తేనెధారలు
మనము వెనుదీయు విశ్వాసులముగా ఉన్నామా ?
‘‘నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారుమనస్సు పొంది...’’ (ప్రక 2:5)
క్రైస్తవుడనబడువారి జీవితంలో పాపము ఎక్కువై దేవుని పట్ల అతని విధేయత తగ్గిపోయినప్పుడు వెనుదిరగడమనేది సాధారణమే. దైవకార్యాల విషయమై పట్టించుకొనక ఆత్మీయ సోమరిగా ఉండుటచేత కలుగునదే ఆ పరిస్థితి. అలా వెనుకకు తగ్గిన క్రైస్తవులు ఇంకను యేసును వారి ప్రభువుగా ఎరిగిన క్రైస్తవులుగానే ఉండినను ఒకప్పుడు ఎవరి ప్రేమను రుచి చూచిరో ఆయనతో సన్నిహిత సంబంధమును, ప్రేమను కోల్పోయిరి. దేవుని మంచితనమునకు అద్భుతమైన సాక్ష్యముగా ఉండుటకు బదులుగా వారికిని, లోకస్తులకు వ్యత్యాసము ఇప్పుడు కనబడుటయే కష్టంగా ఉన్నది. క్లుప్తంగా చెప్పవలెనంటే క్రైస్తవత్వమునకు వారొక చెడ్డ ప్రచార ప్రకటనలుగా ఉన్నారు. ఇట్టివారెంతో నికృష్ట స్థితిలో ఉన్నవారు. ఎందుకంటే అతడు కానీ ఆమె కానీ మునుపు ప్రభువుతో మంచి సంబంధం కలిగి, పాపము నుండి రక్షింపబడినవారే అయినప్పటికి రక్షణానందమందు అనుభవించు ధన్యకరమైన స్థితి నుండి పడిపోయిరి.
ప్రియ మిత్రులారా, వెనుదిరుగు స్థితి డప్పుకొట్టినట్లు బహిరంగంగా రాదు. అది నిశ్శబ్దంగాను, మెల్లగాను, చాలా సున్నితంగాను ఆరంభమగును. క్రైస్తవ జీవితము ఒక మంచు కొండను ఎక్కినంత గొప్ప పని వంటిది. కొండ ఎక్కునప్పుడు మనము జారుతూ ఎక్కలేము. ప్రతి అడుగు పదునుగా ఉన్న మంచు గడ్డలను చెక్కుచు వేయవలసియుండును. నిరంతరాయముగా ప్రయాసపడుచు ఆ మంచును ముక్కలు ముక్కలుగా పగులగొట్టుచు, చెక్కుచు ఉంటేనే మనము ముందుకు వెళ్ళగలము. అలా చేయకయే ముందుకు వెళ్ళినచో ఖచ్చితంగా జారిపడుదుము లేదా వెనుదిరుగుదుము. మనమెన్నటికి స్థిరంగా నిలువలేము. జాగ్రత్తపడుదము. శరీరానుసారమైన మన పాప స్వభావము ‘‘అబద్దాలు చెప్పుటలో ఆరితేరినది’’ గనుక మనము పాపము చేసినను దానినుండి బయట పడవచ్చు అని మనలను నమ్మించుచు ఎల్లప్పుడు మనలను మోసగించుటకు చూచుచుండును. గనుక లోతైన పశ్చాత్తాపములోను, యదార్ధమైన విశ్వాసముతోను గతము నుండి మన వెనుదిరిగిన స్థితిని పరిశీలించుకొని, ఇప్పటి మన రక్షణను, భవిష్యత్తులో దొరుకు నిత్యజీవమును స్థిరముగా దేవునితో నడుచుట మీదనే ఆధారపడియుండునని మనము గుర్తుంచుకొందము.
ప్రార్దన :- మా రక్షణకర్తjైున ప్రభువా, నీ మార్గములనుండి నీ వాక్యమునుండియు వైదొలగి, మునుపు నీతో నాకుండిన మంచి సహవాసమును కోల్పోతినని ఒప్పుకొనుచున్నాను. క్రైస్తవుడనని చెప్పు కొనుటకు తగినవాడను కాను గనుక నన్ను క్షమించి, నా మార్గములను సరిచేసి మరొక్కసారి రక్షణా నందము పొందు కృపననుగ్రహించమని యేసునామమున ప్రార్ధించుచున్నాను తండ్రీ, ఆమెన్
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonlin
Comments