06, మార్చి 2025 గురువారమ || శనివారము
- Honey Drops for Every Soul
- Mar 6
- 1 min read
చదువుము : జెకర్యా 4:1-14
ఎడతెగక పరిశుద్ధాత్మతో నింపబడుము
‘‘పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు’’ - అపొస్తలుల కార్యములు 1 : 8
చెరనుండి వచ్చి దేవుని ఆలయమును పునర్మించుచున్న యూదా పెద్దjైున జెరుబ్బాబెలును, ప్రధాన యాజకుడైన యెహోషువాను బలపరచుటకు తన ప్రవక్తjైున జెకర్యాకు ఒక దర్శనమిచ్చెను. కట్టు విషయంలో వారెంతో వ్యతిరేకత ఎదుర్కొనినందున ‘‘శక్తి చేతకాదు, బలము చేతకాదు, నా ఆత్మ ద్వారానే దీనిని చేయను’’ అని జెకర్యా ద్వారా ఒక బలమైన వర్తమానము దేవుని వద్దనుండి వారి వద్దకు వచ్చెను. దేవుడు జెకర్యాకు చూపిన దర్శనమేమనగా - సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదెయును, దీపస్తంభమునకు ఏడు దీపములును, దీపమునకు ఏడేసి గొట్టములను కనబడుచున్నవి. మరియు రెండు ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడిప్రక్క ఒకటియు, ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నవి. రెండు బంగారపు కొమ్ములలోనుండి సువర్ణ తైలము ప్రమిదెలోనికి వచ్చుచుండెను. ఆ ఒలీవ చెట్లనుండి నూనె ఆ గొట్టముల ద్వారా వచ్చుచున్నంత కాలము ఆ దీపములు వెలుగుచుండెను.
ప్రియ మిత్రులారా, దేవుని పరిచర్య చేయుటకు ప్రతి క్షణము మనకు పరిశుద్ధాత్మ నింపుదల అవసరమని ఆ దర్శనము వెల్లడి చేయుచున్నది. నిన్నటి శక్తితో ‘‘మనము పరిచర్య చేయలేము. మనమొకవేళ మన తెలివి, బలములతో చేయుటకు ప్రయత్నిస్తే ఖచ్చితంగా విఫలమవుదుము. అ.కార్య 10:38 చెప్పుచున్నదేమనగా ‘‘దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను, శక్తితోను అభిషేకించెను’’ అనునదియే. తనకు స్వతహాగా ఉన్న దైవత్వముతో ఆయన పరిచర్య నారంభించలేదుకానీ, పరిశుద్ధాత్మతో అభిషేకింపబడిన మీదటనే. దేవుని కుమారుడే పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడవలసియుండగా ప్రతి దినము మనమెంతగా అభిషేకింపబడవలసియున్నది ? మన ఆత్మీయశక్తి తరిగిపోయినట్లు మనము గ్రహించుచున్నామా? అలా గుర్తించినపుడు నూతనపరచబడి, ఉజ్జీవింపబడునట్లు మనలను మనము తగ్గించుకొని దేవుని కృప కొరకు వేచియుందము. ఆయనతో ఎడతెగని సహవాసము కలిగియుండుట ద్వారా ప్రతి క్షణము నిరంతరాయముగా ఆయన శక్తిని పొందుకొందము.
ప్రార్ధన:- పరమ తండ్రీ, నా బలము, నా శక్తి చేత నీ పరిచర్య చేయలేను, కానీ నీ గొప్ప పరిచర్య చేయుటకు పరిశుద్ధాత్మ నింపుదల ఎడతెగక కలిగియుండుట సాధ్యమని నేను తెలిసికొంటిని. నీ సన్నిధిలో వేచియున్న నన్ను నూతనముగా నింపుమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonline.com
Comments