top of page

11, అక్టోబర్ 2024 శుక్రవారము చదువుము : కొలస్సీ 3:16,17

తేనెధారలు

ఆయన మహిమ ప్రకాశించు వరకు యేసువైపు చూడుము

‘‘నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొనియున్నది, ... ఆలకింపుము ... నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు’’ - ప.గీతము 5:2


‘‘దేవునికి కనబరచుకొను సమయమువంటిదే ప్రార్థన. మన ఆత్మలు ఫోటోగ్రాఫిక్ ప్లేట్లు వంటివి ఉండి, ప్రకాశించు క్రీస్తు రూపమే వెలుగైయున్నది. స్వచ్ఛమైన వేడి సూర్యుని వంటి ఆయన నీతిమంతమైన జీవమునకు మన జీవితాలనెంత కనబరచుకొంటే (అది ఐదు, పది, పదిహేను, ముప్పది నిమిషాలైన లేక దినమునకొక గంటjైునను) అంత ఎక్కువగా ఆయన ప్రతి రూపము మన స్వభావము మనలో వెలిగింపబడును. ఆయన ప్రేమ, ఆయన కనికరము. ఆయన నమ్మకత్వము, ఆయన యదార్థత, ఆయన దీనత్వము’’ అని ఆర్. కెంట్ హ్యూస్గారు వ్రాసిరి. ‘‘ఎడతెగక ప్రార్థన చేయుడి’’ అని పౌలు థెస్సలోనీయులకు చెప్పెను (1 థెస్స 5:17). అయితే ‘‘అలా ఎడతెగక ప్రార్థించుట సాధ్యమేనా ?’’ అని మనమడుగవచ్చు. నిజమే మన పని పాటలలో ఉన్నప్పుడు దేవునితో మాట్లాడుచు ఎడతెగక ప్రార్థించుట అసాధ్యమే కావచ్చు కానీ, ప్రతి సమయమందును ఆయనతో సంభాషించుట మన ఆత్మకు సాధ్యమే. బ్రదర్. లారెన్స్ అను భక్తిపరుడైన ఒక సన్యాసి ఎడతెగకుండా చేసిన తన అనుభవమును తాను వ్రాసిన ఒక పుస్తకం ‘‘దేవుని సన్నిధిని సాధన చేయుట’’లో ఇలా వివరించెను : నా ప్రార్థనా సమయాన్ని నా పనివేళ ఏ మాత్రము ఆటంకపరచదు. అలాగే నా వంటగది నుండి వచ్చు శబ్దాలు, వివిధ విషయాల కొరకు అదే సమయంలో చేయు ఫోన్లు, ఇవేమియు నన్ను కలతపరచవు కానీ నేను ఎంతో ప్రశాంతంగా మోకాళ్ళ మీద ఉండి దేవుని చేత ఆవరింపబడి నట్లుందును’’. జాన్ వెస్లీగారు కూడా ఎంతో నిరాడంబరంగా తన ప్రార్థనా అనుభవమును ఇలా వివరించిరి.


‘‘అతని హృదయము అన్ని సమయాలలోను, అన్ని స్థలాలలోను దేవుని వైపే చూచు చుండును. ఈ విషయంలో అతడెన్నడు, ఆటంకపర చబడలేదు, ఏ వ్యక్తిచేత గానీ, ఏ విషయంవలన గానీ అతడు అంతగా అభ్యంతర పరచబడలేదు. పదవీ విరమణ గానీ, కంపెనీ సెలవు కాలంగానీ, వ్యాపారము లేక చర్చలలో గానీ అతని హృదయము ఎల్లవేళల దేవునితో ఉన్నది. అతడు పడుకున్నను, లేచినను అతని ఆలోచనలన్నిటిలోను దేవుడే ఉన్నాడు. అతడు దేవునితో ఎడతెగక నడుచుచు అదృశ్యంగా ఉన్న ప్రతి విషయాన్ని ప్రతిచోట ఆయన ప్రేమగల దృష్టికి దేవుని మీదనే ఉంచెను.ప్రియ మిత్రులారా, మనకవసరమై నప్పుడు మాత్రమే దేవుని సన్నిధికి వచ్చుచున్నామా లేక ఎల్లవేళల ఆయనతో సహవాసం చేయుచున్నామా ? భక్తులు, దైవజనులు మాత్రమే ఎడతెగక ప్రార్థన చేయవలెనని చెప్పవలదు. ఏ భేదము లేకుండా ప్రతి క్రైస్తవుడు అలా చేయవలెనని దేవుని చిత్తము. మనము వంట చేయుచున్నను, నిరంతరాయంగా దేవునితో అంతరంగములో మాట్లాడుచు ఉందుము. క్షణక్షణం ఆయనవలె రూపాంతరము చెందుదము.


ప్రార్దన:` ప్రేమగల ప్రభువా, ప్రార్థన, విజ్ఞాపన ఆత్మను నాలో కుమ్మరించుము. ప్రతి క్షణము నీతో నా ఆత్మ సంభాషణ చేయుచు ఎల్లవేళల నీ మధుర సన్నిధిననుభవించు కృపనిమ్ము. నీ మహిమ నాపై ప్రకాశించువరకు నీ ముఖమునే చూచుచుండుటకు సాయము చేయుమని యేసునామమున ప్రార్ధించుచున్నాను తండ్రీ, ఆమెన్.

 

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonlin

Comentarios

Obtuvo 0 de 5 estrellas.
Aún no hay calificaciones

Agrega una calificación
bottom of page