05, ఏప్రిల్ 2025 శనివారము || దేవుని ప్రణాళిక మేలైనది, సమంజసమైనదే
- Honey Drops for Every Soul
- 5 days ago
- 1 min read
తేనెధారలు చదువుము : ఆది కాం. 45:3-18 50:19-21
‘మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి...’’ - రోమా 8:28
‘‘అన్నిటిని కలగలిపి తనను ప్రేమించు వారికి మేలు కలుగునట్లు చేయునని మనమెరుగుదుము’’ అని విలియం బార్ల్కేగారు ఈ వచనమును వివరించిరి. సమస్తము అనగా ఖచ్చితంగా ఏదంటే అదియే. ప్రతిది దేవుని స్వాధీనమందే ఉన్నది. అవి అనారోగ్యము, నిరుత్సాహము, మరణము, విడిపోయిన సంబంధాలు, తిరుగుబాటు చేయు పిల్లలు కష్టపడుచున్నను ఫలితము లేని పరిచర్య మొ॥ ఇవన్నియు మన మేలు కొరకే పనిచేయునని మనమనుకొందుమా ! అవును ! మన జీవితంలోని ప్రతి చిన్న విషయమును గూర్చి దేవుడు లక్ష్యము చేయును. మన జీవితంలోని ప్రతి పరిస్థితి దేవుడే నిర్దేశించెను. అనుకోకుండా జరుగునది ఏదియు ఉండదు. తండ్రికి తెలియకుండా ఒక్క పిచ్చుక కూడా నేలరాలదు. ప్రతి విషయము దేవుని చేతనే రూపింపబడి, అనుమతించబడినదై జ్ఞానవంతంగాను, సమంజసముగాను ఉండును.
ప్రతికూల పరిస్థితులలో అవిశ్వాసంతో మనము ‘‘ఇదెలా మేలుకొరకు జరుగును?’’ అని మడుగవచ్చు. జవాబేమనగా, ‘‘గొప్ప వైద్యుడు తన వైద్యము వ్రాసి ముగించువరకు వేచియుండుము’’ అని. యోసేపు జీవితము ఒకదాని వెంబడి ఒకటి విషాదము చేత కొట్టబడెను. అతడు తన తప్పులేకుండానే సొంత సహోదరుల చేత విడనాడబడి, గోతిలో త్రోయబడి ఆ తరువాత బానిసగా అమ్మబడెను. ఆ సమయాలలో ఆ సంఘటనలన్ని తన మేలుకొరకే సమకూడి జరుగుచుండెనని చెప్పుట అతనికి కష్టమైయుండవచ్చు. అయినప్పటికి, అనేక సం॥ల తరువాత అతడు మంచి స్థితిలో ఉన్నప్పుడు ‘‘మీరు హాని చేయ తలపెట్టితిరి గానీ, దేవుడు దానిని మేలుకొరకే ఉద్దేశించెను’’ అని యోసేపు బదులిచ్చెను.
కావున ప్రియ మిత్రులారా, కొన్నిసార్లు మన బలహీనతలలోను, మన బాధ, వైఫల్యాలు, తీవ్రమైన శ్రమలలో దేవుని శక్తిని, ఆయన సన్నిధిని, ఆయన వాగ్ధానమును శపించుటకు శోధింపబడవచ్చు. అట్టి కష్టకాలములో దేవుడు మనలను విడనాడెనని మనము భయపడక ఉందము. ఆయన ఎప్పుడును సమస్తము మంచికొరకే జరిగించును. ఆయన సరైనదే చేయునని ఏదో ఒక రోజు మనము గుర్తించుదుమ.
ప్రార్ధన:- పరమ తండ్రీ, నేనిప్పుడు అనుభవించుచున్న పరిస్థితులెంతో బాధాకరంగా ఉన్నవి. నాకింక ఆశ లేదన్నట్లుగా కనబడుచున్నవి. కానీ, నేను నీ వాక్యమందు నమ్మికయుంచి, ఈ పరిస్థితులన్నిటిలోను నా మేలు కొరకే నీవెంతో చక్కగా జరిగించుచున్నావని యేసు నామమున విశ్వసించుచున్నాను. తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonline.com
Comments