top of page

08, నవంబర్ 2024 శుక్రవారం || తేనెధారలు

చదువుము : లూకా 13:10-13


ధన్యకరమైన దేవుని సన్నిధి

‘‘... సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు... పురికొల్పవలెను’’ (హెబ్రీ 10:24-25)

ఈ దిన వాక్యభాగంలో చెప్పబడిన నడుము వంగిపోయిన స్త్రీ 18 సం॥ల నుండి పైకి సూర్యునివైపు, లేక ప్రకాశవంతముగా వెలిగే నక్షత్రాలను గానీ చూచియుండలేదు. ఆమె తప్పనిసరిగా వంగిన స్థితిలోనే బ్రదుకుచు ఆమె ముఖము ఈ నేలమీద మంటిని చూచునే ఉండెను. సాయం చేయుమని ఈ స్త్రీ ఖచ్చితంగా దేవుని వేడుకొనియుండవచ్చు, అయినప్పటికి ఆమెకు విడుదల రాలేదు. అయినను దేవుడామెను పట్టించుకోనట్లనిపించినను అది ఆమెలో కోపము, పగను పెంచలేదు. ఆమె ప్రతి సబ్బాతు దినాన ఎంత బాధాకరంగా ఉండినను నమ్మకముగా వెళ్ళుచుండెను. ఆమె సమాజ మందిరంలో బహుశా వెనుక వరుసలో కూర్చొని యుండవచ్చు. అయితే యేసు ఆమెను గుర్తించి ముందుకు పిలిచి, ఒక్కమాట, ఒక తాకిడి ద్వారా ఆమెను బంధించియుంచిన అపవాది బంధకాలను తెంచివేసి ఆమెను విడిపించెను.


... సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు... పురికొల్పవలెను’’ - హెబ్రీ 10: 24,25
ప్రియ స్నేహితులారా, యేసు చూపిన ఆ కనికరమును చూచిన మనకది గొప్ప ధైర్యమును కలిగించలేదా ? మనమొక వేళ ఆమె వలె ‘‘మానసికంగాను, ఆత్మీయంగాను, భౌతికంగా కూడా వైకల్యముతో’’ ఉన్నామేమో. మనుష్యులు మనలను పట్టించుకొనకపోవచ్చు లేక ఏమియు చేయలేని స్థితిలో ఉండవచ్చు కానీ యేసు మనలను చూచుచున్నాడు, ఆయన వాక్యశక్తి చేత మనలను తాకి స్వస్థపరచవలెనని కోరుచున్నాడు. మనము చేయవలసినదెల్ల ఆయన సన్నిధిలో ఉండుటకు తృష్ణకలిగి ఉండుటయే. ఒకసారి ఆలోచించుడి - ఆ స్త్రీ ఆ దినాన సమాజ మందిరమునకు వెళ్ళియుండకపోతే ఆ గొప్ప దీవెన పోగొట్టుకొనియుండేది. దీవెనకరమైన దేవుని సన్నిధియుండు స్థలములో మనము ఉండనందున ఎన్ని ఆశీర్వాదాలను మనము కోల్పోతిమోకదా ! మనము పట్టువదలకయుందము. ఇప్పుడే మనము జవాబు పొందనప్పటికి విశ్వాసములో కొనసాగుచు, ఆయన పరిశుద్ధత ఆలయంలో దేవుని నారాదించుచుందము. ఆ స్త్రీ వలెనే మనమును యేసుప్రభువు యొక్క స్వస్థతను పొంది, మన విడుదలను పొందు ఒక సమయమున్నది. 


ప్రార్దన :- మమ్మునెప్పుడు విడువని దేవా, నేనాశించిన దీవెన ఎంతో కాలం నుండి పొందకపోయినను దానిని బట్టి నీ సన్నిధికి దూరమవక నీవేమైయున్నావో దానిని బట్టి నా శక్తి అంతటితో నిన్ను వెదకునట్లును, నీ సన్నిధిలో నా ప్రాణమునకు విశ్రాంతి పొందు కృపననుగ్రహించుమని యేసునామమున ప్రార్ధించుచున్నాను తండ్రీ. ఆమెన్.

 

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI - 59.

Office: +91 9444456177 || https://www.honeydropsonline.com

Коментарі

Оцінка: 0 з 5 зірок.
Ще немає оцінок

Додайте оцінку
bottom of page