07, ఏప్రిల్ 2025 సోమవారము || యేసు నామ ఉచ్ఛరణలో స్వస్థత
- Honey Drops for Every Soul
- 3 days ago
- 1 min read
తేనెధారలు చదువుము : యోహాను 9:1-7
‘‘... ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతనొందితిరి’’ - 1 పేతురు 2:24
యేసుక్రీస్తు ఈ లోక రక్షకడేలాగో అలాగే మనుష్యుల మనసు, శరీరానికి కూడా స్వస్థపరచువాడు. మత్తయి 4:23-25లో రోగులందరిని ఆయన స్వస్థపరచెనని మనము చదువుదుము. అనేక విధాలుగా ఆయన వారిని బాగుచేసెను. కొన్ని సందర్భాలలో ఆయన వారిని తాకి స్వస్థపరచెను. ‘‘ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు’’ అని ఒక కుష్ఠురోగి ఆయన ముందర మోకరించి అడిగెను. అప్పుడు యేసు తన చేయి చాపి వానిని తాకి, స్వస్థపరచెను (మత్తయి 8:2-4). అయితే కొన్ని సందర్భాలలో ఒక్క మాట సెలవిచ్చి ఒక గొప్ప ఉదాహరణ. అతని ఇంటిలోకి ప్రవేశించక మునుపే కేవలం ఒక మాట సెలవిచ్చినప్పుడు ఇంటి వద్ద ఎంతో క్లిష్టపరిస్థితిలో ఉండినవాడు వెనువెంటనే స్వస్థతపొందెను. గ్రుడ్డివారిని స్వస్థపరచుటకు ప్రభువు విభిన్నమైన విధానాలను ఎంచుకొనెను. యోహాను 9లో ఆయన తన ఉమ్మితో బురద చేసి ఆ గ్రుడ్డివాని కండ్ల మీద పూసి సిలోయము అను కోనేటిలో కడుగుకొనుమని చెప్పెను ! మొండి వ్యాధులను కూడా యేసు స్వస్థపరచెను. 18 సం॥ల నుండి నడుము వంగిపోయిన ఒక స్త్రీని, 38 సం॥ల నుండి పడియుండిన ఒక పక్షవాయు రోగిని ఆయన స్వస్థపరచెను. ఈ అన్ని సందర్భాలలోను ఆయన వారి రోగమును మాత్రమే కాక వారి ఆత్మలను కూడా స్వస్థపరచి వారికి రక్షణనిచ్చెను.
ప్రియ మిత్రులారా, నా శరీరమందలి ప్రతి బాధ ఇప్పుడే యేసు నామమున పోవును గాక. యేసుప్రభుని పునరుత్థాన శక్తి నా దేహమంతటి నుండి నడినెత్తి మొ॥ అరికాలి వరకు ప్రవహింపచేసి నా ప్రతి కణము స్వస్థత పొంది, నీవు రూపించినప్పటివలెనే అది పనిచేయును గాక అని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.
ప్రార్ధన:- ప్రియమైన తండ్రీ, నేను కూడా యిర్మియా వంటి అనుభవము కోరుచున్నాను. నీ వాక్యమందు నా కొరకు ఆనందము, సంతోషము, మరెన్నో దాచి ఉంచితివని నేనెరుగుదును. కానీ నీ వాక్యమును క్రమముగా చదువుటలేదని తెలిసికొంటిని. నీ వాక్యమందు నీవేమి చెప్పితివో దానిని చదువుటకు నాకు అత్యాసక్తి ననుగ్రహించుమని యేసు నామమున వేడుచున్నాను. తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonline.com
Yorumlar