top of page

11, నవంబర్‌ 2024 సోమవారము || తేనెధారలు

చదువుము : 1 తిమోతి 6:6-12


ఈ రెండిరటిలో నీకేది కావలెను

‘‘క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గానీ నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును’’ (యోహాను 6:27)

ఆవలి ఒడ్డున కపెర్నహూమునకు ఆయన వెంబడి వెళ్ళిన జనులతో మన ప్రభువు ఈ మాటలు పలికెను. అయితే ఆయన చేసిన అద్భుతాలను బట్టి కాక మునుపు ఆయన వారికి రొట్టెలు, చేపలు ద్వారా ఆకలి తీర్చి తృప్తిపరచినందుననే వారాయనను వెంబడిరచిరి అని ఆయన ఎరిగియుండెను. ఇదెంత విచారకరము ! తాత్కాలికమైన, క్షయమైన ఈ లోక సంబంధమైన ఆహార, వస్త్రాలు, ధనము మొ॥వాటిని గూర్చి సువార్త పుస్తకాలలో ప్రభువు ఎలా ప్రత్యేకించి నొక్కి చెప్పెనో మనము చదువుదుము. మత్త 6:25లో ‘‘ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చిjైునను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చిjైునను చింతింపకుడి. ఆహారము కంటె ప్రాణమును, వస్త్రము కంటె దేహమును గొప్పవి కావా ?’’ అని ఆయన చెప్పెను. 33వ వచనములో ‘‘కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి. అప్పుడవన్నియు మీకనుగ్రహింప బడును’’ అని చెప్పియున్నాడు. మరల మత్తయి 6:19-20లో భూమి మీద మీకొరకే ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు, అని ఆయన చెప్పియున్నను, దానికి భిన్నముగా భవిష్యత్తు కొరకు ప్రయాసపడి మరెక్కువగా ధనము సంపాదించుకొని అది ఎన్నటికి వారితోనే ఉండునని జనులు తలంచుట మనము గమనించవచ్చు. మనము బ్రదుకుటకు తప్పక కష్టపడి పనిచేసి సంపాదించుకొనవలసియున్నది. కానీ ఇదే మన జీవిత ధ్యేయము కాకూడదు. క్రైస్తవులలోను కొందరు ధనము సంపాదించుటకు దేవుని రాజ్యపరిచర్య చేయుట ఎంతో విచారకరము.

ప్రియ స్నేహితులారా, మన ప్రభువైన యేసు మాటలు మనకు హెచ్చరికగా ఉండును గాక. విలాసవంతమైన ఇండ్లు, ఖరీదైన వస్త్రాలు, ఆహారము, మొ॥ వాటియందు ఆసక్తి కలిగియుండక, అవి త్వరగా గతించిపోవునని, బుద్ధిమంతుడైనవాడు చెప్పినట్లు అవి గాలికి కొట్టుకొనిపోవు, అర్థములేనివి అని జాగ్రత్తపడుదము. మనము ప్రభువు పరిచర్య చేసినట్లయితే, సమృద్ధిjైున ఆత్మల పంటకోసి, తరువాత ప్రభువుచేత ‘‘భళా, నమ్మకమైన మంచి దాసుడా నీవు చక్కగా పనిచేసితివి’’ అని మెప్పును కూడా పొందుదుము.


ప్రార్దన:-నిత్యుడగు దేవా, ఈ లోకము, దాని ఐశ్వర్యము శాశ్వతమైనవి కావని నాకు గుర్తు చేసినందుకు వందనాలు. ఒకరోజు నేనైనను వాటిని విడువవచ్చు లేదా అవిjైునను నా నుండి తీసివేయబడవచ్చు. గనుక శాశ్వతమైన నీ రాజ్య పరిచర్య చేయుటలో మరింత సమయము ఖర్చు చేయుటకు సాయము చేయుమని యేసునామమున ప్రార్ధించుచున్నాను తండ్రీ, ఆమెన్‌.

 

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI - 59.

Office: +91 9444456177 || https://www.honeydropsonline.com

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page