైన హారము తగిన సమయంలో తీసికొనక ఉంటాము. మనము ఆరోగ్యంగా ఉండునట్లు మంచి ఎక్సర్సైజులు కూడా భౌతికంగా చేయ నిర్లక్ష్యం చేయుదుము. మన శరీరాలను శుభ్రముగా ఉంచుకొనుటకు క్రమంగా స్నానము చేయుటను, కడుగుకొనుటకు కూడా నిర్లక్ష్యం చేయుచుందుము. మనము చేయకూడని వాటిని కూడా కొన్నిసార్లు చేయుచుందుము. మనలను మనము పరిశీలించుకొందము. వెళ్ళకూడని ప్రదేశాలకు మన కాళ్ళు నడుచుచున్నవా ? మన చేతులు శుద్ధమైనవిగా ఉన్నవా, అవినీతి నుండి దూరంగా ఉన్నవా ? పుకార్లు, చాడీలు, గుసగుసలు చెప్పుకొనుటకు మన నోటిని వాడుచున్నామా ? మన దృష్టి సరిగానే ఉన్నదా ? ‘‘మీ కుడి కన్ను మాకు అభ్యంతరంగా ఉంటే దానిని పెరికిపారవేయుడి... అనియు, మీ కుడిచేయి మీకు అభ్యంతరకారణంగా ఉంటే దానిని పెరికిపారవేయుడి’’ అని మత్తయి 5:29,30లో యేసు చెప్పెను. కొరింథీయులకు పౌలు వ్రాయుచు, ‘‘జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు’’ (1 కొరింథీ 6:18) అని చెప్పుచున్నాడు. గనుక మనము జాగ్రత్త కలిగియుందము. మన ప్రతి క్రియ దేవుని మహిమపరచునట్లు ఉన్నదని నిశ్చయత ఉన్నదా ? లేనిచో, మన ప్రతి అవయవమును వ్యక్తిగతముగా సిలువ చెంత ఉంచి యేసురక్తము చేత కడుగబడుదము. మన దేహాలను పరిశుద్ధాత్మకు పరిపూర్ణమైన నివాస స్థలములుగా ఉండునట్లు చేయుదము.
ప్రార్ధన:- ప్రియ ప్రభువా, నా ఆత్మ పరిశుద్ధతన గూర్చియే ఎక్కువగా ధ్యానించితిని గానీ, నా దేహము పరిశుద్ధాత్మకు ఆలయము గనుక దానిని కూడా పరిశుద్ధముగాను, నిందారహితముగాను ఉంచుకొనవలెనని గ్రహించలేకపోతిని. నా దేహముతో నిన్ను ఘనపరచుటకు సహాయము చేయమని యేసు నామమున వేడుచున్నాను తండ్రీ, ఆమెన్.


తేనెధారలు

 

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonline.com

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page