top of page

04, ఏప్రిల్‌ 2025 శుక్రవారము || వెదకి, కనుగొనిన ఆనందము

తేనెధారలు చదువుము : లూకా 15:3-7


‘‘నేను గొఱ్ఱెల మంచి కాపరిని, నేను నా గొఱ్ఱెలను ఎరుగుదును... గొఱ్ఱెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను’’ - యోహాను 10:14,15


తూర్పు ప్రాంతాలలో కొందరు గొఱ్ఱెల కాపరులు వారి సొంత గొఱ్ఱెలను మేపుచుందురు గానీ ఇతరులు వారి యజమానుల గొఱ్ఱెలను జీతానికి కాయుచుందురు. అతనికి అప్పగించిన ఏ ఒక్క గొఱ్ఱెjైునను తప్పిపోయినట్లయితే అది ఏ క్రూర జంతువు బారిjైునను పడినదని ఋజువు చేయలేనట్లయితే దాని వెల చెల్లించవలసియుండెను. తప్పిపోయిన గొఱ్ఱె అతనికి దొరకనట్లయితే తన సొంత ధనమును ఇచ్చుకొనవలసియుండెను, మరియు అతడు అజాగ్రత్తపరుడైన కాపరియని ఒక అవమానమును కూడా భరించవలసియుండేది. ఈ దిన వాక్యభాగంలో కాపరి తన తప్పిపోయిన గొఱ్ఱె పట్ల ప్రేమ కలిగియుండెను గనుక దానిని వెదకుట కొరకు మిగిలిన 99 గొఱ్ఱెలను దొడ్డిలో విడిచిపెట్టి వెళ్ళెనని మనము చదువుదుము. ఒక పాపి విషయములోను ఆలాగే జరుగును.



ఒక తప్పిపోయిన పాపి తిరిగి రక్షకుని వద్దకు వచ్చినప్పుడు నాలుగు విధాల సంతోషము కలుగును అని వారెన్‌ డబ్ల్యు. వియిర్స్‌బిగారు వ్రాసిరి. తప్పిపోయిన గొఱ్ఱె దొరికినప్పుడు దాని యజమాని యొక్క మృదువైన తాడికి ననుభవించినప్పుడు ఖచ్చితంగా అది ఎంతో ఆదరింపబడి నెమ్మదినొందును. అలాగే మంచి కాపరిjైున యేసును కనుగొనిన వ్యక్తి హృదయంలోను ఒక గొప్ప ఆనందం కలుగును. రెండవదిగా, దానిని కనుగొనిన వ్యక్తికి కూడా ఎంతో ఆనందం కలుగుతుంది. ఎవరినైన మనము క్రీస్తుప్రభువు నొద్దకు నడిపించినప్పుడెల్ల మనమును మన హృదయంలో గొప్ప ఆనందము పొందెదము. మూడవదిగా, దేవుని కుటుంబంలో మరొక ఆత్మ చేర్చబడినదని ఇతరులలో పంచుకొనునప్పుడు వారును మన ఆనందంలో పాల్గొందుదురు. నాల్గవదిగా, ఒక పాపి మారుమనసును పొందినప్పుడు దేవదూతలు పరలోకమందు ఆనందించెను.

ప్రియ మిత్రులారా, తప్పిపోవుట అనగా దేవుని సహవాసమునుండి దూరమవుట. అయితే కనుగొనబడుట అనగా తిరిగి యదార్థస్థితికి వచ్చి దేవునితో సమాధానపడుట అని అర్థము. మనము ‘‘దొరికిన’’ వ్యక్తులముగాను, ‘‘తప్పిపోయిన’’ ఆత్మలను వెదకి కనుగొని క్రీస్తు వద్దకు వారిని నడిపించువారముగా ఉండి దొరికిన ఆనందము కూడా రుచి చూచువారమైయుందము.
ప్రార్ధన:- ప్రియ ప్రభువా, నేనొకప్పుడు తప్పిపోయిన గొఱ్ఱెనే అయినను మంచి కాపరిగా నీవు నన్ను వెదకుటకు దిగివచ్చి నన్ను కనుగొని తిరిగి నీ చెంతకు చేర్చుకొంటివి. నీలో నాకెంత ఆనందం ! నేను కూడా తప్పిపోయిన గొఱ్ఱెలను కలిసికొని వారిని నీ చెంతకు చేర్చి ఆ ఆనందమును చవిచూపు కృపనిమ్మని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్‌.

తేనెధారలు

 

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonline.com

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page