top of page

10, మార్చి 2025 సోమవారము || శనివారము

చదువుము : కీర్తన 37:1-9


దేవుడే చూచుకొనును - ధైర్యము తెచ్చుకొనుడి


‘‘దేవుడు చేయు పనులన్నియు శాశ్వతములని నేను తెలిసికొంటిని... మనుష్యులు తనయందు భయభక్తులు కలిగియుండునట్లు దేవుడిట్టి నియమము చేసియున్నాడు’’ - ప్రసంగి 3:14


ఇద్దరు దేవదూతలు ఈ భూలోకమును దర్శించుచుండిరి. ఒకరు చాలాకాలం నుండి ‘‘పరిచర్య’’ చేయుచు ఉండిన అనుభవజ్ఞుడు, మరొకరు ఈ మధ్యనే వచ్చినవాడు. చీకటి పడుచున్నందును వారొక ప్రదేశములో బసచేయవలెననుకొనిరి. అప్పుడు వారొక పెద్ద భవనము వద్దకు వెళ్ళి తలుపుతట్టి ఆ రాత్రి ఉండుటకు అనుమతినడుగగా ఆ ఇంటి యజమాని మొదట కోపముతో కేకలు వేసినను ఆ తరువాత వారు ఎంతో ప్రాధేయపడు చుండిరి గనుక ఆ భవంతి క్రింది భాగములో ఉండుటకు అనుమతించెను. తెల్లవారినప్పుడు వారు అక్కడి నుండి బయలుదేరు సమయములో ఆ అనుభవజ్ఞుడైన దూత వారున్న నేలమీద ఉండిన ఒక పెద్ద రంధ్రమును తన చేతిని ఊపి మూసివేసి ఆశ్చర్యంలో చూస్తున్న అతని సహచరునితో ‘‘మనకు కనబడుచున్నట్లు ఏది ఉండవు’’ అని చిరునవ్వుతో చెప్పెను. రెండవ రోజు రాత్రి బీదవాడైన ఒక రైతు ఇంటికి వెళ్ళగా అతడు వారిని సాదరంగా ఆహ్వానించెను. వారికి అతడు తన పడకనిచ్చి, తాను, తన భార్య చల్లగా ఉన్న క్రింద నేలపై నిద్రించిరి. ఆ రాత్రి ఆ రైతు యొక్క ఆవు చనిపోగా ఆ జూనియర్ దూత ఆశ్చర్యపడెను. మరల ఆ పెద్ద దూత ‘‘కనబడుచున్నట్లే ఏదీ ఉండదు’’ అని చెప్పెను. ఆ తరువాత పరలోకానికి వెళ్ళినప్పుడు దీనిని గూర్చి అడిగి తెలిసికొనగోరి తనకంటె అనుభవజ్ఞుడైన ఆ దూతను ఆ చిన్నదూత ఇలా అడిగెను. ఆ కఠినాత్ముడైన రైతు ఇంటిలోని రంధ్రమును పూడ్చివేసి అతనికెందుకు సాయం చేసితివి, ఆ పేద రైతు ఆవు చనిపోతే నీవెందుకు పట్టించుకోలేదు ? అప్పుడు అతడు ఇచ్చిన జవాబేమనగా, ఆ ధనవంతుని ఇంటిలోని నేల క్రింద బంగారు నిధులున్నవి. అయితే దానిని అతడు అనుభవించుట తనకిష్టము లేదు గనుక ఆ రంధ్రమును ఎప్పటికి మూసివేసితిని. కానీ ఆ రైతు ఇంటికి ఆ రైతు మరియు అతని భార్య యొక్క ప్రాణము తీయుటకు మరణదూత వచ్చియుండెను, కానీ ఆ దూత వారి బదులు ఆ ఆవు ప్రాణమును తీసికొనిపొమ్మని అడిగెనని చెప్పితిననెను.


ప్రియ మిత్రులారా, మీరిప్పుడు కష్టకాలములో ఉన్నారని అధైర్యపడకుడి. ప్రతి వివరము చెప్పుమని దేవుని ప్రశ్నించి అడగవద్దు. ఆయన అనంత జ్ఞానములో మనము గ్రహింపలేని ఒక ప్రణాళికతో సమస్తము చక్కగా చేయునని జ్ఞాపకముంచుకొనుడి. గనుక గొప్ప నిరీక్షణతో భవిష్యత్తులోనికి చూచుచు ముందుకే కొనసాగుదము. పరిస్థితులు మనకు కనబడుచున్నట్లు అవి ఉండకపోవచ్చు!
ప్రార్ధన:- ప్రియప్రభువా, దుష్టులు వర్ధిల్లుటయు, నీతిమంతులు శ్రమల పాలగుట చూచునప్పుడు నేను కలవరపడుచున్నాను. నా జీవితంలోను అననుకూల పరస్థితులెదురైనప్పుడు నేనెంతో విచారంతో కృంగిపోవుచున్నాను. కానీ ఏది ఎంతమాత్రము నాకు హాని చేయదనియు, సమస్తము నీ స్వాధీనంలోనే యున్నదని తెలిసికొనుట ఎంత సంతోషము ! యేసు నామములో అట్టి కృపకొరకు ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.


తేనెధారలు

 

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonline.com

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page