తేనెధారలు
మీ అడుగులు జాగ్రత్త !
‘‘గనుక... జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి’’ (ఎఫెసీ 5:15)
మన ఎలా ‘‘నడుచుకొనవలెనో’’యని పౌలు ఇక్కడ మనకు బోధించుచున్నాడు. మన క్రైస్తవ నడక లేక ప్రవర్తన ఇక ఏ మాత్రము ఈ లోక రీతిగా గానీ, శరీరము, అపవాది అనసారంగా గానీ ఉండకూడదు. (ఎఫెసీ 2:1,2,3) లేదా అన్యులవలె నడుచుకొనరాదు (ఎఫెసీ 4:17). దానికి బదులుగా దేవుని పిలుకు ‘‘తగినట్లుగా’’, ప్రేమ కలిగి ‘‘వెలుగు సంబంధుల’’వలె ఉండవలెను. (ఎఫెసీ 4:1, 5:1, 5:8) మన ఉద్యోగము, మన ఇల్లు, కుటుంబము, మన దుస్తులు, మనమెలా కనబడుచున్నాము అని మనందరము లక్ష్యముంచుదుము. క్రైస్తవులమైన మనము మన క్రైస్తవ జీవితము పట్ల శ్రద్ధ వహించవలెను. దానిని మనమెంతో ప్రాముఖ్యమైనదిగా చూడవలెను. ‘‘బయట నుండి ప్రభావితమయ్యే మన ఇంద్రియాలు ప్రత్యేకించి కండ్లు, చెవులు మీద గట్టి నిఘా పెట్టి ఉంచవలసియున్నది. ఎందుకంటే అవి సాతాను గురిపెట్టియుంచు స్థానాలవి’’ అని విలియమ్ గుర్నాల్గారు చెప్పుచున్నారు. కాంప్బెల్ మోర్గాన్ ఒక సుందరమైన ఉపమానము ఇలా చెప్పిరి - అందమైన ఒక పూతోట చుట్టు ఎత్తైన గోడ కట్టబడియున్న దానిని గూర్చి వర్ణించుచు, దారిన పోవువారిని దూరంగా ఉంచునట్లు దాని ప్రాకారము మీద పగిలిన గాజు ముక్కలు గ్రుచ్చి ఉంచిరి. ఒక దినాన ఒక వల్లి ఎంతో అడుగులు వేస్తూ ఆ గాజుముక్కల మధ్య నడుచుకొంటూ ఏ మాత్రము దాని పాదాలు తెగకుండా నడిచిపోవుటకు అతడు చూచెను. దీనిని బట్టి ఈ పాప లోకంలో ఇలాగా జాగ్రత్తగా నడుచుకొనవలసి యున్నదని డా॥ మోర్గాన్గారు చెప్పుచున్నారు.
ప్రియ స్నేహితులారా, అనుదినము మనము ఎలా నడుచుకొనుచున్నామో, ఎలా మన సమయమును గడుపుచున్నామో జాగ్రత్తగా చూచుకొనవలసియున్నాము. మార్గమంత అపాయకరమైన ఆటంకాలను శత్రువు పెట్టి యుండును గనుక జాగ్రత్తగా అడుగులు వేయుదము. మన క్రైస్తవ సాక్ష్యము పాడుచేయుటకు వాడు రకరకాల వలలు, ఉచ్చులు, బోనులు మన మార్గాలలో వేసియున్నాడు. మనమొక వేళ నిర్లక్ష్యముగా ఉన్నట్లయితే తీవ్రమైన ప్రమాదాల నెదుర్కొనవలసియుండును.
ప్రార్ధన:- ప్రియ ప్రభువా, ఈ కష్ట సమయములో పరిపూర్ణముగా నేను నీకు లోబడుచున్నాను. నన్నును, నా మొండితనమును విరిచి, నన్ను శుద్ధీకరించి అన్నిటికన్నా నిన్నే కోరుకొనునట్లు నీ కృపను నాకు దయచేయుము. నా ప్రస్తుత మరియు భవిష్యత్తు కొరకు నిన్నే నమ్ముటకు సహాయము చేయుము. నీయందే నేనున్నప్పుడు సురక్షితంగా ఉందును. నా ద్వారా నీవు మహిమ పొందుమని యేసునామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonline.com
Comments