తేనెధారలు
లోకంలో ఉన్నను, లోక సంబంధివి కావు
‘‘నీవు లోకము నుండి వారిని తీసికొని పొమ్మని నేను ప్రార్థించుట లేదు గాని దుష్టుని (కీడు) నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను’’ (యోహాను 17:15)
యోహాను 17 అ.లో మన మీలోకములో ఉండవలెను గానీ లోకానుసారంగా ఉండకూడదని ప్రభువైన యేసు ప్రార్థించెను. అనగా మనలను ఈ లోకమునుండి తీసికొని వెళ్ళవలెనని కాక మననుండి ఈ లోకాన్ని తీసివేయుమని తండ్రిని ప్రార్థించెను. (యోహాను 17:15,16). నిజమే, మన మీలోకము‘‘లో’’ నివసించవలసినవారము, కానీ ఈ లోకము మన‘‘లో’’ ఉండనియ్యరాదు. నావ నీటిలో ఉండుట మంచిది కానీ నావలో నీరు ఉండుట మంచిది కాదు. ఇది పెద్ద ప్రమాదము ! మన మీ లోకమునుండి వేరుగా బ్రదకవలెనని యేసు చెప్పుట లేదు. ఆలాగైతే ఈ లోకములో ఉప్పుగాను వెలుగుగాను ఉండకుము. (మత్తయి 5:13-16) అలాగైతే మనమేమి చేయవలెను ? కొలస్సీ 3:2,3లో పౌలు చెప్పుచున్నట్లు మనము పై నున్న వాటి మీదనే గానీ ఈ భూలోక విషయాలపై మనస్సుంచరాదు. ఎందుకనగా మనము ఈ లోకానికి చనిపోయినవారము, ఇప్పుడు మన జీవము క్రీస్తుతో కూడా దాచబడియున్నది. కాల్విన్గారు చెప్పినట్లు ‘‘ఒక క్రైస్తవుని మనసు భూలోక విషయాలతో నిండియుండక లేక వాటియందు తృప్తిని వెదకుకొనరాదు. ఎందుకనగా మన మీలోకమును ఏ క్షణమైనను విడువవలసినట్లుగా బ్రదుకవలసియున్నది.
ప్రియ స్నేహితులారా, ఈ లోక ఆకర్షణలకును మన స్వార్ధపూరిత ప్రేరణలకును నిరంతరము దూరంగా ఉంచవలసియున్నది. అనుదిన సంఘటనలతో మనము వ్యవహరించ వలసియున్నను అవి మనలను చిక్కులలో పడవేయకుండా కాచుకొనవలసి యున్నది. ఈ భౌతికమైన వాటిని మన జీవితాలలో ప్రాముఖ్యమైనవిగా మారి మన హృదయాలలో పాతుకొని పోకుండా చూచుకొనవలెను. క్రీస్తు కొరకు జీవించుచు ఆయనను మాత్రమే సంతోషపరచవలె ననునదియే మన గురి, గమ్యమైయుండవలెను. (2 తిమోతి 2:4). ఇదంత సులువైనదేమి కాదు కానీ పరిశుద్ధాత్మ శక్తితో మనమాలాగు చేయగలము.
ప్రార్దన :- ప్రియప్రభువా, నే నీ లోకంలో ఉన్నను నే నీ లోక సంబంధిని కానని గుర్తుపెట్టుకొని ఈ లోకము మరియు అనుదిన జీవితంలో జరుగు వాటి చేత ఈడ్వబడి, లోబడక నీవు నాకనుగ్రహించిన పనికే పూర్ణహృదయంతో అంకితమై నిన్ను మాత్రమే సంతోషపరచుటయే నా గురిjైు యుండుటకు కృపనిమ్మని యేసునామమున ప్రార్ధించుచున్నాను తండ్రీ. ఆమెన్.
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonlin
Comentarios