చదువుము : లూకా 13:22-30
ప్రవేశము లేదు అని చెప్పకముందే లోనికి ప్రవేశించుము
‘‘ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి...’’ (లూకా 13:24)
‘‘పోరాటము’’ అను ఈ మాటకు ప్రయాసపడుట, కుస్తీ పట్టుట, ఒత్తిడితో సొమ్మసిల్లుట అని అర్థము. మనమెంతో పోరాడి, శత విధాల ప్రయత్నించి పరలోక రాజ్యము ప్రవేశించవలెనని యేసు చెప్పుచున్నాడు. దేనికొరకు మనము పోరాడవలెనని యేసు కోరుచున్నాడు ? ప్రభువు యొక్క ముఖదర్శనమును ముఖాముఖిగా చూచువరకు ఏ మాత్రము లొంగని, మొండి, బలమైన ఈ లోకము, శరీరము, అపవాది అను వాటితో మనము గెలవలేము. మనము మెలకువ కలిగి, సిద్ధముగా ఉండనట్లయితే వాటిచేత ఓడిరపబడి, నశించిపోవుదుము గనుక జాగరూకులమై యుండుడని ప్రభువు ఆజ్ఞాపించుచున్నాడు. అది ఎడతెగకయు, మన జీవితాల ద్వారా వెల్లడియగునట్లు ఉండవలెను. అనగా, మనమెన్నడును ఆదమరచి ఉండరాదని, ఎందుకనగా ఈ క్షయమైన విరోధులు వారి ఆయుధాలను ఎన్నడు త్యజించవు.
ప్రియ మిత్రులారా, ద్వారము ఇరుకైనదని, అది స్వనీతిని, ఈ లోక మహిమలను, ఘనతలను అనుమతించదు. జాగ్రత్త కలిగియుందము. ఇప్పుడు ఆ ద్వారము తెరవబడియున్నది. కానీ ఒక దినాన అది మూయబడి, ఎంత ప్రయత్నించినను ప్రవేశింపలేదు. ప్రవేశించుటకు మనము పోరాడవలెను. మన ఆత్మలకు అనేకమైన శత్రువులున్నారు. ఆ ద్వారములోనికి ప్రవేశించుమను బోధ వినుట మాత్రమే సరిపోదు. దానిలోనికి తప్పక ప్రవేశింపవలెను. క్రీస్తునందు విశ్వాసము, మారుమనస్సును గూర్చి బోధ మన హృదయాలను కదిలించనిదే అది నిష్ప్రయోజనము. ఈ దినము ఆయన స్వరము వినినట్లయితే మన హృదయాలను కఠినపరచుకొనక ఉందము. ఆలస్యము ప్రమాదకరము. యజమాని ద్వారము మూసివేస్తే మన ఆత్మకు పరలోక రాజ్యములోనికిని, దేవుని సన్నిధికిని ఎన్నటికి ప్రవేశము లేకుండా అడ్డుకొనబడుదుము. నిరంతరము కృపాద్వారము తెరువబడియుండదు.
ప్రార్దన :- ప్రియ ప్రభువా, ఇరుకు ద్వారమున ప్రవేశించుటకు అనుదినము అని విధాల పోరాడుచు, లోకము, శరీరము, అపవాది అను విరోధులతో మెలకువ కలిగి పోరాడు కృపనిమ్ము. ఏ మాత్రము అశ్రద్ధగా ఉండక ద్వారము మూయబడి లోనికి ప్రవేశించుటకు వీలుకాని పరిస్థితి రాకముందే జాగ్రత్త కలిగి కొనసాగునట్లు దయచేయుమని యేసునామమున ప్రార్ధించుచున్నాను తండ్రీ, ఆమెన్.
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI - 59.
Office: +91 9444456177 || https://www.honeydropsonline.com
Comments