08, మార్చి 2025 శనివారము || శనివారము
- Honey Drops for Every Soul
- Mar 8
- 2 min read
చదువుము : యోహాను 17:1-5
పరలోకమందున్న మన తండ్రి
‘‘... మీరు దత్తపుక్రతాత్మను పొందితిరి, గనుక మనము అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టు చున్నాము’’ - రోమా 8:15
ప్రభువైన యేసు తన పరిచర్య ఆరంభములో దేవునిని తన తండ్రి అని అనేక సందర్భాలలో పిలిచెను. వాటిలో కొన్ని ఆయన పండెండ్రేళ్ళ వయసులో ఉన్నప్పుడు ‘‘నేను నా తండ్రి పని మీద ఉండవలసియున్నది’’ అని యేసు చెప్పెను. లూకా 10:21లో ఆయన ఆనందంతో నిండుకొని ‘‘పరలోకమునకు, భూలోకమునకు తండ్రీ, నేను నిన్ను స్తుతించుచున్నాను,...’’ అని ప్రార్థించెను. ‘‘ఆయన ఆకాశమువైపు కన్నులెత్తి : ‘‘తండ్రీ, నీ కుమారుని మహిమపరచుము, ఆ ఘడియ వచ్చియున్నది...’’ అని యోహాను 17:1 చెప్పుచున్నది. సిలువపై ఉండియు ఆయన తన ఆత్మను అప్పగింపక ముందు తన చివరి మాటలుగా ‘‘తండ్రీ, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను’’ అని పలికెను. (లూకా 23:46). అలాగే తన శిష్యులకు ప్రార్థన నేర్పినప్పుడు ‘‘పరలోకమందున్న మా తండ్రీ...’’ అని దేవుని పిలుచునట్లు వారిని ప్రోత్సాహపరచెను. ఈ ధన్యత యేసుప్రభువు తన శిష్యులకు మాత్రమే కాక ఎవరైతే తిరిగి జన్మించి విశ్వాస కుటుంబములో చేర్చబడుదురో అట్టి విశ్వాసులందరికిని ఇచ్చెను. యోహాను 1:12 చెప్పుచున్నదేమనగా, ‘‘తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను’’.!
మనమాయనను ‘‘అబ్బా తండ్రీ’’ అని పిలుచునప్పుడెల్ల ఆయనతో మన సంబంధము సన్నిహితంగాను, వ్యక్తిగతముగాను మారును. ఇందుచేతనే మనమాయన సింహాసనము చెంతకు ధైర్యముగా రాగలము. అధికారములో ఉన్న ఒక ప్రిన్సిపాల్గారో, ఒక ఆఫీసరో లేక ఒక ప్రెసిడెంటుగారో ఎవరైనను మనము వారి వద్దకు వెళ్ళలేకపోవచ్చు, కానీ దేవుడు మన తండ్రి గనుక ఆయన మనలను సంతోషంగా స్వీకరించును గనుక ఎంతో సులువుగా ఆయన వద్దకు సమీపించగలము. దేవునిని ‘‘తండ్రీ’’ అని పిలుచుటలో అనేక విషయాలున్నవి. మొదటిగా, తండ్రిjైున దేవుడు మన సృష్టికర్త, సర్వసృష్టికర్త. రెండవదిగా, తండ్రిjైున దేవుడు ఈ లోకతండ్రి తన కుటుంబమును కాపాడుటకంటె ఎక్కువగా కాపాడువాడు. మూడవదిగా, తండ్రిjైున దేవుడు మన పోషకుడు. పక్షులను, పూవులను పోషించు దేవుడు ఆయన సొంత పిల్లలమైన మనలను పోషించడా ? తండ్రిjైున దేవుడు మన గురించి చింతించుచున్నాడు గనుక మన పాపాల నిమిత్తము మరణించుటకు ఆయన తన అద్వితీయ కుమారుని అనుగ్రహించునంతగా మనలను ప్రేమించుచున్నాడు. ప్రియ మిత్రులారా, వీలైనంతగా దేవునిని మన తండ్రీ అని పిలిచి ఈ ధన్యతను మనమెందుకు ఉపయోగించుకొనకూడదు ?
ప్రార్ధన:- పరలోకమందున్న మా తండ్రీ, ఈ లోక తండ్రికంటె అధికంగా నీవు నన్ను గూర్చి చింతించుచున్నావు గనుక నేను నిన్ను ప్రేమించుచున్నాను., నా పాపాల నుండి నన్ను రక్షించుటకు నీ ఏకైక కుమారుని అనుగ్రహించునంతగా నీవు నన్ను ప్రేమించితివి. ‘‘అబ్బా, తండ్రీ’’ అని నిన్ను పిలుచునప్పుడెల్ల నాకెంత గొప్ప ఆదరణ ! యేసు నామమున కృతజ్ఞతలు తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonline.com
Comments