09, మార్చి 2025 ఆదివారము || శనివారము
- Honey Drops for Every Soul
- Mar 9
- 2 min read
చదువుము : 1 సమూ 18:1-4
మీ స్నేహము పరస్పరమైనదేనా ?
‘‘నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును...’’ - సామె 17:17
జంతు ప్రపంచంలో సింబియాసిన్ అను ఒక సంబంధమున్నది. అది రెండు రకాల మొక్కలు లేక జంతువుల మధ్య ఉండి ఇరుపక్షాలు సహజీవనం ద్వారా ప్రయోజనం పొందునదైయున్నది. పారాసిటిజమ్కు పూర్తి విరుద్ధమైనదైయున్నది. ఈ రకము రెండు సహజీవనం చేయునప్పుడు ఒక దానినుండి మరొకటి మాత్రమే లాభము పొందును. ప్రియ మిత్రులారా, మన స్నేహము ఎల్లప్పుడు ఒక ప్రక్కనుండియేకాక పరస్పర సంబంధమై యుండవలెను. యోనాతాను మరియు దావీదుల మధ్య ఉండిన స్నేహమును గూర్చి మనమీ దిన వాక్యభాగంలో చదువుదుము. యోనాతాను దావీదుతో ఏకమనస్కుడై తనను తాను ప్రేమించుకొనినట్టే అనిని ప్రేమించెను. యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన పిల్లును, నడికట్టును తీసి దావీదునకిచ్చెను. అదేమంత గొప్ప త్యాగము కాదని మనము తలంచవచ్చు కానీ, వాస్తవానికి యోనాతాను తనకు తానుగా రాజుగా ఉండు తన హక్కును, సమస్త అధికారమును, తన గౌరవమును, తన స్థితిగతులన్నిటిని ఇచ్చివేసియుండెను. తన స్నేహితుడైన దావీదు కొరకు తన సొంత ప్రాణమును కూడా అతడు లెక్కచేయలేదు.
దావీదు కూడా యోనాతానును అంతకంటె అధికముగా ప్రేమించెను. 1 సమూ 20లో వారిద్దరు చివరిగా కలిసికొనిన సంఘటన చదువుదుము. మరల ఎన్నడు వారొకరినొకరు చూచుకొనరని వారిద్దరు ఎరిగియుండిరి. వారు ఏడ్చిరి కానీ ‘‘దావీదు బిగ్గరగా ఎక్కువగా ఏడ్చెను’’ అని బైబిలు చెప్పుచున్నది. దావీదు, యోనాతానును ఎంతో అధికంగాను, యదార్థముగాను ప్రేమించుననునది సుస్పష్టమే. తన స్నేహితుని సింహాసనమును కబళించవలెనను ఎట్టి రహస్య తలంపులు అతనికి లేకుండెను. చివరగా, తమ స్నేహమును బట్టి ప్రయాణము చేసికొని విడిపోయిరి. ఈ ప్రమాణము వారు స్నేహము, యదార్థతకు సంబంధించినదై ఒకరితో ఒకరు చేసికొనినదే కాక వారిరువురి సంతతికి కూడా చెందినదైయుండెను. యోనాతాను మరణించిన తరువాత అతని కుమారుడు, కుంటివాడునైన మెఫీబోషెతునకు దయచూపించుట చేత దావీదు తన నిబంధనను నెరవేర్చెను. ఎంతో ఘోరమైన పరిస్థితినైనను సహించి తీర్మానము తీసికొనునట్టి యోనాతాను, దావీదుల స్నేహము త్యాగపూరితమైనదిగా లేదా ? మన స్నేహము కూడా ఆ విధముగానే ఉండవలెను. అది పరస్పర సంబంధం కలిగినదిగా ఉండును గాక. స్నేహితుడైనవాడు సహోదరుని కంటె హత్తుకుని యుండునని మరువకయుందము.
ప్రార్ధన:- పరమ తండ్రీ, ఎంతో ప్రేమ గల స్నేహితుని, నాకనుగ్రహించినందుకు వందనాలు. మన స్నేహము పరస్పర త్యాగపూరితముగా ఉండును గాక. ఒకరి సంతోషము, దు:ఖములలో ఒకరు నిజముగా పాలుపంచుకొను కృపనిమ్ము. మేము కలిగియున్నదంతయు ఉమ్మడిగా పంచుకొనుచు, నీ ప్రేమలో మా స్నేహము వేరుపారునట్లు సహాయము చేయుమని యేసు నామమున వేడుచున్నాను. తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonline.com
Comments