top of page

04, నవంబర్ 2024 సోమవారము || తేనెధారలు

చదువుము : సామె 24:17-22


మీ హృదయమునుండి మత్సరమును పెరికివేయుము

‘‘పాపులను చూచి నీ హృదయమందు మత్సరపడకుము, నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగియుండుము’’ - (సామె 23:17)

పొరుగువారో లేక సహోద్యోగులలో కలిగియున్న దానికంటె లేక వారు సాధించిన దానికంటె ఎక్కువగా కానీ కనీసం వారితో సమానంగానైనను ఉండవలెనని ఆశించుటయే అసూయ. మనలో నెమ్మది లేకపోవుటకు ఖచ్చితంగా అసూయ ఒక గొప్ప శత్రువు. ఒక దొంగవలెనే చీకటి ముసుగులో హృదయంలోనికి జొరబడి మన సంతృప్తిని దొంగిలించి వేయును. ‘‘మనలో వసించుచు నెమ్మది లేకుండా చేయు గొప్ప శత్రువులు ఐదు ఏవనగా - దురాశ, కోరిక, మత్సరము, కోపము, గర్వము మొ॥నవి కనుక ఆ శత్రువులను తరిమి కొట్టగలిగితే ఖచ్చితంగా మనము ఎన్నటికి నెమ్మది కలిగియుందము’’ అని పెట్రార్క్ వ్రాసిరి. ఈ ‘‘మత్సరము’’ అనుమాట సామెతలలో ఎక్కువగా కనబడును. ‘‘బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకుము’’ (3:31). ‘‘పాపులను చూచి నీ హృదయమందు మత్సరపడకుము’’ (23:17). ‘‘దుర్జనులను, దుర్మార్గులను చూచి మత్సరపడకుము’’ (24:19). ఈ మత్సరము చాలా త్వరగాను, అనేక కారణాల చేత వచ్చును. తెలివిగల వారిని, పేరు ప్రఖ్యాతి గలవారు ఎంతో గొప్పగా బ్రదుకుచుండుట మనము చూచినప్పుడు మనకు వ్యసనము కలుగును. కీర్తన 73లో ఆసాపు ఈ మత్సరముతో సతమతమగుట మనము చూచుదుము. నీతిమంతులు బ్రదుకుటకే కష్టపడుచుండగాను, దుర్మార్గులు విలాసవంతంగా బ్రదుకుట చూచినప్పుడతని విశ్వాసులు దాదాపుగా కోల్పోయినట్లయినది. చెడుగా బ్రదుకు చెడ్డవారికి దేవుడు మేలు చేయుచున్నట్లు అతనికగుపడెను. అయితే దేవుని నారాధించుటకు ఈ లోక సంబంధమైన సంపద పైనుండి తన దృష్టి మరల్చుకొని దేవుని మీద తిరిగి తన దృష్టి కేంద్రీకరించినప్పుడు అతని వైఖరి మారి తనలోని ఆ అసూయను జయించెను. నమ్మకత్వమునకు నిజమైన బహుమానాలు తరువాత వచ్చుననియు దేవునితో సన్నిహిత సంబంధము కలిగియుండుటయే అన్నిటలో అతి గొప్ప ఐశ్వర్యమైయున్నదని అతడు గ్రహించెను.


	ప్రియ స్నేహితులారా, మత్సరమును మనము పట్టించుకొనకపోతే అది మన ఆత్మకు నాశనకరమైన వ్యాధిగా పరిణమించును. గనుక ఈ దినమే దానిని వేళ్ళతో సహా పెరికి వేయునట్లు దేవుని నాహ్వానించుదము.

ప్రార్ధన:- సకలాశీర్వచనములకు కారణభూతుడవైన నా దేవా, నాకంటె ఎక్కువగా వర్ధిల్లువారిని చూచి అసూయ, పగ ప్రతీకారాలతో ఉండక, నీవు దీవించిన వారిని బట్టి ఆనందించు హృదయమునిచ్చి నాకంటె ఎక్కువైన ప్రజ్ఞ గలవారిని అభినందించునట్లును నాకు కృపనిమ్ము. ఒకానొక దినాన నా నమ్మకత్వమునకు తగిన ప్రతిఫలము నీనుండి తప్పక వచ్చునని నమ్మి యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రీ, ఆమెన్.

 

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI - 59.

Office: +91 9444456177 || https://www.honeydropsonline.com

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page